News December 24, 2024
తిరుపతి వాసులకు శ్రీవారి దర్శనం.. 5న టోకెన్ల జారీ
AP: తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే తిరుపతి భక్తులకు జనవరి 5న టికెట్లు జారీ చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది. ప్రతి నెలా మొదటి మంగళవారం తిరుపతి స్థానికులకు దర్శనం కల్పించనున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనవరి 7న దర్శనం కోసం 5వ తేదీన తిరుపతి మహతి ఆడిటోరియం, తిరుమల బాలాజీ నగర్‌లోని కమ్యూనిటీ హాల్‌లో దర్శన టోకెన్లు జారీ చేయనుంది.
Similar News
News January 25, 2025
బాలీవుడ్‌లో ఐక్యత లేదు: అక్షయ్ కుమార్
హిందీ చిత్ర పరిశ్రమలో ఐక్యత లోపించిందని నటుడు అక్షయ్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. ‘నాకే అవకాశం దక్కితే పరిశ్రమలో ఐక్యత తీసుకురావడమే మొదటి లక్ష్యంగా పెట్టుకుంటా. ఒకరి విజయాన్ని మరొకరు సెలబ్రేట్ చేసుకునేలా అందరూ కలిసి పనిచేయాలి. సమస్యలకు ఉమ్మడిగా పరిష్కారాన్ని కనుగొనాలి. అందరూ కలిసికట్టుగా ముందుకు సాగితే ఇతర పరిశ్రమలపైనా అది సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది’ అని వ్యాఖ్యానించారు.
News January 25, 2025
ఐసీసీ మెన్స్ టీ20 టీమ్.. కెప్టెన్‌గా రోహిత్
మెన్స్ టీ20 టీమ్-2024ను ఐసీసీ ప్రకటించింది. రోహిత్ శర్మను కెప్టెన్‌గా ఎంచుకుంది. భారత్ నుంచి రోహిత్‌తో పాటు హార్దిక్, బుమ్రా, అర్ష్‌దీప్‌కు చోటు దక్కింది. 2024 టీ20 WCలో 378 రన్స్ చేసిన రోహిత్, టోర్నీ అనంతరం టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
టీమ్: రోహిత్(C), హెడ్, సాల్ట్, బాబర్ ఆజమ్, పూరన్(WK), సికందర్ రజా, హార్దిక్, రషీద్ ఖాన్, హసరంగ, బుమ్రా, అర్ష్‌దీప్.
News January 25, 2025
మహారాష్ట్రలో బస్సు ఛార్జీలు పెంపు
మహారాష్ట్రలో RTC బస్సు ఛార్జీలు పెరిగాయి. టికెట్ ధరపై 14.95% పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త రేట్లు ఇవాళ్టి నుంచే అమల్లోకి వచ్చాయి. అటు ఆటో, ట్యాక్సీ ఛార్జీల పెంపు ప్రతిపాదనకు కూడా ముంబై మెట్రోపాలిటన్ రీజన్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ ఆమోదం తెలిపింది. దీంతో ఆటో ఛార్జీ రూ.23 నుంచి రూ.26కి, టాక్సీ ఛార్జీ రూ.28 నుంచి రూ.31కి చేరింది. ఇటీవల కర్ణాటక ప్రభుత్వం కూడా RTC ఛార్జీలను పెంచింది.