News September 23, 2024

లడ్డూ వ్యవహారంపై సుప్రీంకోర్టుకు వైవీ సుబ్బారెడ్డి

image

AP: తిరుమల లడ్డూ వివాదంపై టీటీడీ మాజీ ఛైర్మన్, వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. లడ్డూ వ్యవహారంపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి లేదా నిపుణులతో విచారణ చేయించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనితో పాటు హైకోర్టులో కూడా ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ మ.2:15 గంటలకు హైకోర్టులో దీనిపై విచారణ జరగనుంది.

News September 23, 2024

హరియాణా ఎన్నికలు: మహిళలంటే మరీ ఇంత చిన్నచూపా

image

హరియాణా అంటేనే ఆడవాళ్లపై ఓ చిన్నచూపు! అక్కడ 2023లో ఫీమేల్ బర్త్‌రేట్ 1000కి 916. ఎలక్షన్లలోనూ ఇంతే. 1966 నుంచి అసెంబ్లీకి వెళ్లింది 87 మందే. ఇక మహిళా CM సంగతి దేవుడెరుగు. తాజా ఎన్నికల్లో 90 స్థానాలకు అన్ని పార్టీల నుంచి కలిపి 51 మందే పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ 12, INLD, BSP కలిపి 11, BJP 10, JJP, ASP కలిపి 8, AAP 10 మందికి సీట్లిచ్చాయి. ఇందులో మెజారిటీ ప్రముఖులు, రాజకీయ వారసులే కావడం గమనార్హం.

News September 23, 2024

వైఎస్ జగన్‌ను అరెస్ట్ చేయాలి: టీడీపీ ఎంపీ

image

AP: తిరుమల లడ్డూ విషయంలో మాజీ సీఎం జగన్ ప్రజల మనోభావాలను దెబ్బతీశారని ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. ఆయనతో పాటు గత ప్రభుత్వంలో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన కొట్టు సత్యనారాయణను అరెస్ట్ చేయాలని వ్యాఖ్యానించారు. గత టీటీడీ బోర్డు సభ్యులను విచారించి చర్యలు తీసుకోవాలన్నారు.

News September 23, 2024

పోలీసులకు హరీశ్ రావు హెచ్చరిక

image

TG: కొందరు పోలీసులు కాంగ్రెస్ ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని హరీశ్ రావు అన్నారు. ‘ఏపీలో ఏమైందో పోలీసులు గుర్తుంచుకోవాలి. అలాంటి పరిణామాలు ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలి. కాంగ్రెస్ ప్రభుత్వం శాశ్వతం కాదు. అధికారులు చట్టాలకు లోబడి పనిచేయాలి. BRS శ్రేణులపై అక్రమ కేసులు పెడితే సహించం’ అని హెచ్చరించారు. కాగా YCPకి సహకరించారని ముగ్గురు IPSలను AP ప్రభుత్వం ఇటీవల సస్పెండ్ చేసింది.

News September 23, 2024

కొత్త పెన్షన్లపై BIG UPDATE

image

AP: కొత్త పెన్షన్లను అక్టోబర్ నుంచి అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గతంలో తొలగించిన లక్షల మంది లబ్ధిదారుల వివరాలను సేకరిస్తోంది. గ్రామ సభలు నిర్వహించి ఆరు అంచెల తనిఖీల తర్వాత వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగుల్లో అర్హులు, అనర్హులను గుర్తించనున్నారు. సచివాలయాల్లో జాబితాను ప్రదర్శించి, అనర్హుల నుంచి వివరణ తీసుకుంటారు. క్యాబినెట్ సబ్ కమిటీ దీనిపై త్వరలో విధివిధానాలు ప్రకటించే ఛాన్సుంది.

News September 23, 2024

అదే జరిగితే పోటీ చేయను: ట్రంప్

image

ఈ ఎలక్షన్స్‌లో గెలవకుంటే 2028లో మళ్లీ పోటీ చేయనని రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అన్నారు. కొవిడ్ టైమ్‌లో తన పాలన బాగుందన్నారు. సాధారణంగా ఓటమిని అంగీకరించని ఆయన ఇలా మాట్లాడటం ఇంట్రెస్టింగ్‌గా మారింది. 2020లో మాదిరిగా భారీ స్థాయిలో మోసగిస్తే, తప్పుడు ఆరోపణలు చేస్తేనే అలా జరుగుతుందని ట్రంప్ చెప్పే సంగతి తెలిసిందే. 2028 నాటికి ఆయనకు 82ఏళ్లు వస్తాయి.

News September 23, 2024

‘దేవర’ ఈవెంట్‌ను అందుకే రద్దు చేశాం: శ్రేయాస్ మీడియా

image

‘దేవర’ ఈవెంట్ రద్దుపై శ్రేయాస్ మీడియా ప్రెస్‌నోట్ రిలీజ్ చేసింది. ‘పోలీసులు 4వేల మంది హాజరయ్యేందుకు పర్మిషన్ ఇచ్చారు. కానీ 30-35 వేల మంది రావడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఫ్యాన్స్ సేఫ్టీ కోసమే ఈవెంట్ రద్దు చేశాం. మమ్మల్ని క్షమించండి. అవుట్ డోర్ ఈవెంట్ కోసం ప్రయత్నించాం. కానీ గణేశ్ నిమజ్జనం, వెదర్ అలర్ట్స్ వల్ల సాధ్యం కాలేదు. పరిమితికి మించి పాసులు జారీ చేశామన్న ఆరోపణలు అవాస్తవం’ అని పేర్కొంది.

News September 23, 2024

రామయ్యపై ఒట్టేసి మాట తప్పారు: హరీశ్ రావు

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వ తీరు వల్ల లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ‘ఖమ్మం జిల్లా రైతులు ఏం పాపం చేశారు? సీతారామ ప్రాజెక్టు పూర్తయ్యిందని మంత్రులు చెప్పారు. మరి వైరా దిగువన ఉన్న రైతులకు నీళ్లు ఎందుకు ఇవ్వడం లేదు? రుణమాఫీ చేస్తానని భద్రాద్రి రామయ్యపై ఒట్టేసి మాట తప్పారు. వరద బాధితులకు ఇప్పటివరకు పూర్తి పరిహారం ఇవ్వలేదు’ అని ప్రెస్‌మీట్‌లో మండిపడ్డారు.

News September 23, 2024

లడ్డూ ప్రసాదాలపై అనుమానాలు వద్దు: TTD

image

AP: ఇక నుంచి లడ్డూ ప్రసాదాలపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని టీటీడీ పేర్కొంది. తెలిసీ తెలియక జరిగిన దోషాలు శాంతిహోమం, సంప్రోక్షణతో పోయాయని చెప్పింది. మార్చిన నెయ్యితోనే లడ్డూలు చేస్తున్నామని వెల్లడించింది. ప్రసాదాల తయారీ కేంద్రాలతో పాటు ఆలయంలోని అన్ని విభాగాల్లో సంప్రోక్షణ చేస్తున్నామంది.

News September 23, 2024

ఖాళీగా వందేభారత్.. ఇప్పుడైనా హాల్టింగ్ ఇవ్వాలని డిమాండ్

image

సికింద్రాబాద్-నాగ్‌పూర్ మధ్య ఇటీవల ప్రారంభించిన వందేభారత్ రైలుకు ఆక్యుపెన్సీ ఆశించినంతగా లేదు. మొత్తం 1328 సీట్లలో దాదాపు 1110 సీట్లు ఖాళీగానే ఉంటున్నాయి. రైలు ఆక్యుపెన్సీ 15.81% మించడం లేదు. ప్రస్తుతం TGలోని ఖాజీపేట, రామగుండం స్టేషన్లలోనే ఆగుతున్న ఈ రైలుకు మంచిర్యాల, పెద్దపల్లి, కాగజ్‌నగర్‌లో హాల్టింగ్ సౌకర్యం ఇవ్వాలని ప్రయాణికులు కోరుతున్నారు. దీంతో రైలు ఆక్యుపెన్సీ పెరుగుతుందని చెబుతున్నారు.