News April 26, 2024

రెండో దశ పోలింగ్ 60.7%@5PM

image

దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు/యూటీల్లో 88 స్థానాలకు జరిగిన లోక్‌సభ రెండో విడత ఎన్నికల్లో పోలింగ్ శాతం ఆశించినంత నమోదు కాలేదు. 5 గంటలకు 60.7% మాత్రమే నమోదైంది. మణిపుర్, ఛత్తీస్‌గఢ్, బెంగాల్, అస్సాం, త్రిపుర రాష్ట్రాల్లో పోలింగ్ 70% దాటింది. మరోవైపు యూపీ, బిహార్, మహారాష్ట్రలో అత్యల్ప పోలింగ్ శాతం నమోదైంది. యూపీలో 52.6%, బిహార్‌లో 53%, మహారాష్ట్రలో 53.5%గా రికార్డ్ అయింది. <<-se>>#Elections2024<<>>

News April 26, 2024

త్రిపుర ఓటర్లూ.. మీరు గ్రేట్

image

లోక్‌సభ ఎన్నికలు ఇతర రాష్ట్రాల్లో నీరసంగా సాగుతుంటే ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో మాత్రం ఉత్సాహంగా జరిగాయి. తొలి విడత, ఈరోజు జరిగిన రెండో విడత ఎన్నికల్లోనూ అత్యధిక పోలింగ్ శాతం నమోదైన రాష్ట్రంగా త్రిపుర టాప్‌లో ఉంది. ఈ రాష్ట్రంలో తొలి విడతలో 80.17% పోలింగ్ నమోదైతే, రెండో విడతలో 5 గంటలకు 76.23%గా రికార్డ్ అయింది. మరోవైపు మణిపుర్‌లో 76.06%, బెంగాల్‌లో 71.04% పోలింగ్ నమోదైంది. <<-se>>#Elections2024<<>>

News April 26, 2024

LS PHASE 2: ఈసారీ ఓటర్లు నిరాశపర్చారు!

image

ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ప్రజలు ఆసక్తి చూపించకపోవడం చర్చనీయాంశమైంది. తొలి విడతలో ఆశించిన స్థాయిలో పోలింగ్ శాతం (66.1%) నమోదు కాలేదు. ఇప్పుడూ అదే రిపీటైంది. రెండో దశ పోలింగ్ శాతం 3 గంటలకు 50.3%గా రికార్డ్ అయింది. 2019 ఎన్నికలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. 2019లో తొలి విడత 69.9%, రెండో విడత 70.1%గా నమోదయ్యాయి. భానుడి భగభగలు ఇందుకు ఓ కారణం కావొచ్చని విశ్లేషకుల అంచనా. <<-se>>#Elections2024<<>>

News April 26, 2024

మరోసారి తండ్రైన కృనాల్ పాండ్య

image

టీమ్ ఇండియా క్రికెటర్ కృనాల్ పాండ్య మరోసారి తండ్రయ్యారు. ఆయన భార్య పంఖురి శర్మ ఈనెల 21న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఆమెకు ‘వయు’గా నామకరణం చేశారు. ఈ విషయాన్ని కృనాల్ పాండ్య సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇది చూసిన ఫ్యాన్స్ పాండ్య దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. వీరికి ఇప్పటికే కవిర్ అనే కుమారుడు ఉన్నారు. కాగా కృనాల్ ప్రస్తుతం IPLలో లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

News April 26, 2024

ప్రతిపక్షాల కల చెదిరిపోయింది: మోదీ

image

VVPAT వెరిఫికేషన్‌పై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేయడాన్ని ప్రధాని మోదీ స్వాగతించారు. ‘EVMలపై ప్రజల్లో అనుమానాలు రేకెత్తించి ప్రతిపక్షాలు పాపం చేశాయి. దశాబ్దాల పాటు స్వేచ్ఛగా ఓటు వేయనివ్వలేదు. రిగ్గింగ్ సాధారణం అయిపోయింది. ఇప్పుడు EVMలతో ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేస్తుంటే జీర్ణించుకోలేకపోతున్నారు. బ్యాలెట్ వ్యవస్థ తిరిగిరాదని కోర్టు తేల్చిచెప్పడంతో వారి కల చెదిరిపోయింది’ అని విమర్శించారు.

News April 26, 2024

ప్రతిపక్షాల కల చెదిరిపోయింది: మోదీ

image

VVPAT వెరిఫికేషన్‌పై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేయడాన్ని ప్రధాని మోదీ స్వాగతించారు. ‘EVMలపై ప్రజల్లో అనుమానాలు రేకెత్తించి ప్రతిపక్షాలు పాపం చేశాయి. దశాబ్దాల పాటు స్వేచ్ఛగా ఓటు వేయనివ్వలేదు. రిగ్గింగ్ సాధారణం అయిపోయింది. ఇప్పుడు EVMలతో ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేస్తుంటే జీర్ణించుకోలేకపోతున్నారు. బ్యాలెట్ వ్యవస్థ తిరిగిరాదని కోర్టు తేల్చిచెప్పడంతో వారి కల చెదిరిపోయింది’ అని విమర్శించారు.

News April 26, 2024

రైతు కుమారుడికి ఆల్ ఇండియా నంబర్ 1 ర్యాంకు

image

మహారాష్ట్రకు చెందిన నీల్‌కృష్ణ గజారే JEE మెయిన్ ఫలితాల్లో దేశంలోనే నంబర్ 1 ర్యాంకు సాధించారు. అతని తండ్రి నిర్మల్ వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వాషిమ్‌ జిల్లాలోని బెల్ఖేడ్‌ అనే మారుమూల గ్రామం వారిది. పరీక్షలకు సిద్ధం కావడానికి నీల్ రెండేళ్లుగా ప్రతిరోజూ 10 గంటల సమయం కేటాయించాడని అతని తండ్రి తెలిపారు. తన కొడుకు ఫస్ట్ ర్యాంక్ సాధించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.

News April 26, 2024

బరువు తగ్గించుకునేందుకు సర్జరీ.. యువకుడి మృతి

image

బరువు తగ్గించుకోవాలనుకున్న యువకుడు ఏకంగా ప్రాణాలే కోల్పోయాడు. పుదుచ్చేరికి చెందిన హేమచంద్రన్(26) బరువు తగ్గించుకునేందుకు చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. అయితే చికిత్స ప్రారంభించిన 15 నిమిషాలకే అతనికి గుండెపోటు వచ్చినట్లు సమాచారం. దీంతో హేమచంద్రన్‌ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. దీనిపై స్పందించిన తమిళనాడు వైద్యశాఖ 2 రోజుల్లో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కమిటీని నియమించింది.

News April 26, 2024

రెండో దశ పోలింగ్ పూర్తి

image

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశ వ్యాప్తంగా రెండో దశ పోలింగ్ ముగిసింది. 13 రాష్ట్రాల్లో 88 లోక్‌సభ స్థానాల్లో ఇవాళ పోలింగ్ జరిగింది. అన్ని విడతల పోలింగ్ పూర్తయిన తర్వాత జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. మే 7న మూడో విడతలో 12 రాష్ట్రాల్లోని 94 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

News April 26, 2024

గాలి జనార్దన్ రెడ్డి నుంచి రక్షించండి: జేడీ

image

కర్ణాటక BJP నేత గాలి జనార్దన్ రెడ్డి నుంచి తనను రక్షించాలని CBI మాజీ JD, JBNP చీఫ్ వీవీ లక్ష్మీనారాయణ పోలీసులను కోరారు. ఈ మేరకు ఆయన వైజాగ్ సీపీ రవిశంకర్‌కు వినతిపత్రం సమర్పించారు. గతంలో జనార్దన్‌ను అరెస్ట్ చేసినందుకు విశాఖలో తనను అంతమొందించేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కాగా 2011లో అక్రమ మైనింగ్ కేసులో బళ్లారిలో గాలి జనార్దన్‌ను లక్ష్మీనారాయణ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.