News June 18, 2024

ఏపీ ఎలాన్ మస్క్‌లా జగన్ తీరు: సోమిరెడ్డి

image

AP: బ్యాలెట్‌తో ఎన్నికలు నిర్వహించాలన్న <<13460880>>జగన్<<>> విజ్ఞప్తిపై మాజీ మంత్రి, TDP నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు చేశారు. ‘జగన్ ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. AP ఎలాన్ మస్క్‌లా మాట్లాడుతున్నాడు. గెలిస్తే తన గొప్ప. ఓడితే EVMల తప్పా? 2019 ఎన్నికల్లో తాను గెలిచినప్పుడు EVMల గురించి తానేం మాట్లాడాడో ఓసారి గుర్తు చేసుకోవాలి. పరనింద..ఆత్మ స్తుతి మాని ఇకనైనా ఆయన ఆత్మ విమర్శ చేసుకోవాలి’ అని సూచించారు.

News June 18, 2024

T20 WC: నికొలస్ పూరన్ రికార్డు

image

అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నికొలస్ పూరన్ రికార్డ్ సృ‌ష్టించారు. పురుషుల క్రికెట్‌లో వెస్టిండీస్‌ తరఫున అంతర్జాతీయ టీ20ల్లో 2వేల రన్స్ చేసిన తొలి ఆటగాడిగా నిలిచారు. అఫ్గాన్‌పై ఆయన 53 బంతుల్లోనే 98 పరుగులు చేశారు. మొత్తంగా విండీస్ 218 రన్స్ చేయగా.. ఛేదనలో అఫ్గాన్ ఇప్పటికే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉంది.

News June 18, 2024

BREAKING: పవన్ కళ్యాణ్‌కు Y ప్లస్ సెక్యూరిటీ

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ప్రభుత్వం భద్రత పెంచింది. ఆయనకు Y ప్లస్ సెక్యూరిటీతో పాటు ఎస్కార్ట్, బుల్లెట్ ప్రూఫ్ కారును కేటాయించింది. కాగా ఇవాళ సచివాలయం వెళ్లనున్న పవన్ తన ఛాంబర్‌ను పరిశీలించనున్నారు. రేపు ఆయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారు.

News June 18, 2024

10 వేల మంది ఉపాధ్యాయులకు ప్రమోషన్!

image

TG: రాష్ట్రంలోని 10వేల మంది ఉపాధ్యాయులు స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ పొందనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఏ క్షణంలోనైనా ఉత్తర్వులు వెలువడనున్నట్లు సమాచారం. ఈ ఆదేశాలతో భాషా పండితులు, స్కూల్ అసిస్టెంట్ భాషా ఉపాధ్యాయులు, పీఈటీలు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ డైరెక్టర్లు కానున్నారు. వీరితో పాటు SGTలూ పదోన్నతి పొందే అవకాశం ఉంది.

News June 18, 2024

T20 WC: ఎల్లుండే మ్యాచ్.. సూర్యకు గాయం

image

భారత స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ నెట్ ప్రాక్టీస్‌ సమయంలో గాయపడ్డారు. త్రోడౌన్స్‌కు బ్యాటింగ్ సాధన చేస్తుండగా ఓ బంతి ఆయన మణికట్టును బలంగా తాకింది. ఫిజియో స్ప్రే చేసిన అనంతరం స్వల్ప విరామం తీసుకుని ఆయన ప్రాక్టీస్ కొనసాగించారు. గాయం తీవ్రత ఎలాంటిదో తెలియాల్సి ఉంది. ఎల్లుండి అఫ్గానిస్థాన్‌పై భారత్ తొలి సూపర్-8 మ్యాచ్‌ను బార్బడోస్‌లో ఆడనుంది.

News June 18, 2024

రష్యా, ఉత్తర కొరియా బంధం ఆందోళనకరం: అమెరికా

image

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈరోజు, రేపు ఉత్తర కొరియాలో పర్యటించనుండటంపై యూఎస్ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ ఆందోళన వ్యక్తం చేశారు. ‘పుతిన్ పర్యటన గురించి మాకు బెంగ లేదు కానీ రెండు దేశాల బంధం బలోపేతం కావడమే ఆందోళన కలిగిస్తోంది. ఉత్తర కొరియా ఇస్తున్న క్షిపణుల్నే రష్యా ఉక్రెయిన్‌పై వాడుతోంది. ఇప్పుడు కొరియా ద్వీపకల్ప పరిస్థితుల్నీ పుతిన్ పర్యటన ప్రభావితం చేయొచ్చు’ అని పేర్కొన్నారు.

News June 18, 2024

నేడు సచివాలయానికి పవన్ కళ్యాణ్

image

AP: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు వెలగపూడి సచివాలయానికి రానున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం తర్వాత పవన్ తొలిసారి సచివాలయానికి వస్తుండటంతో ఘనస్వాగతం పలికేందుకు అమరావతి రైతులు ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు తన ఛాంబర్‌ను ఆయన పరిశీలించనున్నారు. అనంతరం CM చంద్రబాబుతో భేటీ కానున్నారు. రేపు డిప్యూటీ సీఎంగా జనసేనాని బాధ్యతలు స్వీకరించనున్నారు.

News June 18, 2024

ఎన్నికలపై జగన్ సంచలన ట్వీట్

image

AP: అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్య దేశాలన్నీ ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్‌తో ఓటింగ్ నిర్వహిస్తున్నాయని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టుకోవడానికి మనం కూడా ఆ దిశగా అడుగులు వేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. న్యాయం జరగడమే కాకుండా జరిగినట్లు కనిపించాలని జగన్ ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యం ఎలాంటి సందేహాలు లేని వ్యవస్థగా పురోగమించాల్సిన అవసరం ఉందన్నారు.

News June 18, 2024

నేనింకా విద్యార్థినే.. ఎల్ఎల్ఎం చదువుతున్నా: సీతక్క

image

TG: మంత్రిగా పనిచేస్తున్నప్పటికీ, తాను ఇంకా విద్యార్థినేనని కాంగ్రెస్ నేత సీతక్క అన్నారు. వ్యవస్థలో మార్పు కోసం గతంలో గన్ను పట్టి, తర్వాత సమాజ సేవ కోసం తిరిగి వచ్చానని చెప్పారు. మహబూబాబాద్ జిల్లా కురవిలోని గిరిజన ఏకలవ్య గురుకులాన్ని ఆమె సందర్శించారు. తాను ప్రస్తుతం ఎల్ఎల్ఎం రెండో సంవత్సరం చదువుతున్నానని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

News June 18, 2024

నేడు ఇంటర్ సెకండియర్ సప్లిమెంటరీ ఫలితాలు

image

AP: నేడు ఇంటర్ సెకండియర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు అధికారులు రిజల్ట్స్ వెల్లడించనున్నారు. దాదాపు 1.40 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. మరోవైపు ఫస్టియర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 26న విడుదల చేయనున్నట్లు సమాచారం.