India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

US FED హాకిష్ కామెంట్స్‌తో దేశీయ స్టాక్‌మార్కెట్లు కుదేలవుతున్నాయి. 4 సెషన్లలోనే నిఫ్టీ 913Pts మేర పతనమవ్వడంతో ఇన్వెస్టర్లు ఏకంగా రూ.10.5L కోట్లను నష్టపోయారు. నిన్న 25BPS మేర వడ్డీరేట్లను తగ్గించిన ఫెడ్ 2025లో కత్తిరింపు ఎక్కువగా ఉండదని సంకేతాలు పంపింది. దీంతో FIIలు షేర్లను తెగనమ్మి డబ్బు వెనక్కి తీసుకుంటుండటంతో రూపాయి వీక్ అవుతోంది. మరికొన్ని రోజులు సూచీలది ఇదే వైఖరని మార్కెట్ వర్గాల అంచనా.

రామ్‌చరణ్ అద్భుతమైన నటుడని ‘గేమ్‌ఛేంజర్’ డైరెక్టర్ శంకర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘లోపల ఏదో శక్తిని కంట్రోల్ చేసి పెట్టుకున్నారేమో.. టైమ్ వచ్చినప్పుడు ఆ శక్తి పేలుతుందేమో అన్నట్టుగా చరణ్ కనిపిస్తుంటారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతం. చాలా లోతైన నటనను, హావభావాల్ని పలికించగలిగే నటుడు’ అని తెలిపారు. రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా, దిల్ రాజు నిర్మించిన గేమ్ ఛేంజర్ వచ్చే నెల 10న విడుదల కానుంది.

AP: ఈ నెల 20న రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, సత్యసాయి, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

TG: ఏసీబీ కేసు నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ రాత్రి 8 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహిస్తారు. ఈ సమావేశంలో ఆయన పలు విషయాలపై మాట్లాడే అవకాశం ఉంది. కాగా ఈ ఫార్ములా రేస్ అంశంలో కేటీఆర్‌పై ACB కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇందులో ఆయనను ఏ-1గా చేర్చింది.

అసభ్య, అశ్లీల కంటెంట్‌ను ప్రమోట్ చేస్తున్న 18 OTTలను బ్లాక్ చేసినట్టు కేంద్రం పార్లమెంటుకు తెలిపింది. SSUBT MP అనిల్ దేశాయ్ అడిగిన ప్రశ్నకు IT సహాయ మంత్రి L మురుగన్ లోక్‌సభలో జవాబిచ్చారు. 2024, మార్చి 14న 18 OTTలను బ్లాక్ చేసినట్టు చెప్పారు. ఈ అంశంలో అవి IT నిబంధనలను ఉల్లంఘించడాన్ని గమనించినట్టు తెలిపారు. డిజిటల్ న్యూస్ పబ్లిషర్లూ వాటిని పాటించాల్సి ఉంటుందన్నారు.

క్రిస్మస్ దగ్గర పడుతుండటంతో శాంటాక్లాస్ అందించే గిఫ్టుల గురించి నెట్టింట చర్చ మొదలైంది. ముఖ్యంగా ఆఫీసుల్లో సీక్రెట్ శాంటా గిఫ్టులు ఏం ఇస్తారనే దాని గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే, మెచ్యూరిటీగా ఆలోచిస్తే నిజమైన శాంటా తండ్రేనంటూ ఓ నెటిజన్ చేసిన పోస్ట్ వైరలవుతోంది. ‘నాన్నే మీ శాంటా అని గుర్తించండి. ఎందుకంటే ఆయన తన ఆనందాన్ని, జీవితాన్ని త్యాగం చేసి మీ కోరికలను నెరవేరుస్తాడు’ అని రాసుకొచ్చారు.

AP: ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలపై CM చంద్రబాబు మంత్రులతో చర్చించారు. మనం మంచి ఉద్దేశంతో మాట్లాడినా దానిని చెడుగా చిత్రీకరించేందుకు కొందరు ఎదురు చూస్తుంటారని సీఎం అన్నారు. ‘గతంలో నేను వ్యవసాయం దండగ అని అనలేదు. కానీ అన్నట్లు కొందరు ప్రచారం చేశారు. ఇప్పుడు అమిత్ షాపై కూడా ఇదే ప్రచారం జరుగుతోంది. అసలు అంబేడ్కర్ ఓడిపోయింది కాంగ్రెస్ హయాంలోనే. ఆ పార్టీ హయాంలోనే ఆయనకు గౌరవం దక్కలేదు’ అని పేర్కొన్నారు.

రిటైరయ్యాక విరాట్ కోహ్లీ లండన్‌లో స్థిరపడతారని ఆయన చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ తెలిపారు. ‘కుటుంబంతో కలిసి విరాట్ తన విశ్రాంత జీవనాన్ని UKలో గడుపుతారు. అందుకోసం ఆయన ఇప్పటికే అక్కడ ఇల్లు కొనుక్కున్నారు. త్వరలోనే పూర్తిగా లండన్ షిఫ్ట్ అవుతారు’ అని వెల్లడించారు. కాగా.. ఇటీవలి కాలంలో కోహ్లీ విరామం దొరికినప్పుడు లండన్‌లోనే సమయం గడుపుతున్న సంగతి తెలిసిందే. వారి కుమారుడు అకాయ్ లండన్‌లోనే జన్మించాడు.

జమ్మూకశ్మీర్లోని రాజౌరీ జిల్లాలో గుర్తుతెలియని వింత వ్యాధి భయపెడుతోంది. ఈ మిస్టీరియస్ రోగంతో ఒకే గ్రామంలో 2 కుటుంబాల్లో 8 మంది మరణించడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఏంటో తెలియదు? ఎలా వస్తుందో తెలియదు? ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నా రోగులు చనిపోతుండటం, ఒకర్నుంచి మరొకరికి సోకుతుండటం కలవరపెడుతోంది. దీంతో ప్రభుత్వం హుటాహుటిన BSL-3 మొబైల్ లేబోరేటరీని అక్కడికి పంపించి పరిశోధనలు చేయిస్తోంది.

AP: జనవరిలో రాజధాని అమరావతి పనులు ప్రారంభమవుతాయని మంత్రి నారాయణ తెలిపారు. ఈ పనులకు ఈ నెల 22 నుంచి టెండర్లు పిలుస్తున్నామని చెప్పారు. ‘హడ్కో రుణంతో చేపట్టే పనులు సంక్రాంతికి మొదలవుతాయి. అలాగే వరల్డ్ బ్యాంక్ నిధులతో చేసే పనులు ఫిబ్రవరిలో ప్రారంభమవుతాయి’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Sorry, no posts matched your criteria.