News December 22, 2024

ఈ నెల 25న తెలంగాణకు ఉపరాష్ట్రపతి

image

TG: ఈ నెల 25న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ రాష్ట్రంలో పర్యటిస్తారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలో ఉన్న ఐసీఏఆర్-కృషి విజ్ఞాన కేంద్రాన్ని ఆయన సందర్శిస్తారు. అనంతరం ఆయన సేంద్రీయ రైతులతో సమావేశమవుతారు. ఆ రోజు కన్హా శాంతివనంలో బస చేసి మరుసటిరోజు ఉదయం ఢిల్లీకి వెళ్తారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్ పర్యవేక్షిస్తున్నారు.

Similar News

News January 19, 2025

మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడంటే?

image

TG: సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నుంచి రాగానే క్యాబినెట్ విస్తరణ ఉంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలలోపే ఇది జరుగుతుందని తెలిపారు. తాము చేస్తున్న అభివృద్ధిని చెప్పుకోవడంలో వెనుకబడ్డామని హైకమాండ్ మందలించినట్లు చెప్పారు. మరోవైపు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేసి కేటాయింపులు చేస్తామని పేర్కొన్నారు.

News January 19, 2025

సైఫ్‌పై దాడి.. థానేలో నిందితుడి అరెస్ట్!

image

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై దాడి చేసిన నిందితుడిని థానేలో ముంబై పోలీసులు అరెస్ట్ చేసినట్లు జాతీయ మీడియా పేర్కొంది. సీసీటీవీ విజువల్స్ ఆధారంగా అతడిని ఓ రెస్టారెంట్ సమీపంలో గుర్తించినట్లు తెలిపింది. సుమారు 100 మంది పోలీసులు ఈ సెర్చ్ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. అంతకుముందు ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ రైల్వే స్టేషన్‌లో ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.

News January 19, 2025

‘కన్నప్ప’ స్టోరీ ఐడియా ఆయనదే: మంచు విష్ణు

image

‘కన్నప్ప’ సినిమా గురించి ఏడెనిమిదేళ్లుగా ప్లానింగ్‌లో ఉన్నట్లు హీరో మంచు విష్ణు చెప్పారు. బడ్జెట్ కారణాల వల్ల ఇప్పుడు కుదిరిందని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ సినిమాకు ఐడియా తనికెళ్ల భరణి ఇచ్చారని పేర్కొన్నారు. ఈ చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ వంటి స్టార్లు నటిస్తున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 25న థియేటర్లలో ఈ మూవీ రిలీజ్ కానుంది.