India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

చలికాలంలో బాడీ వెచ్చదనానికి ఎనర్జీ అవసరం. ఖర్జూరలోని గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సూక్రోజ్ వంటి నేచురల్ షుగర్స్ ఇందుకు సాయపడతాయి. ఫైబర్ ఆకలిని తగ్గించి జీర్ణక్రియకు తోడ్పడుతుంది. శీతాకాలం జబ్బులకు నెలవు. డేట్స్‌లోని ఫ్లేవనాయిడ్స్, కెరటనాయిడ్స్, ఫెనోలిక్ యాసిడ్ దేహంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించి ఇమ్యూనిటీని పెంచుతాయి. కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం కీళ్లలో స్టిఫ్‌నెస్, డిస్‌కంఫర్ట్‌ను తగ్గిస్తాయి.

TG: కవులు, కళాకారులు ఉద్యమాల గురించి వాస్తవాలను సమాజం ముందు ఆవిష్కరించాలని సీఎం రేవంత్ అన్నారు. వాస్తవాలను రాయకపోతే అసలైన పోరాట యోధులు, అమరుల గురించి భవిష్యత్తు తరాలకు అసంపూర్తి సమాచారమే అందుబాటులో ఉంటుందని వ్యాఖ్యానించారు. HYD బుక్ ఫెయిర్ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. ఉద్యమాల్లో అమరులైన వారికంటే రాజకీయంగా ప్రయోజనం పొందిన వారి గురించే ఎక్కువ చర్చ జరుగుతోందన్నారు.

TG: లగచర్లలో అధికారులపై దాడి కేసులో అరెస్టైన రైతులు సంగారెడ్డి జైలు నుంచి విడుదల అయ్యారు. వీరికి గిరిజన సంఘాలు స్వాగతం పలికాయి. రైతులకు 2 రోజుల క్రితం నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేయగా గురువారమే రిలీజ్ కావాల్సింది. సాయంత్రం 6 గంటలలోగా బెయిల్‌కు సంబంధించిన పత్రాలు సిద్ధం కాకపోవడంతో ఈ ఉదయం విడుదల చేశారు.

AP: రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతులకు డబ్బులు జమ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే కొంత మంది రైతులకు 6, 7 గంటల్లోనే నగదును జమ చేస్తున్నట్లు తెలుస్తోంది. ధాన్యం మిల్లుల్లో దిగుమతి చేయగానే అక్కడికక్కడే చెల్లింపులు చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. మీకు ధాన్యం అమ్మిన ఎన్ని గంటలకు డబ్బులు జమ అవుతున్నాయో కామెంట్ చేయండి.

మంత్రగత్తెల పేరిట మహిళలపై దాడులు జరగడం రాజ్యాంగ స్ఫూర్తికి మచ్చ అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. మంత్రగత్తెల నెపంతో ఇద్దరు మహిళలపై ఓ వ్యక్తి దాడి చేసిన కేసులో బిహార్ హైకోర్టు స్టే ఇచ్చింది. ఆ స్టేను అత్యున్నత ధర్మాసనం కొట్టివేసింది. మహిళల ప్రాథమిక హక్కులు, గౌరవానికి దాడులతో భంగం వాటిల్లుతోందని, వృద్ధ, వితంతు మహిళలపై దాడులు చేసేందుకు నెపాన్ని వాడుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.

AP: తిరుమలలో భక్తుల రద్దీ రెండ్రోజులుగా పెరుగుతూనే ఉంది. నిన్నటి మాదిరే ఇవాళ కూడా టోకెన్లు లేని వారికి శ్రీవారి దర్శనం కోసం 15 గంటల సమయం పడుతోంది. వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి 29 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారిని నిన్న 58,165 మంది దర్శించుకోగా, 20,377 మంది తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.60కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది.

క్రిప్టో మార్కెట్లు గత 24 గంటల్లో భారీగా పతనమయ్యాయి. మార్కెట్ విలువ 4.23% తగ్గి $3.33Tకు చేరుకుంది. బిట్‌కాయిన్ డామినెన్స్ స్వల్పంగా పెరిగినా రేటు $2742 తగ్గింది. చివరి 3 సెషన్లలోనే BTC $10500 (₹9L) మేర పతనమైంది. ప్రస్తుతం $96037 వద్ద కొనసాగుతోంది. ఎథీరియమ్ ఏకంగా 6.50% తగ్గి $3380 వద్ద ట్రేడవుతోంది. BNP 2.97, SOL 4.72, DOGE 11.42, ADA 6.52, AVAX 6.37, LINK 5.92, SHIB 8.18% మేర నష్టపోయాయి.

AP: అల్పపీడన ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం, మన్యం, అనకాపల్లి, అన్నమయ్య జిల్లాలు సహా పలుచోట్ల రాత్రి నుంచి వర్షం పడుతోంది. దీంతో ఇవాళ స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఇవ్వాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. వర్షంలో స్కూలు, కాలేజీలకు వెళ్లేందుకు ఇబ్బంది అవుతుందని, ముందే సెలవు ప్రకటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

భారత స్టార్ ఆటగాడు అశ్విన్ ఇలా ఆటను వదిలేయడం తనను షాక్‌కు గురిచేసిందని మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అన్నారు. కొన్ని రోజులు ఆగి సొంత గడ్డపై రిటైర్మెంట్ ప్రకటించాల్సిందన్నారు. అతనిలో ఆవేదన, బాధ కనిపించాయని.. తన వైపు కథేంటో వినాలని ఉందని చెప్పారు. బ్యాటర్లకు ఎక్కువగా ప్రశంసలు దక్కే ఆటలో అశ్విన్ సత్తా చాటి 100కు పైగా టెస్టులు ఆడారన్నారు. BCCI అతనికి ఘనమైన వీడ్కోలు పలకాలని కపిల్ దేవ్ అన్నారు.

స్టాక్‌మార్కెట్లు నేడూ లాభపడే సూచనలు కనిపించడం లేదు. నిన్న US, EU సూచీలన్నీ భారీ నష్టాల్లో ముగిశాయి. మరోవైపు రూపాయి ఆల్‌టైమ్ కనిష్ఠమైన 85.08కు చేరుకుంది. FIIల అమ్మకాలు కొనసాగుతున్నాయి. నేడు ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందుతున్నాయి. నిక్కీ పెరిగినా గిఫ్ట్ నిఫ్టీ 67 పాయింట్లు తగ్గిపోవడం అశుభసూచకం. ఓవర్ సోల్డ్ పరిస్థితుల్లో సూచీల్లో స్వల్ప పుల్‌బ్యాక్‌కు ఆస్కారం ఉందంటున్నారు నిపుణులు.
Sorry, no posts matched your criteria.