India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: తిరుమల లడ్డూ అంశంపై కేంద్రం చర్యలు ప్రారంభించింది. తిరుమలకు కల్తీ నెయ్యి సప్లై చేసిన తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీకి FSSAI షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 4 కంపెనీల నుంచి కేంద్రం నెయ్యి శాంపిల్స్ సేకరించింది. అందులో ఏఆర్ డెయిరీకి చెందిన నెయ్యి నాణ్యత పరీక్షలో విఫలమైనట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది.
హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ భీకర దాడికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. లెబనాన్‌లో హెజ్బొల్లా ఆయుధ సామాగ్రిని నిల్వ ఉంచిన ప్రాంతాల్లోని ప్రజలు ఉన్నపళంగా ఇళ్లు ఖాళీ చేసి వెళ్లాల్సిందిగా ఇజ్రాయెల్ హెచ్చరించింది. దీని కోసం ఆ దేశ పౌరులకు 80 వేల ఫోన్ కాల్స్ వచ్చినట్టు లెబనీస్ అధికారులు తెలిపారు. సోమవారం దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 100 మందికిపైగా మరణించినట్టు తెలుస్తోంది.
TG: అమృత్ టెండర్లలో CM రేవంత్ రెడ్డి మోసాన్ని బయటపెట్టినందుకు కొందరు సీనియర్ కాంగ్రెస్ నేతలు తనను అభినందిస్తూ మెసేజులు చేస్తున్నారని కేటీఆర్ ట్వీట్ చేశారు. కానీ ఈ స్కామ్‌పై తెలంగాణ బీజేపీ నేతలు మౌనంగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. ఇది బీజేపీ, రేవంత్ మధ్య ఉన్న వింత ప్రేమను బయటపెడుతోందని పేర్కొన్నారు.
‘మిస్టర్ బచ్చన్’తో అభిమానులను నిరుత్సాహానికి గురి చేసిన దర్శకుడు హరీశ్ శంకర్ బంపరాఫర్ కొట్టేసినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నట్లు సినీ వర్గాల్లో టాక్. ఈ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరించనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఇటీవల హరీశ్, చిరు కాంబినేషన్లో వచ్చిన యాడ్‌పై నెట్టింట ప్రశంసలు వెల్లువెత్తాయి.
ఉల్లి ధరలకు కళ్లెమేసేందుకు బఫర్ స్టాక్‌ను కేంద్రం హోల్‌సేల్ మార్కెట్లకు సప్లై చేయనుంది. ఇప్పటికే కొన్ని సిటీల్లో NCCF, NAFED ద్వారా కిలో రూ.35కే అమ్ముతున్నట్టు ప్రకటించింది. ‘ఎగుమతి సుంకం ఎత్తేయడంతో ఉల్లి ధరలు పెరుగుతాయని ముందే అంచనా వేశాం. అందుకే మావద్ద ఉన్న 4.7 లక్షల టన్నుల బఫర్ స్టాక్‌ను సబ్సిడీతో విక్రయిస్తాం’ అని కన్జూమర్ అఫైర్స్ సెక్రటరీ నిధి అన్నారు. ప్రస్తుతం కేజీ ఉల్లి రూ.60గా ఉంది.
AP: ముస్లిం మైనారిటీలకు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పథకాలు రీ స్ట్రక్చర్ చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. గత టీడీపీ ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలు, ఎన్నికల్లో ప్రకటించిన హామీలు బేరీజు వేసుకోవాలని సూచించారు. మైనారిటీ సంక్షేమంపై సచివాలయంలో మంత్రి ఫరూక్, అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
భారత స్పిన్నర్లు అశ్విన్, జడేజాపై పాక్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ ప్రశంసలు కురిపించారు. వారిద్దరూ లేకుండా భారత్ స్వదేశంలో టెస్టు ఆడటాన్ని ఊహించలేమని పేర్కొన్నారు. ‘6 వికెట్లు, సెంచరీతో అశ్విన్ అద్భుత ప్రదర్శన చేశారు. జడ్డూ-అశ్విన్‌ది మ్యాచ్ విన్నింగ్ భాగస్వామ్యం. ఇక ఘోర ప్రమాదం తర్వాత పంత్ సైతం అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చారు. ఆయనకు చికిత్స అందించిన వైద్యులకు హ్యాట్సాఫ్’ అని కొనియాడారు.
అజిత్ పవార్‌తో కుటుంబపరంగా కలిసే ఉన్నామని NCP SP చీఫ్ శరద్ పవార్ అన్నారు. బాబాయ్-అబ్బాయి మరోసారి కలిసి పనిచేయాలన్న డిమాండ్లపై ఆయన స్పందించారు. కుటుంబపరంగా ఇద్దరం కలిసే ఉన్నామని, రాజకీయంగా ఆయన మరో పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారని శరద్ పవార్ పేర్కొన్నారు. బారామతిలో సుప్రియ సూలేపై తన భార్యను పోటీకి దింపి తప్పు చేశానని అజిత్ పవార్ గతంలో పశ్చాత్తాపం చెందారు.
AP: న్యాయశాఖపై సమీక్షించిన సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. త్వరలో మంత్రివర్గ భేటీలో తీర్మానం చేసి కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతామని తెలిపారు. అటు అమరావతిలో 100 ఎకరాల్లో ఇంటర్నేషనల్ లా కాలేజీ ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. జూనియర్ న్యాయవాదులకు రూ.10వేల గౌరవ వేతనం ఇవ్వాలని ఆదేశించారు.
ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్‌లో పిడుగుపాటుకు 8 మంది మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మృతుల్లో ఆరుగురు విద్యార్థులు కూడా ఉన్నారు. పరీక్ష రాసి వస్తున్న విద్యార్థులు భారీ వర్షం కారణంగా ఒక చెట్టు కింద తలదాచుకున్నారు. ఈ క్రమంలో చెట్టుపై పిడుగుపడటంతో విద్యార్థులు మృతి చెందినట్టు కలెక్టర్ సంజయ్ అగర్వాల్ ధ్రువీకరించారు.
Sorry, no posts matched your criteria.