News December 21, 2024

ఫామ్‌హౌస్‌లో ఉన్న వారికి రైతు భరోసా ఇవ్వాలా?: సీతక్క

image

TG: కౌలు రైతులకు బీఆర్ఎస్ పార్టీ గతంలో రైతు బంధు ఎందుకు ఇవ్వలేదని మంత్రి సీతక్క అసెంబ్లీలో మండిపడ్డారు. ‘రూ.5లక్షల జీతాలు తీసుకునే వారికి గతంలో రైతు బంధు వచ్చింది. సాగులో లేని, గుట్టలకు కూడా డబ్బులు వేశారు. నిజంగా సాగు చేస్తూ పట్టాలు లేని రైతులకు ఇవ్వలేదు. పట్టా ఉన్నవారికే మీ పాలనలో రైతుబంధు ఇచ్చారు. ఫామ్‌హౌస్‌లో ఉన్న వారికి కూడా డబ్బులు ఇవ్వాలా?’ అని ఆమె ప్రశ్నించారు.

News December 21, 2024

‘మిషన్ భగీరథ’ విఫలం.. నిరూపిస్తా లేదంటే రాజీనామా చేస్తా: జూపల్లి

image

కేటీఆర్ చేసిన సవాలుకు మంత్రి జూపల్లి ప్రతి సవాల్ విసిరారు. 60శాతం గ్రామాల్లో మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని అన్నారు. ‘నీళ్లు రావట్లేదన్న విషయాన్ని నేను 100శాతం నిరూపిస్తా. నిరూపించలేకపోతే రాజీనామా చేస్తా. ఏ పద్ధతిలో ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారో, అందులో ఏం జరిగిందో నాకు తెలుసు. రూ.8 లక్షల కోట్ల అప్పు చేసి కూడా ప్రాజెక్టుల్ని పూర్తి చేయలేకపోయారు. భూ సమీకరణకు కూడా డబ్బులివ్వలేదు’ అని మండిపడ్డారు.

News December 21, 2024

‘ఉచిత బస్సు‘పై అధ్యయనానికి మంత్రుల కమిటీ: ప్రభుత్వం

image

AP: మహిళలకు ఉచిత బస్సు పథకం వివిధ రాష్ట్రాల్లో ఎలా అమలవుతుందో అధ్యయనం చేసేందుకు మంత్రుల బృందంతో కూడిన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ నివేదిక ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌కు అనువైన పథకాన్ని అమలు చేయనుంది. ఈ మేరకు ఓ సర్క్యులర్‌లో తెలిపింది. రవాణా, మహిళా-శిశు సంక్షేమ , హోంశాఖ మంత్రులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని వివరించింది. ఎన్నికల సమయంలో మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని కూటమి ప్రకటించింది.

News December 21, 2024

కేటీఆర్ ఆ విషయాన్ని నిరూపిస్తే రాజీనామా చేస్తా: వెంకట్‌రెడ్డి

image

24 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం తమదేనన్న KTR వ్యాఖ్యల్ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తప్పుబట్టారు. ‘11 నుంచి 13 గంటలు మాత్రమే కరెంట్ ఇచ్చారు. నేను స్వయంగా గ్రామాల్లో తిరిగి తెలుసుకున్నాను. కేటీఆర్ తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలి. రైతు బంధుతో సాగు పెరిగిందని KTR అంటున్నారు. నల్గొండ జిల్లాలో ఒక్క ఎకరా ఆయకట్టు పెరిగినట్లు నిరూపించినా రాజీనామా చేస్తా’ అని సవాల్ చేశారు.

News December 21, 2024

‘గేమ్ ఛేంజర్’ ఈవెంట్‌కు చిరు, పవన్?

image

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా తెరకెక్కుతోన్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా నుంచి ఈనెల 27న ట్రైలర్ విడుదల కానున్నట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. దీంతోపాటు ఏపీలో ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ ఈవెంట్‌కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో పాటు మెగాస్టార్ చిరంజీవి హాజరుకానున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే మేకర్స్ ప్రకటన చేయనున్నారు.

News December 21, 2024

సీఎంను ఏకవచనంతో మాట్లాడొద్దు: కేటీఆర్‌తో స్పీకర్

image

సీఎం రేవంత్ రెడ్డికి గౌరవం ఇవ్వాలని KTRకు స్పీకర్ సూచించారు. సభానాయకుడైన రేవంత్‌ను ఏకవచనంతో మాట్లాడొద్దని పేర్కొన్నారు. గౌరవమనేది ఇచ్చి పుచ్చుకోవాలని, తమకు గౌరవమిస్తే తాము కూడా గౌరవంగా మాట్లాడతామని కేటీఆర్ జవాబిచ్చారు. ‘మా నాయకుడు కేసీఆర్‌ను వారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మేం కూడా అదే తరహాలో స్పందిస్తాం. నేనేం తిట్టట్లేదు కదా? పేరు పెట్టి పిలిచాను అంతే కదా?’ అంటూ వివరణ ఇచ్చారు.

News December 21, 2024

ఏపీలో భారీగా తగ్గిన మద్యం ధరలు

image

ఏపీలో మందుబాబులకు మంచి కిక్కిచ్చే న్యూస్. 11 మద్యం కంపెనీలు బేస్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఒక్కో క్వార్టర్‌పై రూ.30, ఫుల్ బాటిల్‌పై సుమారు రూ.90-120 వరకు ధరలు తగ్గాయి. మాన్షన్ హౌస్, రాయల్ ఛాలెంజ్, యాంటిక్విటీ సహా పలు బ్రాండ్లు ఇందులో ఉన్నాయి. త్వరలోనే న్యూఇయర్, సంక్రాంతి పండుగలు రానుండటంతో ధరల తగ్గింపుపై మందుబాబులు సంబరపడుతున్నారు.

News December 21, 2024

పెరిగిన బంగారం, వెండి ధరలు

image

గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తోన్న బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.650 పెరిగి రూ.77,450కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.600 పెరిగి రూ.71,000గా ఉంది. అటు వెండి ధర కూడా కేజీపై రూ.1000 పెరిగి రూ.99,000గా ఉంది.

News December 21, 2024

మా హయాంలోనే రైతుల ఆత్మహత్యలు తగ్గాయి: కేటీఆర్

image

TG: ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రైతు ఆత్మహత్యలతో సతమతమయ్యేదని, తమ హయాంలో సూసైడ్స్ గణనీయంగా తగ్గాయని BRS కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. ‘ఉమ్మడి రాష్ట్రంలో అన్నదాత వెన్నువిరిగింది. NCRB ప్రకారం రైతు ఆత్మహత్యలు తెలంగాణలోనే ఎక్కువ. మొత్తం ఆత్మహత్యల్లో 11.1 శాతం సూసైడ్స్ రాష్ట్రానివే. కానీ మా పాలన ముగిసేసరికి వాటిని 1.5శాతానికి తగ్గించాం’ అని పేర్కొన్నారు.

News December 21, 2024

భారీ వర్షాలు.. సీఎం కీలక ఆదేశాలు

image

AP: అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలపై CMO అధికారులతో CM చంద్రబాబు సమీక్ష చేశారు. ఆయా జిల్లాల్లో తాజా పరిస్థితులను అధికారులు వివరించారు. భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు స్కూళ్లకూ సెలవులు ఇచ్చినట్లు CMకు చెప్పారు. వర్షంతో దెబ్బతిన్న పంటనష్టం వివరాలు సేకరించి రైతులకు సాయం అందించాలని CBN ఆదేశించారు. పూర్తి అప్రమత్తంగా ఉండి పనిచేయాలని సూచించారు.