News December 26, 2024
సీఎంతో భేటీపై నిర్మాణ సంస్థ ట్వీట్
సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన మీటింగ్‌పై నిర్మాణ సంస్థ SVC ట్వీట్ చేసింది. ‘తెలంగాణ ప్రభుత్వం & టాలీవుడ్ ప్రతినిధుల మధ్య ఫలప్రదమైన సమావేశం జరిగింది. సీఎం రేవంత్ దూరదృష్టి గల నాయకత్వాన్ని అభినందిస్తున్నాం. షూటింగ్‌లకు HYDని గ్లోబల్ హబ్‌గా మార్చేందుకు DY.CM భట్టి, మంత్రి కోమటిరెడ్డి కట్టుబడి ఉన్నారు. టాలీవుడ్ TG ప్రభుత్వానికి మద్దతునిస్తుంది. డ్రగ్స్ నిర్మూలన పోరాటంలో పాల్గొంటుంది’ అని తెలిపింది.
Similar News
News January 16, 2025
ఖో ఖో వరల్డ్ కప్: క్వార్టర్ ఫైనల్‌కు భారత్
ఖో ఖో వరల్డ్ కప్‌లో భారత పురుషుల జట్టు వరుసగా 3 మ్యాచుల్లో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్ చేరింది. నిన్న పెరూతో జరిగిన మ్యాచులో 70-38 తేడాతో గెలుపొందింది. మ్యాచ్ మొత్తం ప్రత్యర్థిపై ఆధిపత్యం కొనసాగించింది. మరోవైపు మహిళల జట్టు ఇరాన్‌పై ఘన విజయం సాధించింది. 100-16 తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసి క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఇవాళ పురుషుల జట్టు భూటాన్‌తో, మహిళల జట్టు మలేషియాతో పోటీ పడనున్నాయి.
News January 16, 2025
తిరుమలలో విషాదం.. మూడేళ్ల బాలుడి మృతి
AP: తిరుమలలో విషాదం చోటు చేసుకుంది. బస్టాండ్ సమీపంలో పద్మనాభ నిలయం భవనంపై రెండో అంతస్తు నుంచి కింద పడి మూడేళ్ల బాలుడు మరణించాడు. నిన్న సాయంత్రం ఈ ఘటన జరిగింది. స్వామివారి దర్శనం కోసం కడపకు చెందిన శ్రీనివాసులు ఫ్యామిలీతో తిరుమలలోని పద్మనాభ నిలయానికి వచ్చారు. అతని రెండో కుమారుడు సాత్విక్(3) ఆడుకుంటూ వెళ్లి కిందపడటంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించినా చికిత్స పొందుతూ మరణించాడు.
News January 16, 2025
హమాస్ చెరలో 100 మందికిపైగా బందీలు
ఇజ్రాయెల్‌పై దాడి చేసిన హమాస్ మిలిటెంట్లు 250 మందిని కిడ్నాప్ చేయగా ఇప్పటికీ వీరిలో 100 మందికి పైగా బందీలుగానే ఉన్నారు. వీరిని విడుదల చేసేందుకు అంగీకారం కుదిరినా కనీసం మూడింట ఒక వంతు మంది ప్రాణాలతో లేరని సమాచారం. ఇదే నిజమైతే ఇజ్రాయెల్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.