India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జమ్మూ కశ్మీర్‌లో భారీ పోలింగ్ నెలకొనడంతో పాకిస్థాన్‌కు కడుపు మండుతోందని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఎద్దేవా చేశారు. అక్కడ ప్రజాస్వామ్యాన్ని చూసి కుళ్లుకుంటోందని విమర్శించారు. ‘ఆర్టికల్ 370ను మళ్లీ పునరుద్ధరిస్తామంటూ కాంగ్రెస్, ఎన్‌సీ, పీడీపీలు ప్రజలను మభ్యపెడుతున్నాయి. ఈ ఆర్టికల్‌ను తిరిగి తీసుకురావడం అసాధ్యం. ఈ మూడు పార్టీలు పాక్‌కు వంతపాడటం మానుకోవాలి’ అని ఆయన హితవు పలికారు.
TG: తిరుమల శ్రీవారు తనకు పునర్జన్మ ప్రసాదించారని సీఎం చంద్రబాబు అన్నారు. శ్రీనివాసుడితో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పారు. ‘గతంలో వైఎస్‌ఆర్ ఏడు కొండలను రెండే కొండలు అన్నారు. వైసీపీ హయాంలో కొండపై అపవిత్ర కార్యక్రమాలు జరిగాయి. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన తిరుమల లడ్డూను కూడా గత ప్రభుత్వం అపవిత్రం చేసింది. కానీ తమ ప్రభుత్వం తిరుమల పవిత్రతను కాపాడేందుకు ప్రయత్నిస్తోంది’ అని ఆయన వ్యాఖ్యానించారు.
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకున్న మెగాస్టార్ చిరంజీవికి సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. తన గ్రేస్, నటనతో తెలుగు చిత్ర పరిశ్రమకు ఎనలేని కృషి చేశారని ట్వీట్ చేశారు. ఇది చిరంజీవికి గుర్తింపును పెంచడంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారికి మరింత గర్వకారణమని పేర్కొన్నారు.
బౌలింగ్‌లో భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తనకు స్ఫూర్తి అని టీమ్ ఇండియా స్పిన్నర్ అశ్విన్ తెలిపారు. బంగ్లాతో తొలి టెస్టులో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్న అనంతరం ఆయన మాట్లాడారు. ‘హర్భజన్‌తో నన్ను నేను పోల్చుకోలేను. ఆయనో దిగ్గజం. జూనియర్ క్రికెట్‌లో భజ్జీ బౌలింగ్ యాక్షన్‌ను ట్రై చేస్తుండేవాడిని. నేను ఇప్పుడున్న స్థాయికి చేరుకోవడంలో ఎంతోమంది సాయం చేశారు’ అని గుర్తుచేసుకున్నారు.
TG: OCTలో గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూల్ ప్రకారం జరుగుతాయా లేదా అన్న సందేహాలు నెలకొన్నాయి. ఈ పరీక్షలపై హైకోర్టులో దాదాపు 20కి పైగా కేసులు ఉండటంతో నియామక ప్రక్రియపై అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. ఫైనల్ ‘కీ’లో తప్పులు, ST, EWS రిజర్వేషన్, go 29 vs 55 సహా పలు అంశాలపై కేసులు దాఖలవడమే వీరి ఆందోళనకు కారణం. ఈ అంశాలు కొలిక్కి వచ్చాకే పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం, TGPSCలను అభ్యర్థులు కోరుతున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘OG’. ఈ సినిమా నుంచి అప్డేట్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది. త్వరలోనే మాస్ ర్యాంపేజ్ అంటూ సంగీత దర్శకుడు తమన్ పోస్ట్ చేశారు. దర్శకుడు సుజిత్, తమిళ నటుడు శింబుతో కలిసి ఉన్న ఫొటోను ట్వీట్ చేశారు. ఈ సినిమాలో శింబు ఓ పాట పాడిన సంగతి తెలిసిందే. దీంతో తొలి సాంగ్‌ను విడుదల చేస్తారని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెల్లడైనట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు 4,500 ఫోన్లు ట్యాప్ చేసినట్లు సమాచారం. CM రేవంత్‌తోపాటు సోదరులరుల ఫోన్లూ ట్యాప్ చేసినట్ల తెలుస్తోంది. ఇందులో 80 శాతం ఎయిర్‌టెల్ కస్టమర్లే ఉన్నట్లు సమాచారం. మాజీ OSD ప్రభాకర్ రావు, మీడియా ఛానల్ అధినేత శ్రవణ్ రావులను US నుంచి తీసుకొచ్చేందుకు పోలీసులు CBI అనుమతి పొందారు. దీంతో CBI ఇంటర్‌పోల్‌కు లేఖ రాసింది.
‘టీ’లో బిస్కెట్లు ముంచుకుని తినడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. చాయ్‌లో బిస్కెట్లు తింటే అధిక షుగర్ కంటెంట్ శరీరానికి చేరుతుంది. బిస్కెట్లను షుగర్, మైదాపిండితో తయారు చేయడంతో చక్కెర స్థాయులు పెరుగుతాయి. శరీరంలో వాపు, హార్మోన్ల అసమతుల్యత, ఇన్సులిన్ నిరోధకత, బరువు పెరగడం వంటి సమస్యలు తలెత్తుతాయి. గుండె సంబంధిత సమస్యలూ వచ్చే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. హెర్బల్ టీ తాగడం ఉత్తమం.
మెగాస్టార్ చిరంజీవికి గిన్నిస్ బుక్ రికార్డ్స్‌లో చోటు దక్కడం గర్వించదగ్గ విషయమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు అభినందనలు తెలియజేశారు. మరో వైపు చిరంజీవికి కంగ్రాట్స్ చెబుతూ మెగా అభిమానులు పోస్టులు చేస్తున్నారు. ఏ రికార్డు అయినా మెగాస్టార్‌కు దాసోహం అనాల్సిందేనని కామెంట్లు చేస్తున్నారు.
టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో ఘనత సాధించారు. అత్యధిక విజయాల్లో పాలు పంచుకున్న నాలుగో క్రికెటర్‌గా నిలిచారు. ఇప్పటివరకు ఆయన 484 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 308 గెలుపుల్లో భాగమయ్యారు. ఈ క్రమంలో ఆయన సచిన్ టెండూల్కర్(307 విజయాలు)ను అధిగమించారు. అగ్ర స్థానంలో రికీ పాంటింగ్(377 విజయాలు)ఉన్నారు. ఆ తర్వాత మహేల జయవర్ధనే(336), విరాట్ కోహ్లీ(322) నిలిచారు.
Sorry, no posts matched your criteria.