News June 22, 2024

తగ్గిన విదేశీ మారక నిల్వలు

image

విదేశీ మారక నిల్వలు తగ్గినట్లు RBI తెలిపింది. ఈ నెల 14తో ముగిసిన వారాంతానికి గాను 2.922 బిలియన్ డాలర్లు తగ్గి 652.895 బి.డాలర్లకు చేరినట్లు తెలిపింది. అంతకుముందు వారం రికార్డు స్థాయి 655.817 బి.డాలర్లకు చేరుకున్న సంగతి తెలిసిందే. యూరో, పౌండ్, యెమెన్ కరెన్సీలు ఒత్తిడికి గురికావడమే ఫారెక్స్ నిల్వలపై ప్రతికూల ప్రభావం చూపింది. బంగారం రిజర్వులు కూడా 1.015 బి. డాలర్లు తగ్గి 55.967 బి.డాలర్లకు పడిపోయాయి.

News June 22, 2024

NTA అంటే ఏంటి? ఏం చేస్తుంది?

image

NTA అనేది కేంద్ర విద్యా శాఖ పరిధిలోని స్వయంప్రతిపత్తి సంస్థ. ఇది JEE(Main), UGC NET, CMAT&GPAT, NEET UG నిర్వహిస్తుంది. ఇంజినీరింగ్, మెడిసిన్, మేనేజ్‌మెంట్, ఫార్మసీకి సంబంధించిన ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశం, ఫెలోషిప్ కోసం పరీక్షల నిర్వహణ చూసుకుంటుంది. ఇది 2017లో స్థాపితమైంది. ఇది ఫ్రీగా మాక్ టెస్టులు కూడా నిర్వహిస్తుంది. <>వెబ్‌సైట్<<>> లేదా NTA STUDENT APP యాప్ ద్వారా రిజిస్టర్ కావచ్చు.

News June 22, 2024

వైఎస్ భారతి పీఏ అరెస్ట్?

image

AP: మాజీ CM జగన్ సతీమణి భారతి PA వర్రా రవీంద్రారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. గతంలో సోషల్ మీడియాలో విపక్ష మహిళా నేతలే టార్గెట్‌గా అసభ్యకర పోస్టులు పెట్టాడని ఆయనపై అభియోగాలున్నాయి. తనపై, YS షర్మిలపై అనుచిత పోస్టులు పెట్టారంటూ YS సునీత చేసిన ఫిర్యాదుతో రవీంద్రపై సైబరాబాద్ క్రైం పోలీసులు సైతం ఫిబ్రవరిలో కేసు నమోదు చేశారు. అటు రవీంద్రపై చర్యలుంటాయని ఇప్పటికే హోంమంత్రి అనిత తెలిపారు.

News June 22, 2024

నేడు పులివెందులకు జగన్

image

AP: వైసీపీ చీఫ్, మాజీ సీఎం జగన్ నేడు పులివెందులలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఆయన తాడేపల్లిలోని నివాసం నుంచి బయల్దేరుతారు. మూడు రోజుల పాటు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పార్టీ నేతలు, అభిమానులతో ఆయన సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. జగన్ పులివెందుల పర్యటనతో ఇవాళ వైసీపీ స్పీకర్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి దూరంగా ఉంది.

News June 22, 2024

వెస్టిండీస్ లక్ష్యం 129 పరుగులు

image

టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో సూపర్ 8 మ్యాచ్‌లో USA జట్టు బ్యాటింగ్‌లో విఫలమైంది. 19.5 ఓవర్లలోనే 128 పరుగులకు ఆలౌటైంది. గౌస్(29), నితీశ్ కుమార్(20) మాత్రమే ఫరవాలేదనిపించారు. వెస్టిండీస్ బౌలర్లలో రస్సెల్ 3, ఛేస్ 3, జోసెఫ్ 2, మోతీ 1 వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు సెమీస్ అవకాశాలు సజీవంగా ఉంటాయి.

News June 22, 2024

రూ.2 లక్షల రుణమాఫీ.. ఎల్లుండి మార్గదర్శకాలు?

image

TG: ఒకేసారి రూ.2 లక్షల వరకు రైతురుణాలు మాఫీ చేస్తామన్న CM రేవంత్ రెడ్డి ప్రకటన నేపథ్యంలో సోమవారం మార్గదర్శకాలు వెల్లడికానున్నట్లు తెలుస్తోంది. వీటిలో ఎలాంటి సందిగ్ధం లేకుండా స్పష్టంగా ఉండాలని అధికారులను మంత్రివర్గం ఆదేశించింది. పీఎం కిసాన్ యోజన మార్గదర్శకాల్లోని కొన్నింటిని పరిగణనలోకి తీసుకొని, వీలైనంత ఎక్కువ మంది రైతులకు రుణమాఫీని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

News June 22, 2024

NTA ఎగ్జామ్ సెంటర్లను ఎలా ఎంచుకుంటుంది?

image

NEET, UGC NET పరీక్షల నిర్వహణలో అవకతవకలతో NTA వార్తల్లోకెక్కింది. వరుస పేపర్ లీకేజీలు జరగడంతో అసలు NTA ఎగ్జామ్ సెంటర్లను ఎలా ఎంచుకుంటుందనే సందేహం మొదలైంది. ఇందుకోసం గతంలో CBSE, NTAల తరఫున పరీక్షలు నిర్వహించిన ప్రభుత్వ పాఠశాలలతో ఒక లిస్ట్ తయారు చేస్తుంది. మళ్లీ అందులో ఫైనల్ లిస్ట్ తీసి పాఠశాలల అనుమతి కోరుతుంది. మరోసారి బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేసి అనుమానాస్పద సెంటర్లను బ్లాక్ లిస్టులో పెడుతుంది.

News June 22, 2024

పేరు మారినా ఆలోచనా విధానం మారలేదు: ముద్రగడ కూతురు

image

AP: తన తండ్రి ముద్రగడ పద్మనాభం పేరు మార్చుకున్నా ఆలోచనా విధానం మాత్రం మార్చుకోలేదని ఆయన కూతురు క్రాంతి ట్వీట్ చేశారు. మాజీ సీఎం జగన్‌ను ప్రశ్నించని ఆయనకు పవన్‌ను ప్రశ్నించే అర్హత ఉందా? అని నిలదీశారు. పవన్‌కు సమాజానికి ఏం చేయాలో స్పష్టత ఉందని, తన తండ్రికి లేదనిపిస్తోందని చెప్పారు. శేష జీవితాన్ని ఇంటికే పరిమితం చేసి విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇచ్చారు.

News June 22, 2024

T20 WC: పాక్ జట్టుపై ఫిక్సింగ్ ఆరోపణలు.. PCB ఏమందంటే?

image

లీగ్ దశలోనే ఇంటిదారి పట్టిన పాకిస్థాన్‌ జట్టుపై నెట్టింట ఫిక్సింగ్ ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో తమ ఆటగాళ్లను PCB వెనకేసుకొచ్చింది. తమకు ఎలాంటి అనుమానాలు లేవని, విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని తెలిపింది. ఆరోపణలు చేసినవారు ఆధారాలతో వస్తే విచారణ జరిపి ఆటగాళ్లపై చర్యలు తీసుకుంటామని పేర్కొంది. అటు నిరాధార ఆరోపణలు చేసినవారికి పరువు నష్టం దావా కింద నోటీసులు పంపేందుకు PCB సిద్ధమవుతున్నట్లు సమాచారం.

News June 22, 2024

వివేకా కేసులో అవినాశ్ అరెస్ట్ అవుతారు: ఆదినారాయణ రెడ్డి

image

AP: ఎన్నికల్లో YCP ఓటమికి చెల్లెలు షర్మిల కూడా కారణమని జగన్ గ్రహించారని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు. దీంతో షర్మిలతో రాజీ చేయాలని తల్లి విజయమ్మను జగన్ కోరారని తెలిపారు. అయితే జగనే కాంగ్రెస్‌లో చేరాలని షర్మిల చెప్పేశారని పేర్కొన్నారు. త్వరలో వివేకానందరెడ్డి హత్య కేసులో కడప MP అవినాశ్ రెడ్డి అరెస్ట్ అవుతారని పేర్కొన్నారు. వైసీపీ ఎంపీలను BJPలో చేర్చుకునేందుకు పార్టీ సుముఖంగా లేదన్నారు.