News December 27, 2024

ఈ పుస్తకాల రూపంలో మన్మోహన్ ఎప్పటికీ బతికే ఉంటారు!

image

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆలోచనాపరుడే కాదు మంచి రచయిత కూడా. భారత ఎకానమీ, పాలసీలపై ఆయన పుస్తకాలు రాశారు. అకడమిక్, పాలసీ మేకర్, పొలిటీషియన్‌గా అనుభవంతో ‘Changing India’ పుస్తకాన్ని ఐదు వాల్యూముల్లో అందించారు. ఇండియా ట్రేడ్ పాలసీలపై ‘India’s Export Trends and Prospects for Self-Sustained Growth’, ఆర్థిక అభివృద్ధిలో సమానత్వంపై ‘The Quest for Equity in Development’ పుస్తకాలను రాశారు.

News December 27, 2024

నెలకు రూ.13వేల జీతం.. రూ.21 కోట్ల మోసం!

image

MHలో నెలకు రూ.13వేల జీతం వచ్చే 23 ఏళ్ల ఉద్యోగి ఘరానా మోసానికి పాల్పడ్డాడు. తాను పనిచేసే సంస్థ పేరుతో నకిలీ ఈ-మెయిల్ సృష్టించి, పాత లెటర్ హెడ్‌తో మెయిల్ మార్చాలని బ్యాంక్‌కు లేఖ రాశాడు. వారు అదే నిజం అనుకొని మార్చగా OTPలు కొత్త మెయిల్‌కు వచ్చేవి. ఇలా e-బ్యాంకింగ్‌తో ₹21 కోట్లు పలు ఖాతాలకు తరలించి GFకు 4BHK, ఖరీదైన కార్లు కొన్నాడు. ఇది సంస్థ దృష్టికి రావడంతో పోలీసులను ఆశ్రయించారు.

News December 27, 2024

జపాన్‌లో ‘దేవర’ తాండవం.. ఎప్పుడంటే?

image

జపాన్‌ను తెలుగు సినిమాలు షేక్ చేయనున్నాయి. ఇప్పటికే ప్రభాస్ నటించిన ‘కల్కి’ వచ్చే నెల 3న రిలీజ్‌కు సిద్ధమైంది. దీంతోపాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ సినిమా కూడా జపానీస్‌లో రిలీజ్ కానుంది. 2025 మార్చి 28న ఈ చిత్రం విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీనికి సంబంధించిన టికెట్స్ జనవరి 3 నుంచి అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ‘దేవర’ ఇండియాలో మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.

News December 27, 2024

వర్చువల్‌గా విచారణకు అల్లు అర్జున్

image

TG: తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ కోర్టు విచారణకు వర్చువల్‌గా హాజరుకానున్నారు. ఈ మేరకు నాంపల్లి కోర్టు అనుమతించింది. తొక్కిసలాట కేసులో 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ నేటితో ముగియడంతో కోర్టులో విచారణ జరగనుంది. కోర్టు రిమాండ్ విధించినా AA మధ్యంతర బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. విచారణ నేపథ్యంలో అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ కోర్టుకు చేరుకున్నారు.

News December 27, 2024

ఇద్దరు మహానుభావులను కోల్పోయాం

image

మాజీ ప్రధాని, ఆధునిక భారత పితామహుడిగా పేరొందిన మన్మోహన్ సింగ్‌ను కోల్పోవడం దేశానికి తీరనిలోటు అని నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికే దివంగత పారిశ్రామికవేత్త రతన్‌ టాటా మరణించడంతో ఇద్దరు మహానుభావులను కోల్పోయామంటూ ఆవేదన చెందుతున్నారు. భారత ఆర్థిక వ్యవస్థలో పెనుమార్పులు తీసుకొచ్చిన ఈ దిగ్గజాలకు దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందని పోస్టులు పెడుతున్నారు.

News December 27, 2024

డెడ్ బాడీ పార్శిల్.. మిస్టరీ వీడింది

image

AP: ప.గో జిల్లా యండగండిలో డెడ్ బాడీ పార్శిల్ కేసు కొలిక్కి వచ్చింది. వదిన ఆస్తిని కాజేసేందుకు శ్రీధర్ వర్మ ఓ అమాయకుడిని హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. శవం పేరుతో వదిన తులసిని భయపెట్టాలని చూసిన శ్రీధర్.. ఎవరూ లేని బర్రె పర్లయ్యను చంపేశాడని తెలిపారు. డెడ్ బాడీని పార్శిల్ చేసి అదే రోజు ఆస్తి పత్రాలపై సంతకాలు సేకరించే ప్రయత్నం చేశాడు. వర్మతో పాటు భార్యలు రేవతి, సుష్మను పోలీసులు అరెస్టు చేశారు.

News December 27, 2024

CA ఫలితాలు.. మనోళ్లే టాప్ ర్యాంకర్స్

image

ఛార్టెడ్ అకౌంటెంట్స్(CA) తుది ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు <>icai.nic.in<<>> వెబ్‌సైట్‌లో తమ రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. హైదరాబాద్‌కు చెందిన హేరంబ్ మహేశ్వరి, తిరుపతికి చెందిన రిషబ్ 508 మార్కులతో సంయుక్తంగా ఆలిండియా ఫస్ట్ ర్యాంక్ సాధించారు. కాగా ఈ ఏడాది నవంబర్ 3, 5, 7వ తేదీల్లో సీఎ ఎగ్జామ్స్ జరిగాయి.

News December 27, 2024

మన్మోహన్ విలక్షణ పార్లమెంటేరియన్: మోదీ

image

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భౌతికకాయానికి నివాళులర్పించిన ప్రధాని మోదీ ఆయన సేవలను కొనియాడారు. దేశం, ప్రజల పట్ల ఆయన అంకితభావం స్మరించుకోదగిందన్నారు. పీవీ హయాంలో ఆర్థిక మంత్రిగా దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చివేశారని గుర్తు చేశారు. ఆర్బీఐ గవర్నర్‌ సహా అనేక కీలక పదవులు చేపట్టినా సామాన్య జీవితం గడిపారని కొనియాడారు. ఆయనో విలక్షణ పార్లమెంటేరియన్ అని మోదీ కీర్తించారు.

News December 27, 2024

మన్మోహన్ జీవితం ఎందరికో స్ఫూర్తి

image

మన్మోహన్ సింగ్ జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం. కష్టపడి చదివితే ఏదైనా సాధించవచ్చని ఆయన నిరూపించారు. పేద కుటుంబంలో జన్మించిన ఆయన ఆధునిక భారతదేశ పితామహుడిగా మార్చింది చదువు, తెలివితేటలే. అమెరికా అధ్యక్షుడు ఒబామాతో సమావేశమైన తర్వాత ఆయన జ్ఞానానికి ముగ్ధుడై సింగ్‌కు సెండాఫ్ ఇచ్చేందుకు వైట్‌హౌస్ బయటకొచ్చి గౌరవించారు. 2014లో మాజీ ప్రధాని అయ్యాక జపాన్‌ రెండో అత్యున్నత పురస్కారంతో సత్కరించారు.

News December 27, 2024

US: 240 ఏళ్ల తర్వాత బాల్డ్ ఈగల్‌కు జాతీయ పక్షి హోదా

image

అమెరికా జాతీయ పక్షిగా బాల్డ్ ఈగల్‌ను అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ఈ మేరకు కాంగ్రెస్ ఆమోదించిన బిల్లుపై ఆయన సంతకం చేశారు. 1782 నుంచి ఈ పక్షిని అమెరికా చిహ్నంగా వాడుతున్నా అధికారిక హోదా మాత్రం కల్పించలేదు. 240 ఏళ్ల తర్వాత బైడెన్ దీనికి ఇటీవల ఆమోద ముద్ర వేశారు. ఈ పక్షికి తెల్లటి తల, పసుపు రంగు ముక్కు, గోధుమ రంగులో శరీరం ఉంటుంది.