India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

2025 FEB 1, శనివారం అయినప్పటికీ స్టాక్ మార్కెట్లు పనిచేస్తాయి. ఆ రోజు బడ్జెట్‌ను ప్రవేశపెడుతుండటమే ఇందుకు కారణం. అందులో ప్రకటనలను అనుసరించి సత్వర నిర్ణయాలు తీసుకొనేందుకు ఇన్వెస్టర్లకు అవకాశమివ్వడమే దీని ఉద్దేశం. 2020, 2015లోనూ ఇలాగే జరిగింది. సాధారణంగా బడ్జెట్ రోజు బ్యాంకింగ్, ఇన్ఫ్రా, తయారీ, హెల్త్‌కేర్ షేర్లలో యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. స్టాక్స్ రేట్లు నిమిషాల్లో ఆటుపోట్లకు లోనవుతుంటాయి.

స్కూళ్లలో ‘నో డిటెన్షన్’ విధానాన్ని కేంద్రం రద్దు చేసింది. 5, 8 తరగతుల విద్యార్థులు పరీక్షల్లో తప్పనిసరి పాస్ కావాలని పేర్కొంది. ఫెయిలైన విద్యార్థులకు 2 నెలల వ్యవధిలో మరోసారి పరీక్ష నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. విద్యా హక్కు చట్టం ద్వారా ఈ విధానం అమల్లోకి రానున్నట్లు పేర్కొంది. కేంద్రం ఆధ్వర్యంలో నడిచే స్కూళ్లతో పాటు KVలు, నవోదయ, సైనిక్ స్కూళ్లకు ఇది వర్తించే అవకాశం ఉంది.

మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డు నామినీల జాబితాలో డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ మనూభాకర్ పేరు తొలగించినట్టు సమాచారం. కమిటీ ఆమె పేరును రికమెండ్ చేయలేదని తెలిసింది. వివాదం నెలకొనడంతో అవార్డుకు ఆమె దరఖాస్తు చేసుకోలేదని స్పోర్ట్స్ మినిస్ట్రీ చెప్తోంది. అది అవాస్తవమని, తాము చేశామని ఆమె తండ్రి రామకృష్ణ స్పష్టం చేశారు. అవార్డుల కోసం అడుక్కోవాల్సి వస్తే మెడల్స్ సాధించడంలో అర్థమేముందని ప్రశ్నించారు.

AP: అమరావతిలో జోన్ 7, జోన్ 10 లేఅవుట్‌ల కోసం రూ.2,723 కోట్ల నిర్మాణ పనులకు సీఆర్డీఏ అంగీకారం తెలిపిందని మంత్రి నారాయణ అన్నారు. వచ్చే నెల 15 కల్లా రాజధాని నిర్మాణాల టెండర్ల ప్రక్రియ పూర్తిచేస్తామని చెప్పారు. మొత్తం 7 లక్షల ఇళ్లకు గత ప్రభుత్వం 2.61 లక్షల ఇళ్లు కూడా పూర్తి చేయలేదని దుయ్యబట్టారు. జూన్ 12లోగా లక్షా 18వేల టిడ్కో ఇళ్లను పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నామన్నారు.

UPSC నుంచి బహిష్కరణకు గురైన పూజా ఖేడ్కర్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ HC తోసిపుచ్చింది. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో సివిల్స్‌లో ప్రయోజనాలు పొందారన్న ఆరోపణలపై ఆమెను కేంద్రం సర్వీసు నుంచి తొలగించింది. ప్రతిష్ఠాత్మక సంస్థను మోసం చేశారన్న అభియోగాలు ఎదుర్కొంటున్న ఆమెకు గతంలో కల్పించిన మధ్యంతర రక్షణను కూడా కోర్టు తొలగించింది. త్వరలో ప్రభుత్వం ఆమెను విచారించే అవకాశం ఉంది.

TG: అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి గాంధీభవన్‌కు వచ్చినట్లు తమకు తెలియదని TPCC చీఫ్ మహేశ్ కుమార్ తెలిపారు. ఆయనొచ్చిప్పుడు తాము ప్రెస్‌మీట్లో ఉన్నామన్నారు. తర్వాత చంద్రశేఖర్ ఫోన్ చేసి మాట్లాడారని, మళ్లీ వచ్చి కలుస్తానని చెప్పినట్లు వెల్లడించారు. AAతో తమకు వ్యక్తిగతంగా ఎలాంటి వైరం లేదని మహేశ్ మరోసారి స్పష్టం చేశారు. గాంధీభవన్‌కు వచ్చిన చంద్రశేఖర్‌ను మున్షీ మాట్లాడకుండానే పంపించేశారు.

బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల పుత్తడి ధర రూ.84 పెరిగి రూ.80,777గా ఉంది. 22 క్యారెట్ల ధర రూ.77 ఎగిసి 74,045 వద్ద కొనసాగుతోంది. డాలర్ ఇండెక్స్ పెరగడంతో కొన్ని రోజులుగా విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టాయి. 2 వారాల్లోనే బాగా తగ్గడంతో నేడు స్తబ్ధత నెలకొంది. ఇక వెండి కిలోకు రూ.100 తగ్గి రూ.91,400 వద్ద చలిస్తోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.240 పెరిగి రూ.25,500 వద్ద ఉంది.

వరుస నష్టాలకు తెరపడింది. స్టాక్‌మార్కెట్లు నేడు భారీగా లాభపడ్డాయి. సెన్సెక్స్ 78,540 (+498), నిఫ్టీ 23,753 (+165) వద్ద ముగిశాయి. ఒకానొక దశలో నిఫ్టీ 270 పాయింట్ల మేర పెరగడం గమనార్హం. గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లు పుంజుకోవడం, హెవీవెయిట్స్‌లో పొజిషన్లే ఇందుకు కారణం. నిఫ్టీ ADV/DEC రేషియో 32:18గా ఉంది. JSWSTEEL, ITC, HINDALCO, TRENT, HDFC BANK టాప్ గెయినర్స్.

TG: బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వబోమని సీఎం రేవంత్ ప్రకటించడాన్ని తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్ల అసోసియేషన్ స్వాగతించింది. టికెట్ ధరలు నిర్ణీత మొత్తంలోనే, సామాన్యులకు అందుబాటులో ఉండాలన్నారు. ధరల పెంపుతో సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడుతున్నాయని, ధరలు తక్కువ ఉంటే ప్రేక్షకులు చూడటానికి వస్తారని తెలిపారు.

TG: మోహన్‌బాబుకు హైకోర్టులో షాక్ తగిలింది. ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. జర్నలిస్టుపై దాడి కేసులో ఆయనపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే ఆయనకు నోటీసులు ఇచ్చిన పోలీసులు మోహన్‌బాబును అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది.
Sorry, no posts matched your criteria.