News December 23, 2024
కులాంతర వివాహం చేసుకుంటే రూ.2.5లక్షలు.. వివరాలివే
TG: కులాంతర వివాహం చేసుకున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం ‘ఇంటర్ క్యాస్ట్ ఇన్సెంటివ్ స్కీమ్’ కింద రూ.2.5 లక్షల ఆర్థికసాయం అందిస్తోంది. వధూవరులు TG వాసులై, ఇద్దరిలో ఒకరు కచ్చితంగా ఎస్సీ వారై ఉండాలి. అమ్మాయికి 18, అబ్బాయికి 21 ఏళ్లు పూర్తై ఉండాలి. పెళ్లైన ఏడాదిలోపే అప్లై చేసుకోవాలి. తొలి వివాహానికి మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది. పూర్తి వివరాలు, దరఖాస్తు కోసం ఇక్కడ <
Similar News
News January 18, 2025
గడ్డకట్టే చలి.. ఇండోర్‌లోనే ట్రంప్ ప్రమాణం
ఈ నెల 20న అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారోత్సవం ఇండోర్‌లో జరగనుంది. వాషింగ్టన్ డీసీలో విపరీతమైన చలి ఉండటంతో క్యాపిటోల్ భవనంలో ప్రమాణం చేయనున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ఈ కనిష్ఠ ఉష్ణోగ్రతల్లో అతిథులను ఇబ్బంది పెట్టడం తనకు ఇష్టం లేదని చెప్పారు. కాగా అర్కిటిక్ బ్లాస్ట్ వల్ల వాషింగ్టన్ డీసీలో 20న -12 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.
News January 18, 2025
టీమ్ ఇండియాకు గుడ్ న్యూస్?
భారత స్పీడ్ స్టార్ జస్ప్రీత్ బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో ఉంటారని తెలుస్తోంది. ఇటీవల గాయం కారణంగా CTకి దూరమవుతున్నారనే ప్రచారాన్ని ఆయన ఖండించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఇంగ్లండ్‌తో సిరీస్‌కు మేనేజ్మెంట్ ఆయనకు విశ్రాంతి కల్పించింది. దీంతో ఇవాళ ప్రెస్ మీట్‌లో బుమ్రా ఆడే విషయమై రోహిత్ ఎలాంటి ప్రకటన చేస్తారని అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.
News January 18, 2025
ఇవాళ స్కూళ్లకు సెలవు ఉందా?
TG: రాష్ట్రంలోని స్కూళ్లకు నిన్నటితో సంక్రాంతి సెలవులు ముగిశాయి. నేటి నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు పున:ప్రారంభం కానున్నాయి. అయితే ఇవాళ కూడా హాలిడే అంటూ కొన్ని స్కూళ్లు తల్లిదండ్రులకు మెసేజులు పంపించాయి. అటు హాస్టళ్లలో ఉండే చాలా మంది విద్యార్థులు ఇంకా స్వస్థలాల నుంచి రాలేదు. సోమవారం నుంచి వస్తామని చెబుతున్నారు. మరి ఇవాళ మీ స్కూలుకు సెలవు ఇచ్చారా? కామెంట్ చేయండి.