India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. ఈరోజు సమావేశం ప్రారంభం కాగానే స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో పాటు పలువురు మంత్రులు పలు అంశాలపై సభలో మాట్లాడారు. కాగా ఈరోజు వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు సభకు గైర్హాజరయ్యారు.
TG: బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి లక్షల మందికి సేవలందిస్తోందని CM రేవంత్ అన్నారు. 24వ వార్షికోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దీన్ని దేశంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దారని కొనియాడారు. అటు ఆసుపత్రి సేవల విస్తరణ కోసం CM సహకారం కోరామని, అందుకు ఆయన అంగీకరించారని నందమూరి బాలకృష్ణ తెలిపారు. దీని సేవల విస్తరణకు 10ఎకరాలు కేటాయించాలని కోరినట్లు BRS నేత నామా నాగేశ్వరరావు అన్నారు.
టీమ్ ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గాయం నుంచి కోలుకున్న ఆయన NCAలో ప్రాక్టీస్ ప్రారంభించారు. సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగే టెస్ట్ సిరీస్ లేదా ఆ తర్వాత న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్‌లో షమీ ఆడనున్నట్లు సమాచారం. గత ఏడాది వన్డే వరల్డ్ కప్ అనంతరం షమీ శస్త్ర చికిత్స చేయించుకున్నారు. దీంతో IPL, టీ20 WCకు దూరమైన సంగతి తెలిసిందే.
TG: బొగ్గు గనుల వేలంపై సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ మధ్య ట్విటర్ వార్ కొనసాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం మాదిరి గతంలో తాము గనుల వేలంలో పాల్గొనలేదని కేటీఆర్ తాజాగా ట్వీట్ చేశారు. ఆస్తులు తాకట్టు పెట్టడంలో కాంగ్రెస్, బీజేపీ భాగస్వాములని దుయ్యబట్టారు. రాష్ట్ర నదీప్రాంత హక్కుల రక్షణలో కాంగ్రెస్ విఫలమైందని, గనుల ప్రైవేటీకరణలో బీజేపీకి సహకరిస్తోందని కేటీఆర్ విమర్శించారు.
AP: ఈ నెల 24న (ఎల్లుండి) తొలిసారిగా మంత్రివర్గం సమావేశం కానుంది. ఉ.10 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ భేటీలో ప్రభుత్వ ప్రాధాన్యతలపై మంత్రులకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. ఎన్నికల హామీల అమలు, రాజధాని అమరావతి, పోలవరంపై కీలక చర్చ జరగనుంది. వైసీపీ హయాంలో జరిగిన అవినీతి వ్యవహారాలపై విచారణ చేపట్టే అంశాన్ని మంత్రివర్గంలో ప్రస్తావించే అవకాశం ఉంది.
T20WCలో ఈరోజు 8pmకు భారత్, బంగ్లాదేశ్ మధ్య సూపర్8 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ జరిగే ఆంటిగ్వాలో వర్షం వచ్చే ఛాన్స్ ఉందని AccuWeather తెలిపింది. 7.30pmకి 46%, 8.30pmకి 51%, 12.00amకి 47% వర్షం వచ్చే అవకాశాలున్నాయని పేర్కొంది. ఇదిలా ఉంటే ఇప్పటికే అఫ్గానిస్థాన్‌పై గెలిచిన భారత్ ఈ మ్యాచ్‌లో గెలిస్తే సెమీస్ బెర్తు దాదాపు ఖరారవుతుంది. అటు బంగ్లాదేశ్ గత మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది.
బాలీవుడ్ నటి సోనాక్షి తన ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ను రేపు వివాహం చేసుకోనున్నారు. ముంబైలో జరిగే ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు, బంధువులు మాత్రమే హాజరవుతారని తెలుస్తోంది. తాజాగా మెహందీ వేడుక జరగ్గా దీనికి సంబంధించిన ఫొటోలు వైరలవుతున్నాయి. అయితే, ఈ వివాహం తన పేరెంట్స్‌కి ఇష్టం లేదని వస్తోన్న వార్తలను సోనాక్షి సిన్హా తండ్రి శత్రుఘ్న సిన్హా ఖండించారు.
AP: సభాపతి స్థానానికి అయ్యన్నపాత్రుడు అన్ని విధాలా అర్హులని మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే సత్యకుమార్ అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ..’ అల్లరిని అరికట్టే ప్రిన్సిపల్‌గా అయ్యన్న వ్యవహరించాలి. ఆయన అనుభవం కొత్త సభ్యులకు మార్గదర్శకం కావాలి’ అని అన్నారు. సభాపతి బాధ్యతలు చేపట్టే ముఖ్యమైన ఘట్టానికి YCP హాజరుకాకపోవడం సరికాదని అన్నారు. ఇది ఆ పార్టీ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని ఫైర్ అయ్యారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి’ సినిమాపై భారీ అంచనాలున్నాయి. రిలీజైన రెండు ట్రైలర్లు ప్రేక్షకుల్లో మూవీపై మరింత ఇంట్రెస్ట్‌ను పెంచేశాయి. దీంతో PAYTMలో టికెట్ బుకింగ్ కోసం వెయిట్ చేసే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. కేవలం పేటీఎంలోనే 10 లక్షల మంది ‘కల్కి’ చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. భారత సినీ చరిత్రలో ‘కల్కి’ సినిమాకి మాత్రమే ఈ ఘనత దక్కిందని ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు.
రేప్ కేసుల్లో బాధితులైన మహిళలు అబార్షన్ చేయించుకునేందుకు వీలు కల్పించే కీలక తీర్మానాన్ని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆమోదించింది. అక్రమ సంబంధం లాంటి కేసుల్లోనూ ఈ మినహాయింపు ఇవ్వనుంది. మహిళల ఆరోగ్యం దృష్ట్యా 120 రోజుల్లోపు గర్భాన్ని మాత్రమే తొలగించుకునేందుకు అవకాశం కల్పించనున్నారు. వారికి ప్రభుత్వమే వైద్య సదుపాయం అందించనుంది. త్వరలో దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులను విడుదల చేయనుంది.
Sorry, no posts matched your criteria.