News December 21, 2024
ఫామ్‌హౌస్‌లో ఉన్న వారికి రైతు భరోసా ఇవ్వాలా?: సీతక్క
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1734764998522_81-normal-WIFI.webp)
TG: కౌలు రైతులకు బీఆర్ఎస్ పార్టీ గతంలో రైతు బంధు ఎందుకు ఇవ్వలేదని మంత్రి సీతక్క అసెంబ్లీలో మండిపడ్డారు. ‘రూ.5లక్షల జీతాలు తీసుకునే వారికి గతంలో రైతు బంధు వచ్చింది. సాగులో లేని, గుట్టలకు కూడా డబ్బులు వేశారు. నిజంగా సాగు చేస్తూ పట్టాలు లేని రైతులకు ఇవ్వలేదు. పట్టా ఉన్నవారికే మీ పాలనలో రైతుబంధు ఇచ్చారు. ఫామ్‌హౌస్‌లో ఉన్న వారికి కూడా డబ్బులు ఇవ్వాలా?’ అని ఆమె ప్రశ్నించారు.
Similar News
News January 19, 2025
20న ట్రంప్ ప్రమాణం.. 21న అరెస్టులు!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737257331428_924-normal-WIFI.webp)
డొనాల్డ్ ట్రంప్ ఈనెల 20న అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టగానే అక్రమ వలసదారులను మూకుమ్మడిగా అరెస్టు చేయిస్తారని వార్తలు వస్తున్నాయి. అలాంటి వారిపై ఆయన ఉక్కుపాదం మోపుతారని పలు కథనాలు వెల్లడిస్తున్నాయి. దీనిపై అమెరికా వలసల విభాగం మాజీ అధికారి ఒకరు స్పందిస్తూ ట్రంప్ ప్రమాణం చేశాక 21నుంచే ఈ అరెస్టులు జరిగే అవకాశం ఉందని తెలిపారు. అక్రమంగా చొరబడ్డ వలసదారులను వెనక్కి పంపే చర్యలను ముమ్మరం చేస్తారన్నారు.
News January 19, 2025
బుల్లిరాజు పాత్రకు మహేశ్‌బాబు ఫిదా!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737260421446_746-normal-WIFI.webp)
ప.గో జిల్లా భీమవరానికి చెందిన బుల్లిరాజు క్యారెక్టర్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సూపర్ స్టార్ మహేశ్ బాబు సైతం ఈ పాత్రకు ముగ్ధులైనట్లు తెలుస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ‘బుల్లిరాజు’ పాత్రలో నటించిన రేవంత్ ఈ విషయాన్ని వెల్లడించారు. ‘సినిమా చూశాక మహేశ్ సార్‌ను టీమ్‌తో కలిశాను. చాలా బాగా చేశావు బుల్లిరాజు. నీ కోసమైనా మళ్లీ సినిమా చూస్తానన్నారు. నాతో పాటు డాన్స్ కూడా చేశారు’ అని చెప్పుకొచ్చారు.
News January 19, 2025
డిప్యూటీ CM పదవికి లోకేశ్ అన్ని విధాలా అర్హుడు: సోమిరెడ్డి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737260878285_367-normal-WIFI.webp)
AP: మంత్రి లోకేశ్‌ను డిప్యూటీ CM చేయాలన్న పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి ప్రతిపాదనను MLA సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సమర్థించారు. ‘ఆ పదవికి లోకేశ్ వందశాతం అర్హులే. రాజకీయంగా అనేక డక్కామొక్కిలు తిని, అవమానాలు ఎదుర్కొన్నాక పాదయాత్రతో తనలోని నాయకత్వ లక్షణాలను నిరూపించుకున్నారు. డిప్యూటీ CM పదవికి అన్ని విధాలా అర్హుడైన ఆయన పేరును పరిశీలించాలని పార్టీని కోరుతున్నాను’ అని ట్వీట్ చేశారు.