India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: ఈ నెల 24న ఉదయం పదింటికి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కొత్త సర్కారు తొలి కేబినెట్ భేటీ జరగనుంది. భేటీలో చర్చించాల్సిన అంశాలపై ఈ నెల 21న సాయంత్రం 4గంటల్లోగా ప్రతిపాదనలు పంపించాలని ప్రభుత్వ శాఖలకు సీఎంఓ ఆదేశాలు జారీ చేసింది. సీఎం సంతకం చేసిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, డీఎస్సీ పోస్టుల భర్తీ, అన్నా క్యాంటీన్ల ఏర్పాటు వంటి పలు నిర్ణయాలను ఈ సందర్భంగా ఆమోదించనున్నారు.
హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టులో జగన్ ఆస్తుల కేసుల విచారణ వాయిదా పడింది. న్యాయమూర్తి సెలవులో ఉండటంతో విచారణ రేపటికి వాయిదా వేశారు. గతంలో సీఎంగా ఉండటంతో విచారణలో వాయిదాలు కోరుతూ వచ్చిన జగన్ ఇప్పుడు విచారణకు హాజరవుతారా? లేదా? అనేది ఆసక్తిగా మారింది.
శిథిలమైపోయిన విశ్వవిద్యాలయానికి పూర్వవైభవం తేవాలని నలందా యూనివర్సిటీ యాక్ట్ పేరుతో 2010లో నాటి కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని తీసుకొచ్చింది. 2014లో 14 మంది విద్యార్థులతో ఈ యూనివర్సిటీ కార్యకలాపాలు మొదలయ్యాయి. 2017లో కొత్త క్యాంపస్ నిర్మాణం ప్రారంభమైంది. 455 ఏకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ క్యాంపస్‌ను సోలార్ ప్లాంట్, వాటర్ రీసైక్లింగ్ ప్లాంట్ మొదలైనవి ఏర్పాటు చేసి పర్యావరణ హితంగా తీర్చిదిద్దారు.
AP: ప్రభుత్వ సొమ్ముతో కొనుగోలు చేసిన ఫర్నీచర్, ఎలక్ట్రికల్ వస్తువులు వెంటనే తమకు అప్పగించాలని జగన్‌కు సాధారణ పరిపాలన శాఖ(GAD) లేఖ రాసింది. జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పుడు ప్రభుత్వ నిధులతో ఫర్నీచర్ సహా పలు వస్తువులను తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయం కోసం కొనుగోలు చేయించారు. పదవి నుంచి దిగిపోయిన తర్వాత వాటిని ప్రభుత్వానికి ఇంకా సరెండర్ చేయకపోవడంతో GAD రంగంలోకి దిగి అప్పగించాలని కోరింది.
AP: ప్రొటెం స్పీకర్‌గా రేపు తాను బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెప్పారు. ‘ఎవరైనా సీనియర్లు ఉంటే చూడమని పార్టీ పెద్దలను అడిగా. ఏడోసారి ఎమ్మెల్యేగా ఉన్నందున నన్నే కొనసాగమని కోరారు. రాష్ట్రంలో ఐదేళ్లుగా విధ్వంసమైన వ్యవస్థను గాడిలో పెట్టడమే మా ప్రభుత్వం ముందున్న లక్ష్యం. ఆ దిశగా ముందుకెళ్తాం’ అని ఆయన వెల్లడించారు.
AP: రాష్ట్ర హోం మంత్రిగా వంగలపూడి అనిత బాధ్యతలు స్వీకరించారు. తొలుత సచివాలయంలో తనకు కేటాయించిన ఛాంబర్‌లో వేద పండితులతో ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ఆమె బాధ్యతలు చేపట్టారు. పోలీసులు, ఉన్నతాధికారులు ఆమెను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కాగా పాయకరావుపేట నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి కంబాల జోగులుపై అనిత 43వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో నెగ్గారు.
AP: YCP ప్రభుత్వ హయాంలో తనకు చాలా అన్యాయం జరిగిందని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ‘చిన్న కారణాలతో నా బస్సులు సీజ్ చేశారు. నాపై, నా కుటుంబంపై తప్పుడు కేసులు పెట్టి వేధించారు. జైలుకు పంపి అన్నం కూడా పెట్టనివ్వలేదు. ఎంతో ఏడ్చాం. నా బండ్లు పట్టుకున్న బ్రేక్ ఇన్స్‌పెక్టర్ల ఇళ్ల ముందు కూర్చుంటా. నా బండ్లన్నీ రిపేర్ చేసి ఇవ్వాలి. ఈ విషయం వదిలిపెట్టను.. అవసరమైతే TDPకి రాజీనామా చేస్తా’ అని అన్నారు.
మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ మృతి చెందారు. గత కొంతకాలంగా లంగ్స్ డ్యామేజ్‌తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తుదిశ్వాస విడిచినట్లు సినీవర్గాలు తెలిపాయి. శ్రీజ కొణిదెల 2007లో శిరీష్ భరద్వాజ్‌ను ప్రేమ వివాహం చేసుకోగా.. 2014లో చట్టబద్ధంగా విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. 2019లో శిరీష్ మరో పెళ్లి చేసుకున్నారు.
AP: గ్రూప్-2 మెయిన్స్ దరఖాస్తులో పోస్టుల ప్రాధాన్యతను మార్చుకునేందుకు అభ్యర్థులకు APPSC అవకాశం కల్పించింది. పోస్టుల ప్రాధాన్యం, పరీక్ష కేంద్రాలు, మండల, జిల్లా ప్రాధాన్యతలను మార్చుకోవచ్చు. ఈ నెల 25వ తేదీ రాత్రి 11.59 వరకు మాత్రమే అవకాశం ఉంటుందని APPSC తెలిపింది. ఆ తర్వాత మరో అవకాశం ఉండదని స్పష్టం చేసింది.
TG: ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు ఈ నెల 25న విడుదల కానున్నాయి. ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన వారు, ఫస్టియర్ ఇంప్రూవ్‌మెంట్ కోసం రాసిన వారు దాదాపు 4.5 లక్షల మంది ఉన్నారు. గత పరీక్షల మూల్యాంకనంలో తప్పులు జరిగిన నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. డీకోడింగ్, ఆన్‌లైన్‌లో మార్కుల ఎంట్రీ పూర్తైంది. ఏవైనా అనివార్య పరిస్థితులు ఏర్పడితే ఈ నెల 26 లేదా 27న విడుదల చేస్తారు.
Sorry, no posts matched your criteria.