News December 21, 2024

ఇన్సూరెన్సులు కట్టేవారికి నో రిలీఫ్

image

హెల్త్, లైఫ్ ఇన్సూరెన్సులు ప్రీమియంలపై జీఎస్టీ భారం తగ్గనుందనే ప్రచారంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. దీనిపై మరింత సమాచారం సేకరించాల్సి ఉందని, ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాగా ఇన్సూరెన్సుల ప్రీమియంలపై ప్రస్తుతం ఉన్న 18శాతం జీఎస్టీని తగ్గించనున్నారని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా నిర్మల ప్రకటనతో క్లయింట్లకు నిరాశే ఎదురైంది.

News December 21, 2024

కూల్‌డ్రింక్స్ తాగుతున్నారా?

image

చెక్కర అధికంగా ఉన్న ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడం వల్ల జీవితంలో కొంత కాలాన్ని కోల్పోతామని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కోక్ లాంటి కూల్‌డ్రింక్ తాగితే 12 నిమిషాల జీవితకాలం తగ్గిపోతుందని తెలిపారు. ఇది తాగిన తర్వాత ఊబకాయం, మధుమేహం వంటివి సోకి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు. హాట్ డాగ్ తింటే 36 నిమిషాలు, శాండ్‌విచ్‌లు తింటే 13 నిమిషాలు, చీజ్‌బర్గర్‌లు తింటే జీవితంలో 9 నిమిషాలను కోల్పోతారు.

News December 21, 2024

పాప్‌కార్న్.. GST @ 5%, 12%, 18%!

image

సినిమా థియేటర్లు సహా ఇతర లీజర్, ఎంటర్‌టైన్మెంట్ సమయాల్లో కొనే పాప్‌కార్న్ రకాన్ని బట్టి GST మారుతుంది. మీరు ప్యాకింగ్ లేని రెడీ టు ఈట్ సాల్ట్ పాప్‌కార్న్ కొంటే 5% GST వర్తిస్తుంది. ఇక ప్యాకింగ్, బ్రాండ్ లేబ్లింగ్ ఉన్నది కొంటే 12% పన్ను చెల్లించాలి. క్యారమెల్ వంటి షుగర్ కోటెడ్ వేరియంట్ కొంటే 18% ట్యాక్స్ పడుతుంది.

News December 21, 2024

మహారాష్ట్ర నూతన మంత్రివర్గం ఖరారు

image

మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ నూతన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. హోం, విద్యుత్, న్యాయ శాఖ పదవులు తన వద్దే ఉంచుకున్నారు. ఆర్థిక, ప్లానింగ్ శాఖను అజిత్ పవార్‌కు, హౌసింగ్, అర్బన్ డెవలప్‌మెంట్, పబ్లిక్ వర్క్స్ శాఖలను ఏక్‌నాథ్ శిండేకు అప్పగించారు. రెవెన్యూ-చంద్రశేఖర్ ప్రభావతి, వ్యవసాయ-మాణిక్‌రావు సరస్వతి, సివిల్ సప్లై-ధంజయ్ రుక్మిణి ముండే, పరిశ్రమలు-ఉదయ్ స్వరూప రవిచంద్ర, ఐటీ-ఆశిశ్ మీనాల్.

News December 21, 2024

పాత కార్లపై జీఎస్టీ 18శాతానికి పెంపు

image

కంపెనీల నుంచి పాత కార్లు కొనేవారిపై GST భారం పడనుంది. పాత ఎలక్ట్రానిక్‌తో పాటు పెట్రోల్, డీజిల్ కార్లపై GSTని 18శాతానికి పెంచుతున్నట్లు FM నిర్మలా సీతారామన్ తెలిపారు. గతంలో ఈవీలపై 5%, పెట్రోల్, డీజిల్ వాహనాలపై 12% GST ఉండేది. అయితే వ్యక్తుల మధ్య ఈవీల క్రయవిక్రయాలు జరిగితే జీఎస్టీ ఉండదని ఆమె చెప్పారు. మరోవైపు స్విగ్గీ, జొమాటో డెలివరీ ఛార్జీలపై GST తగ్గింపుపై నిర్ణయం తీసుకోలేదన్నారు.

News December 21, 2024

వైభవ్ సూర్యవంశీ మరో ఘనత

image

బిహార్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ మరో ఘనత సాధించారు. లిస్ట్-ఏ క్రికెట్ ఆడిన అతి పిన్న వయస్కుడిగా వైభవ్ (13 yrs 269 days)నిలిచారు. ఇవాళ విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా మధ్యప్రదేశ్‌తో మ్యాచ్‌లో ఆయన లిస్ట్-ఏ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. గతంలో ఈ రికార్డు అలీ అక్బర్ (14 yrs 51 days) ఉండేది. కాగా ఐపీఎల్ మెగా వేలంలో అమ్ముడైన పిన్న వయస్కుడిగానూ వైభవ్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.

News December 21, 2024

వివాదం కోరుకోవడం లేదంటూనే బన్నీ విమర్శలు

image

ప్రభుత్వంతో వివాదం కోరుకోవడం లేదంటూనే TG CMకు బన్నీ కౌంటర్ ఇచ్చారు. పర్మిషన్ లేకున్నా రోడ్ షో చేశారని అసెంబ్లీలో రేవంత్ అంటే, రావద్దని పోలీసులు అప్పుడే చెబితే వెనక్కి వెళ్లేవాన్నని బన్నీ చెప్పారు. ఇక అది రోడ్ షో కాదని, కార్‌పై నుంచి చేయి ఊపానన్నారు. అటు ప్రమాదం గురించి చెప్పి, వెళ్లాలని పోలిస్ హెచ్చరించినా మళ్లీ చేతులూపుతూ వెళ్లారని CM అన్నారు. అయితే తనకు వారు ఏమీ చెప్పలేదని బన్నీ పేర్కొన్నారు.

News December 21, 2024

మినీ ఇండియాలా కువైట్: ప్రధాని మోదీ

image

కువైట్‌ను చూస్తోంటే మినీ ఇండియాలా కనిపిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. విదేశంలో ఇంతమంది భారతీయులను చూడటం సంతోషంగా ఉందని చెప్పారు. ‘కువైట్ నేతలతో ఎప్పుడు మాట్లాడినా భారతీయుల గురించే చెబుతుంటారు. విదేశీ కరెన్సీ ఆర్జనలో భారత్ టాప్‌లో ఉంది. మీరంతా కష్టపడటం వల్లే ఇది సాధ్యమైంది. భారత్, కువైట్ మధ్య దౌత్య సంబంధాలే కాదు.. విడదీయలేని మైత్రి కూడా ఉంది’ అని ఆయన పేర్కొన్నారు.

News December 21, 2024

సంక్రాంతి తర్వాత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ: సీఎం

image

TG: ప్రతి పేదవాడికి సంక్రాంతి తర్వాత ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని CM రేవంత్ తెలిపారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో ఎక్కువ మంది జరుపుకొనే పండుగ క్రిస్మస్ అని అన్నారు. ‘పేదలకు విద్య, వైద్యాన్ని క్రైస్తవ మిషనరీలు అందిస్తున్నాయి. ఇంకో మతాన్ని కించపరచకుండా ఎవరైనా మతప్రచారం చేసుకోవచ్చు. దళిత క్రిస్టియన్ల సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్నాం’ అని తెలిపారు.

News December 21, 2024

అనుమతి ఇస్తే ఇప్పుడే శ్రీతేజ్‌ను కలుస్తా: బన్నీ

image

TG: పోలీసులు ఇప్పుడు అనుమతి ఇస్తే వెంటనే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను వెళ్లి పరామర్శిస్తానని అల్లు అర్జున్ చెప్పారు. కోర్టులో కేసు ఉండటం వల్ల కలవలేకపోతున్నానని చెప్పారు. అతను తన ఫ్యాన్ అని, కలవకుండా ఎందుకు ఉంటానన్నారు. శ్రీతేజ్‌ను పరామర్శించడానికి తాను వెళ్లలేకపోయినా తండ్రి అల్లు అరవింద్, తన టీం ఇతరులను బాలుడి వద్దకు పంపి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నట్లు తెలిపారు.