News June 23, 2024

40 ఏళ్లలోపు వారిలో ప్రబలుతున్న క్యాన్సర్

image

భారత్‌లో 40 ఏళ్లలోపు వారిలో క్యాన్సర్ తీవ్రస్థాయిలో ప్రబలుతోంది. ఢిల్లీకి చెందిన క్యాన్సర్ ముక్త్ భారత్ ఫౌండేషన్ అధ్యయనం ప్రకారం దేశంలో 20శాతం క్యాన్సర్ రోగులు 40 ఏళ్లలోపు వారే. వీరిలో 60శాతం మంది యువకులు, 40శాతం మంది యువతులు ఉన్నారు. అతిగా ప్రాసెస్ చేసిన ఆహారం, మద్యపానం, ధూమపానం, ఊబకాయం, ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం వంటివే ఈ పెరుగుదలకు ప్రధాన కారణాలని వైద్య నిపుణులు వివరిస్తున్నారు.

News June 23, 2024

పవన్‌తో రేపు సినీ నిర్మాతల సమావేశం

image

AP: డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌తో రేపు మధ్యాహ్నం సినీ నిర్మాతలు విజయవాడ క్యాంప్ ఆఫీస్‌లో సమావేశం కానున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సందర్భంగా ఎన్డీయే సర్కారుకు అభినందనలు తెలియజేయడంతో పాటు చిత్ర పరిశ్రమ సమస్యల్ని కూడా ఆయనకు వివరించనున్నట్లు తెలుస్తోంది. వీరిలో అశ్వినీదత్, చినబాబు, నవీన్, రవిశంకర్, నాగవంశీ, విశ్వప్రసాద్, బోగవల్లి ప్రసాద్, డీవీవీ దానయ్య, దిల్ రాజు తదితరులున్నారు.

News June 23, 2024

‘కల్కి’ టికెట్లు విడుదల.. నిమిషాల్లో థియేటర్లు హౌజ్‌ఫుల్

image

ప్రభాస్ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న ‘కల్కి 2898AD ’ టికెట్ల బుకింగ్ ప్రారంభం అయింది. Book My Show, Paytm Ticketsలో ఆన్‌లైన్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే బుకింగ్ మొదలైన నిమిషాల్లో చాలా థియేటర్లు హౌజ్‌ఫుల్ అయ్యాయి. నాగ్‌అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈనెల 27న వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది.

News June 23, 2024

సుప్రీంకోర్టుకు కేజ్రీవాల్

image

లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇటీవల ఆయనకు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీనిపై ఈడీ ఢిల్లీ హైకోర్టుకు వెళ్లడంతో న్యాయస్థానం బెయిల్‌పై స్టే విధించింది. బెయిల్‌పై విచారణ ముగిసేవరకు కేజ్రీవాల్‌ను విడుదల చేయొద్దని సూచించింది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ తాజాగా సుప్రీంకోర్టుకు వెళ్లిన ఆయన రేపు విచారణ చేపట్టాలని కోరారు.

News June 23, 2024

ఏపీ నీ తాత ఖర్జూరపు నాయుడు జాగీరా లోకేశ్?: నందిగం

image

‘ఏపీ నీ తాత రాజారెడ్డి జాగీరా?’ అంటూ మాజీ CM జగన్‌ను <<13494215>>విమర్శించిన<<>> మంత్రి లోకేశ్‌పై మాజీ MP నందిగం సురేశ్ మండిపడ్డారు. ‘లోకేశ్.. అధికార మదంతో పిచ్చిగా వాగుతున్నావ్. AP నీ తాత ఖర్జూరపు నాయుడు జాగీరా? NTR నుంచి మీ నాన్న పార్టీని, డబ్బులనూ కొట్టేశారు. జూబ్లీహిల్స్‌లో 5 ఎకరాలను మీ కుటుంబ ట్రస్టు పేరు మీదకు మార్చుకున్నారు. APలో రూ.2వేల కోట్ల విలువైన స్థలాలను TDP ఆక్రమించుకుంది’ అని దుయ్యబట్టారు.

News June 23, 2024

రాష్ట్రంలో 2 రోజులు భారీ వర్షాలు

image

ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, మన్యం, వైజాగ్, కాకినాడ, తూ.గో, కోనసీమ, ఏలూరు, ప.గో, గుంటూరు తదితర జిల్లాల్లో భారీ వానలు పడొచ్చని పేర్కొంది. రేపు మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, తూ.గో, కృష్ణా, ప్రకాశం, తిరుపతి, కడప తదితర జిల్లాలో మోస్తరు వర్షం పడే ఛాన్స్ ఉందని వివరించింది.

News June 23, 2024

కెనరా బ్యాంకు ట్విటర్ ఖాతా హ్యాక్

image

కెనరా బ్యాంకు అధికారిక ట్విటర్‌ ఖాతా హ్యాకింగ్‌కు గురైంది. హ్యాకర్లు @canarabank అని ఉన్న హ్యాండిల్ పేరును ‘ether.fi’గా మార్చారు. తమ బృందం ఖాతా రికవరీ కోసం కృషి చేస్తోందని, త్వరలోనే తిరిగి సాధారణ స్థితికి తీసుకొస్తామని ఓ ప్రకటనలో సంస్థ తెలిపింది. తమ ట్విటర్ అకౌంట్‌కు ఎవరూ పోస్టులు లేదా సందేశాలు పంపొద్దని విజ్ఞప్తి చేసింది. కెనరా ట్విటర్ ఖాతాకు 2.55 లక్షలమంది ఫాలోవర్లు ఉన్నారు.

News June 23, 2024

CM అంటే కటింగ్ మాస్టరా?: కేటీఆర్

image

TG: ప్రతి పథకంలో లబ్ధిదారుల సంఖ్యకు కోతపెట్టడమే లక్ష్యమా? CM అంటే కటింగ్ మాస్టరా? అని KTR ఫైరయ్యారు. ‘మొన్న రూ.500 సిలిండర్, నిన్న 200 యూనిట్ల పథకాలకు లక్షల మందిని దూరం చేశారు. నేడు ₹2 లక్షల రుణమాఫీని ఎగ్గొట్టాలని చూస్తే ఊరుకోం. మొదట్లో ₹39 వేల కోట్లు అని ఇప్పుడు ₹31 వేల కోట్లకు కటింగ్ పెట్టారు. రేషన్ కార్డు, ఆదాయపు పన్ను సాకులుగా చూపి ప్రజలకు శూన్య హస్తం చూపితే ఊరుకోం’ అని Xలో హెచ్చరించారు.

News June 23, 2024

అమరావతిలో కేంద్ర సంస్థలు.. CRDA సంప్రదింపులు

image

AP: అమరావతి పునర్నిర్మాణం దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాజధానిలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటుకు CRDA అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఆయా కంపెనీల ప్రతినిధులతో సంప్రదింపులు చేస్తున్నారు. 2014-19 మధ్య CAG, RBI, CBI, FCI, CPWD, NID, నాబార్డ్, SBI, LIC, HPCL తదితర కార్యాలయాలకు అమరావతిలో భూములు కేటాయించారు. ఆ స్థలాలను తమకు చూపిస్తే నిర్ణయం తీసుకుంటామని ప్రతినిధులు తెలిపినట్లు సమాచారం.

News June 23, 2024

మా వెబ్‌సైట్ హ్యాక్ కాలేదు: NTA

image

NEET పరీక్ష నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) వెబ్‌సైట్ హ్యాక్ అయిందంటూ జరుగుతున్న ప్రచారంపై సంబంధిత సంస్థ స్పందించింది. తమ సైట్, వెబ్ పోర్టలన్నీ భద్రంగా ఉన్నాయని పేర్కొంది. హ్యాకింగ్ ప్రచారం తప్పుదోవ పట్టించేదని, దాన్ని నమ్మొద్దని సూచించింది. కాగా నీట్ పేపర్ లీక్ కావడంపై NTAపై తీవ్ర విమర్శలొస్తున్న విషయం తెలిసిందే.