India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

దర్శక దిగ్గజం <<14962066>>శ్యామ్ బెనగల్<<>> మరణంతో సినీలోకం విషాదంలో మునిగిపోయింది. ఆయన HYD తిరుమలగిరిలో జన్మించారు. విద్యాభ్యాసం మెహబూబ్, నిజాం కాలేజీలో చేశారు. ప్రొఫెషనల్ వర్క్ కోసం బాంబేకు షిఫ్ట్ అయ్యారు. సత్యజిత్ రే తర్వాత మిడిల్ క్లాస్ సినిమాల దర్శకుడిగా కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ANR జాతీయ అవార్డుతో పాటు అనేక అవార్డులు సొంతం చేసుకున్నారు. 2006-12 మధ్య కాలంలో రాజ్యసభ ఎంపీగా చేశారు.

హీరో అల్లు అర్జున్‌కు చిక్కడపల్లి పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని అందులో పేర్కొన్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఇప్పటికే ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. తర్వాత బన్నీని అరెస్ట్ చేయగా హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది.

1974లో విడుదలై జనాదరణ పొందిన అంకుర్ చిత్రాన్ని తీయడానికి శ్యామ్ బెనగల్ 14 ఏళ్లపాటు నిర్మాతల చుట్టూ తిరిగారు. సాంఘిక వివక్ష, పేదరికం, మహిళల హక్కుల నేపథ్యం కలిగిన ఈ చిత్రాన్ని చివరికి బ్లేజ్ ఫిలిం నిర్మించింది. తొలుత తెలుగులో తీయాలనుకున్నా నిర్మాతలు హిందీలో తీయడానికి శ్యామ్ బెనగల్‌ను ఒప్పించారు. ₹5 లక్షలతో సినిమా తీస్తే ₹కోటి వరకు వసూళ్లు సాధించి అప్పట్లో ఓ సంచలనంగా నిలిచింది.

TG: మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. మేడిగడ్డ నిర్మాణంలో వీరిద్దరూ అవినీతికి పాల్పడ్డారంటూ భూపాలపల్లి కోర్టులో ప్రైవేట్ పిటిషన్ దాఖలైంది. దీంతో కోర్టు వారికి నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులను కొట్టేయాలంటూ KCR, హరీశ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు.

ప్రముఖ సినీ దర్శకుడు, స్క్రీన్‌ప్లే రచయిత శ్యామ్ బెనగల్(90) మృతి చెందారు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. బాలీవుడ్‌లో అంకుర్, భూమిక, నిషాంత్, కల్‌యుగ్, మంతన్ సహా ఎన్నో సినిమాలను తెరకెక్కించారు. 1934లో డిసెంబర్ 14న HYD తిరుమలగిరిలో జన్మించిన ఆయనను పద్మశ్రీ, పద్మభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే సహా పలు అవార్డులు వరించాయి.

TG: రాష్ట్రంలో తొలి విడతలో 5 జిల్లాల్లోని 231 ఎకరాల్లో స్వయం సహాయక బృందాలచే సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయించాలని సీఎస్ శాంతికుమారి అధికారులను ఆదేశించారు. 6 నెలల్లో ఆలయ భూముల్లో వీటిని ఏర్పాటు చేయాలని తెలిపారు. సోలార్ ప్లాంట్లు, ఎలక్ట్రిక్ బస్సులు ఇవ్వడంపై అధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. మహిళా సంఘాల నుంచి ఆర్టీసీకి 150 ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురానున్నట్లు పేర్కొన్నారు.

యూపీలోని బరేలీ కోర్టు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి నోటీసులు జారీ చేసింది. లోక్‌సభలో ఎంపీగా ప్రమాణస్వీకారం సందర్భంగా ఆయన జై పాలస్తీనా అని నినదించడాన్ని తప్పుబడుతూ న్యాయవాది వీరేంద్ర గుప్తా కోర్టును ఆశ్రయించారు. చట్టసభలో జై పాలస్తీనా అని నినదించి రాజ్యాంగ, న్యాయ సూత్రాలను ఒవైసీ ఉల్లంఘించారని పిటిషనర్ ఆరోపించారు. ఈ కేసులో జనవరి 7న తమ ముందు హాజరుకావాలని ఒవైసీని కోర్టు ఆదేశించింది.

AP: నామినేటెడ్ పోస్టుల్లో BCలకు 34శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖపై ఆయన సమీక్షించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34శాతం రిజర్వేషన్ల సాధనకు న్యాయపరమైన పోరాటం చేయాలని అధికారులకు ఆదేశించారు. అటు బీసీ సంక్షేమ హాస్టళ్లలో వసతుల కల్పన, బాలికల హాస్టళ్లకు తక్షణం మరమ్మతులు చేయాలని CM సూచించారు. అలాగే బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టంపై ఆరా తీశారు.

TG: మంచు ఇంట మరోసారి వివాదం చెలరేగింది. తాజాగా తన సోదరుడు విష్ణుతో పాటు అతని అనుచరుడు వినయ్‌పై పోలీసులకు మనోజ్ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. విష్ణు నుంచి ప్రాణహాని ఉందని పేర్కొంటూ 7 అంశాలను ప్రస్తావించినట్లు సమాచారం.

తెలంగాణ క్యాబినెట్ భేటీ ఈ నెల 30న జరగనుంది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో యాదగిరిగుట్ట బోర్డు ఏర్పాటుకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. 20 మంది సభ్యులతో ఈ బోర్డును ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, రైతుభరోసా సహా మరికొన్ని అంశాలపై ప్రభుత్వం చర్చించనుంది.
Sorry, no posts matched your criteria.