News June 22, 2024
తగ్గిన విదేశీ మారక నిల్వలు
విదేశీ మారక నిల్వలు తగ్గినట్లు RBI తెలిపింది. ఈ నెల 14తో ముగిసిన వారాంతానికి గాను 2.922 బిలియన్ డాలర్లు తగ్గి 652.895 బి.డాలర్లకు చేరినట్లు తెలిపింది. అంతకుముందు వారం రికార్డు స్థాయి 655.817 బి.డాలర్లకు చేరుకున్న సంగతి తెలిసిందే. యూరో, పౌండ్, యెమెన్ కరెన్సీలు ఒత్తిడికి గురికావడమే ఫారెక్స్ నిల్వలపై ప్రతికూల ప్రభావం చూపింది. బంగారం రిజర్వులు కూడా 1.015 బి. డాలర్లు తగ్గి 55.967 బి.డాలర్లకు పడిపోయాయి.
Similar News
News November 6, 2024
మొన్న తిట్టారు.. ఇవాళ మెచ్చుకున్నారు: మంత్రి
AP: గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు విషయంలో తనను తిట్టిన CM చంద్రబాబు ఇవాళ మెచ్చుకున్నారని మంత్రి వాసంశెట్టి సుభాష్ ట్వీట్ చేశారు. ‘శెభాష్ సుభాష్ అంటూ సీఎం చంద్రబాబు మెచ్చుకోలు నాకు కొండంత బలం. మొన్న తిట్టిన ఆయన ఈరోజు భుజం మీద చెయ్యి వేసి బాగా చేశావయ్యా.. ఓటర్ రిజిస్ట్రేషన్ 90% దాటించావ్ అంటే వెయ్యి ఏనుగుల బలం వచ్చింది. తిట్టినా మెచ్చుకున్నా మాకు అన్ని ఆయనే’ అని సీఎంతో దిగిన ఫొటోను షేర్ చేశారు.
News November 6, 2024
OTTల్లోకి కొత్త సినిమాలు
ఈ వారం ఓటీటీల్లో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు రిలీజ్ కానున్నాయి.
*నవంబర్ 7: సమంత, వరుణ్ ధవన్ నటించిన ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ (అమెజాన్ ప్రైమ్)
*నవంబర్ 8: ఎన్టీఆర్ ‘దేవర’, రజనీకాంత్ ‘వేట్టయన్’, అనుపమ్ ఖేర్ ‘విజయ్ 69’ (నెట్‌ఫ్లిక్స్), సుహాస్ నటించిన ‘జనక అయితే గనక’ (ఆహా), బాలకృష్ణ, సూర్య ‘అన్‌స్టాపబుల్’ షో (ఆహా)
News November 6, 2024
నవంబర్ 14న విద్యార్థులతో కార్యక్రమం: సీఎం రేవంత్
TG: నవంబర్ 14న 15వేల మంది విద్యార్థులతో ఒక మంచి కార్యక్రమం నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. డైట్, కాస్మొటిక్ ఛార్జీలు పెంచినందుకు వైరా, మధిర గురుకుల విద్యార్థులు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. SC, ST, BC, మైనార్టీల కోసం యంగ్ ఇండియా స్కూళ్లు, నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ కోసం స్కిల్ యూనివర్సిటీ, ఒలింపిక్ పతకాలే లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.