India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
‘ది జంగిల్ బుక్’లోని ప్రధాన పాత్ర మోగ్లీకి ‘దినా సానిచార్’ అనే వ్యక్తే ఆదర్శం. 1867లో UP బులంద్‌షహర్ అడవుల్లోని గుహ వద్ద వేటగాళ్లకు తోడేళ్లతో కలిసి పెరుగుతున్న అతడు(6) కనిపించాడు. అనాథాశ్రమానికి తీసుకెళ్లి మాటలు నేర్పించే ప్రయత్నం చేశారు. పచ్చి మాంసం తినడానికి ఇష్టపడేవాడు. కాళ్లపై నిలబడలేకపోయేవాడు. తోడేళ్ల మాదిరి అరిచేవాడు. దంతాలను పదును పెట్టేందుకు ఎముకలు కొరికేవాడు. 1895లో క్షయతో చనిపోయాడు.
టీ20 వరల్డ్ కప్‌లో టీం ఇండియా ఆఖరి లీగ్ మ్యాచ్ ఒక్క బంతీ పడకుండానే రద్దైంది. మ్యాచ్‌కు ముందు వర్షం పడగా.. ఔట్ ఫీల్డ్ చిత్తడిగా ఉండటంతో టాస్ కూడా వేయలేకపోయారు. రెండు సార్లు పిచ్‌ను పరిశీలించిన అంపైర్లు చివరకు మ్యాచ్‌ను రద్దు చేశారు. ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. గ్రూప్-ఏ నుంచి ఇండియాతో పాటు యూఎస్ఏ కూడా సూపర్-8కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల(EVM)ను రద్దు చేయాలని టెస్లా అధినేత, బిలియనీర్ ఎలాన్ మస్క్ అన్నారు. AI లేదా మానవులు వాటిని హ్యాక్ చేసే ప్రమాదం ఎక్కువగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈవీఎం ద్వారా ప్యూర్టోరికో దేశంలో జరిగిన ఎన్నికల్లో భారీగా అవకతవకలు జరిగాయంటూ వచ్చిన వార్తలపై మస్క్ ఈ విధంగా స్పందించారు. కాగా మనదేశంలోనూ పలు రాజకీయ పార్టీలు EVMలపై అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
టీ20 వరల్డ్ కప్ తిరిగి మరో రెండేళ్లలో జరగనుంది. ఆతిథ్య దేశాలైన భారత్, శ్రీలంక ఆటోమేటిక్‌గా క్వాలిఫై అవుతాయి. ఇక ఈ ఏడాది టోర్నీలో సూపర్ 8కు చేరుకున్న జట్లన్నింటికీ 2026 వరల్డ్ కప్ అర్హత లభిస్తుంది. లీగ్ దశలోనే నిష్క్రమించిన పాక్, న్యూజిలాండ్ వంటి జట్ల క్వాలిఫికేషన్ మాత్రం వాటి ర్యాంకులపై ఆధారపడి ఉంటుంది. నేరుగా అర్హత సాధించని జట్లు క్వాలిఫయర్ మ్యాచులు ఆడాల్సి ఉంటుంది.
AP: ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే ఐదు రోజులు పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రేపు అల్లూరి సీతారామరాజు, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, శ్రీ సత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
ప్రభుత్వ ఉపాధ్యాయుల నియామకాల్లో రాజస్థాన్ ప్రభుత్వం మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించింది. ఈ మేరకు చేసిన చట్ట సవరణకు సీఎం భజన్ లాల్ శర్మ ఆమోదం తెలిపారు. మహిళలకు కొత్త అవకాశాలు, ఉపాధిని సృష్టించడంలో ఈ నిర్ణయం తోడ్పడుతుందని సీఎం అన్నారు. కాగా ఇప్పటివరకు ఈ రిజర్వేషన్ 30 శాతంగా ఉంది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 27 వేల థర్డ్ గ్రేడ్ ఉపాధ్యాయుల పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నారు.
STSS <<13447403>>బ్యాక్టీరియా<<>> సోకినవారిలో హై ఫీవర్, BP పడిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. గొంతు నొప్పి, వాంతులు, విరేచనాలు, కండరాల నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. ‘కొందరు పేషెంట్లలో ఉదయం వేళల్లో పాదానికి వాపు కనిపిస్తుంది. మధ్యాహ్నానికి అది మోకాలికి చేరుతుంది. తర్వాతి 48 గంటల్లోనే మరణించిన సందర్భాలున్నాయి’ అని టోక్యో ఉమెన్స్ వర్సిటీకి చెందిన ఓ ప్రొఫెసర్ వివరించారు.
AP: అమరావతిని అత్యున్నతంగా తీర్చిదిద్దుతామని మంత్రి నారాయణ అన్నారు. అమరావతిలో అనేక భవనాలు వివిధ దశల్లో నిలిచాయని.. పక్కా ప్రణాళికతో రెండున్నరేళ్లలో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. అమరావతి డెవలప్‌మెంట్ బాధ్యతను తనపై ఉంచారని, చంద్రబాబు నమ్మకాన్ని నిలబెట్టేలా అహర్నిశలు శ్రమిస్తానని చెప్పారు. మున్సిపాలిటీల అభివృద్ధి, టిడ్కో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయడంపై దృష్టి సారిస్తామన్నారు.
శరీరంలోని మాంసాన్ని తింటూ 48గంటల్లోనే మనిషిని చంపగలిగే స్ట్రెప్టోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్(STSS) బ్యాక్టీరియా జపాన్‌లో కలకలం రేపుతోంది. ఈనెల 2 నాటికి 977 మందికి సోకగా, ఏడాది చివరికి 2500మందికి వ్యాపించొచ్చని అధికారులు తెలిపారు. మనిషి శరీరంలోనే జీవించే ఈ బ్యాక్టీరియా చర్మవ్యాధులు, గాయాలు, శస్త్రచికిత్సలు జరిగినప్పుడు రక్తనాళాల్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. పరిశుభ్రతతో దీన్ని అడ్డుకోవచ్చు.
నీట్ పేపర్ లీకేజీ ఆరోపణలపై ఆందోళనలు ఉద్ధృతమవుతున్నాయి. ఈనెల 19,20న దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్(AISA) పిలుపునిచ్చింది. పరీక్షను తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేసింది. నీట్ ఫలితాల్లో 67మంది ఫస్ట్ ర్యాంక్ సాధించగా ఇందులో హరియాణాలోని ఓ కోచింగ్ సెంటర్‌కు చెందిన విద్యార్థులే అధికంగా ఉన్నారు. దీంతో పేపర్ లీకైందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.
Sorry, no posts matched your criteria.