News December 26, 2024
టాలీవుడ్‌ను రేవంత్ టార్గెట్‌గా చేసుకున్నారు: అమిత్ మాలవీయ
CM రేవంత్ రెడ్డిపై BJP IT సెల్ చీఫ్ అమిత్ మాలవీయ తీవ్ర విమర్శలు గుప్పించారు. తన అదుపాజ్ఞల్లో ఉండనందుకు, డబ్బు ఇవ్వనందుకు తెలుగు సినీ పరిశ్రమపై రేవంత్ కక్షగట్టారని మండిపడ్డారు. ‘రేవంత్ నేతృత్వంలోని తెలంగాణ కాంగ్రెస్ సర్కారు టాలీవుడ్‌ను లక్ష్యంగా చేసుకుంది. తెలుగు స్టార్లు, నిర్మాతలపై ప్రతీకారం తీర్చుకుంటోంది. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రేవంత్ సర్కారు చెడ్డపేరును మూటగట్టుకుంది’ అని విమర్శించారు.
Similar News
News January 22, 2025
కర్ణాటక ప్రమాదం.. సీఎం దిగ్భ్రాంతి
కర్ణాటకలో జరిగిన <<15220489>>రోడ్డు ప్రమాదంలో <<>>ఏపీ వాసులు మృతి చెందడంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముగ్గురు వేద పాఠశాల విద్యార్థులు మృతి చెందడం తనను ఆవేదనకు గురిచేసిందని Xలో పోస్ట్ చేశారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి అవసరమైన వైద్య సాయం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వేద విద్యార్థులతో పాటు డ్రైవర్ కుటుంబాన్ని కూడా ఆదుకుంటామని సీఎం భరోసా ఇచ్చారు.
News January 22, 2025
హైదరాబాద్‌లో HCL కొత్త టెక్ సెంటర్
HYDలో పెట్టుబడి పెట్టేందుకు మరో ప్రతిష్ఠాత్మక కంపెనీ ముందుకొచ్చింది. హైటెక్ సిటీలో కొత్త టెక్ సెంటర్ ఏర్పాటు చేస్తామని HCL ప్రకటించింది. దావోస్‌లో జరుగుతున్న WEFలో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. కొత్త టెక్ సెంటర్ ఏర్పాటుతో 5వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. లైఫ్ సైన్సెస్, ఫైనాన్షియల్‌తో పాటు క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ సేవలు విస్తృతంగా అందుబాటులోకి రానున్నాయి.
News January 22, 2025
భారీగా పెరిగిన బంగారం ధరలు
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.860 పెరిగి రూ.82,090 పలుకుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.750 పెరిగి రూ.75,250కి చేరింది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. కేజీ వెండి ధర రూ.1,04,000గా ఉంది.