News December 24, 2024

బాక్సింగ్ డే టెస్టుకు హెడ్ దూరం?

image

BGTలో భారత్‌కు తలనొప్పిగా మారిన ట్రావిస్ హెడ్ బాక్సింగ్ డే టెస్టుకు దూరం కానున్నట్లు సమాచారం. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న అతను ఇంకా కోలుకోలేదని వార్తలు వస్తున్నాయి. ఆసీస్ ప్రాక్టీస్ సెషన్‌లోనూ హెడ్ కనిపించలేదని తెలుస్తోంది. ఇవాళ జరిగే ఫిట్‌నెస్ టెస్టు తర్వాత నాలుగో టెస్టులో ఆడేది లేనిది క్లారిటీ రానుంది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న హెడ్ 3 టెస్టుల్లో 2 సెంచరీలు చేసిన విషయం తెలిసిందే.

News December 24, 2024

X ప్రీమియం ప్లస్ ఛార్జీలు భారీగా పెంపు

image

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X తన ప్రీమియం ప్లస్ ఛార్జీలను దాదాపు 40 శాతం పెంచింది. ప్రస్తుతం భారత్‌లో నెలకు ధర రూ.1,300 కాగా ఏటా రూ.13,600గా వసూలు చేస్తోంది. దీన్ని నెలకు రూ.1,750, ఏటా రూ.18,300కు పెంచింది. అయితే 2025 జనవరి 21వ తేదీ కంటే ముందే బిల్లింగ్‌ సైకిల్‌ మొదలైన వారికి పాత ధరలకే ప్రీమియం ప్లస్ సేవలు అందనున్నాయి. ఈ చందాదారులకు పూర్తిగా యాడ్‌ ఫ్రీ కంటెంట్‌ లభిస్తుంది.

News December 24, 2024

NHRC ఛైర్మన్‌గా జస్టిస్ రామసుబ్రమణియన్

image

జాతీయ మానవహక్కుల కమిషన్(NHRC) ఛైర్మన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రామసుబ్రమణియన్ బాధ్యతలు చేపట్టారు. ఈయన ఐదేళ్లపాటు లేదా వయసు 70ఏళ్ల వరకు ఆ పదవిలో కొనసాగనున్నారు. మద్రాస్ లా కాలేజీలో చదివిన ఈయన 1983 నుంచి 23 ఏళ్ల పాటు లాయర్‌గా ప్రాక్టీస్ చేశారు. ఆ తర్వాత మద్రాస్, ఉమ్మడి AP హైకోర్టు న్యాయమూర్తి, హిమాచల్ ప్రదేశ్ CJగా బాధ్యతలు నిర్వహించారు. 2019-23 మధ్య సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేశారు.

News December 24, 2024

English Learning: Antonyms

image

✒ Cheap× Dear, unreasonable
✒ Coarse× Fine, Chaste
✒ Classic× Romantic, Unusual
✒ Compact× Loose, Diffuse
✒ Comic× Tragic, tragedian
✒ Conceit× Modesty
✒ Compress× Amplify, Expand
✒ Condemn× Approve, Praise
✒ Concord× Discord

News December 24, 2024

భారత్‌కు పాత్ పిచ్‌లు, ఆసీస్‌కు కొత్తవి.. క్యూరేటర్ ఏమన్నారంటే?

image

బాక్సింగ్ డే టెస్టుకు IND-AUS సిద్ధమవుతున్న వేళ ఓ వివాదం తెరమీదకు వచ్చింది. MCGలో భారత ప్లేయర్ల ప్రాక్టీస్ కోసం పాత పిచ్‌లు, ఆసీస్ కోసం కొత్త అందుబాటులో ఉంచినట్లు ఫొటోలు వైరలవుతున్నాయి. పాత పిచ్‌ కారణంగా ప్లేయర్లకు గాయాలైనట్లు వార్తలొస్తున్నాయి. దీనిపై క్యూరేటర్ స్పందిస్తూ ‘మ్యాచ్‌కు 3 రోజుల ముందే కొత్త పిచ్‌ సిద్ధమవుతుంది. IND ప్రాక్టీస్ షెడ్యూల్ చాలా ముందుగా వచ్చింది’ అని పేర్కొన్నాడు.

News December 24, 2024

తిరుపతి వాసులకు శ్రీవారి దర్శనం.. 5న టోకెన్ల జారీ

image

AP: తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే తిరుపతి భక్తులకు జనవరి 5న టికెట్లు జారీ చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది. ప్రతి నెలా మొదటి మంగళవారం తిరుపతి స్థానికులకు దర్శనం కల్పించనున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనవరి 7న దర్శనం కోసం 5వ తేదీన తిరుపతి మహతి ఆడిటోరియం, తిరుమల బాలాజీ నగర్‌లోని కమ్యూనిటీ హాల్‌లో దర్శన టోకెన్లు జారీ చేయనుంది.

News December 24, 2024

సుమతీ నీతి పద్యం- ఎలాంటి గ్రామంలో నివసించాలి?

image

అప్పిచ్చువాడు వైద్యుడు
నెప్పుడు నెడతెగక బాఱు నేఱును,ద్విజుడున్
జొప్పడిన యూర నుండుము
చొప్పడకున్నట్టి యూర జొరకుము సుమతీ!
తాత్పర్యం: సమయానికి అప్పు ఇచ్చేవాడు, వైద్యుడు, ఎల్లప్పుడూ ప్రవహించే నది, పండితుడు ఉండే గ్రామంలో నివసించాలి. వారెవరూ లేని ఊరిలో నివసించకూడదు.

News December 24, 2024

18 రోజుల్లో రూ.11.8 కోట్లు కోల్పోయాడు!

image

డిజిటల్ అరెస్టు పేరుతో జరుగుతోన్న మోసాలు ఆగట్లేదు. తాజాగా బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు ట్రాయ్ అధికారిని అంటూ ఓ వ్యక్తి ఫోన్ చేసి భయాందోళనకు గురిచేశాడు. సిమ్ కార్డును సైబర్ వేధింపులకు ఉపయోగిస్తున్నట్లు కాల్ చేసి బెదిరించాడు. దీంతో అరెస్టుకు భయపడి నవంబర్ 11 నుంచి 18 రోజుల్లోనే రూ.11.8 కోట్లు వివిధ అకౌంట్లకు పంపించాడు. బెంగళూరులో కేసు నమోదవడంతో ఈ విషయం బయటకొచ్చింది.

News December 24, 2024

నేను 110 ఏళ్లు జీవిస్తా: దలైలామా

image

మోకాలి ఆపరేషన్ తర్వాత కోలుకుంటున్న బౌద్ధ గురువు దలైలామా(89) తన ఆరోగ్యంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను 110 ఏళ్లు జీవిస్తానంటూ కల వచ్చిందని చెప్పారు. ఆయన గతంలోనూ ఇదే తరహాలో మాట్లాడారు. ఈ ఏడాది జూన్‌లో న్యూయార్క్‌లో ఆపరేషన్ చేయించుకున్న ఆయన ప్రస్తుతం ధర్మశాలలోని తన ఆశ్రమంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. సెప్టెంబర్ నుంచి తన బోధనలను ప్రారంభించారు.

News December 24, 2024

డిసెంబర్ 24: చరిత్రలో ఈ రోజు

image

✒ 1924: లెజెండరీ సింగర్ మహ్మద్ రఫీ జననం(ఫొటోలో)
✒ 1956: నటుడు, నిర్మాత అనిల్ కపూర్ జననం
✒ 1987: తమిళనాడు మాజీ సీఎం, నటుడు ఎంజీ రామచంద్రన్ మరణం
✒ 2002: ఢిల్లీ మెట్రో రైల్వేను ప్రారంభించిన ప్రధాని వాజ్‌పేయి
✒ 2005: ప్రముఖ నటి భానుమతి మరణం
✒ జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం
✒ అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం