News September 22, 2024

ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు?

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెల్లడైనట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు 4,500 ఫోన్లు ట్యాప్ చేసినట్లు సమాచారం. CM రేవంత్‌తోపాటు సోదరులరుల ఫోన్లూ ట్యాప్ చేసినట్ల తెలుస్తోంది. ఇందులో 80 శాతం ఎయిర్‌టెల్ కస్టమర్లే ఉన్నట్లు సమాచారం. మాజీ OSD ప్రభాకర్ రావు, మీడియా ఛానల్ అధినేత శ్రవణ్ రావులను US నుంచి తీసుకొచ్చేందుకు పోలీసులు CBI అనుమతి పొందారు. దీంతో CBI ఇంటర్‌పోల్‌కు లేఖ రాసింది.

Similar News

News October 10, 2024

పవన్ కళ్యాణ్‌కు మరోసారి అస్వస్థత

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు. ఈ కారణంగానే ఇవాళ క్యాబినెట్ సమావేశానికి ఆయన హాజరుకాలేదు. ఇటీవల తిరుమలకు కాలినడకన వెళ్లిన ఆయన అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. జ్వరంతో బాధపడుతూనే వారాహి సభలో పాల్గొన్నారు.

News October 10, 2024

టెన్నిస్‌కు రఫెల్ నాదల్ గుడ్ బై

image

స్పెయిన్ దిగ్గజ ఆటగాడు రఫెల్ నాదల్ టెన్నిస్‌కు వీడ్కోలు పలికారు. వచ్చే నెలలో జరిగే డేవిస్ కప్ తనకు చివరి సిరీస్ అని ఆయన ప్రకటించారు. కాగా 38 ఏళ్ల నాదల్‌ను ‘కింగ్ ఆఫ్ క్లే’గా పిలుస్తారు. ఆయన ఇప్పటివరకు 22 గ్రాండ్ స్లామ్, 14 ఫ్రెంచ్ ఓపెన్, 4 యూఎస్ ఓపెన్, 2 వింబుల్డన్ టైటిళ్లు నెగ్గారు. దాదాపు ఐదేళ్లు వరల్డ్ నంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్‌గా కొనసాగారు. ఫెడరర్‌పై 40, జకోవిచ్‌పై 60 మ్యాచులు గెలిచారు.

News October 10, 2024

జ‌మ్మూక‌శ్మీర్‌లో అప్పుడే మాట‌ల యుద్ధం

image

అసెంబ్లీ ఎన్నిక‌లు ముగిసిన 2 రోజుల‌కే జ‌మ్మూక‌శ్మీర్‌లో NC, BJP మ‌ధ్య మాట‌ల యుద్ధం మొద‌లైంది. JKకు రాష్ట్ర హోదాపైనే అసెంబ్లీలో తొలి తీర్మానం చేస్తామ‌ని, అదే తమ టాప్ ప్రయారిటీ అని కాబోయే CM ఒమ‌ర్ అబ్దుల్లా స్ప‌ష్టం చేశారు. అయితే, ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు స‌హా NC విధానాల‌ను జ‌మ్మూ ప్ర‌జ‌లు వ్య‌తిరేకిస్తున్నారని, అందుకే ఆ పార్టీ ఈ ప్రాంతంలో ఒక్క సీటూ గెలవలేదని బీజేపీ నేత రామ్ మాధ‌వ్ దుయ్యబట్టారు.