India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక్కరే ఉండనున్నారు. పవన్ గౌరవం తగ్గించకూడదనే ఉద్దేశంతో మరెవరికీ ఈ పదవిని చంద్రబాబు కేటాయించలేదు. జగన్ ప్రభుత్వంలో ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉండగా, ఈ సారి పవన్ కళ్యాణ్ ఒక్కరే ఉన్నారు. డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు జనసేనానికి దక్కాయి.
ఐపీఓకు అనుమతి కోరుతూ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ నేడు సెబీకి డ్రాఫ్ట్ ఫైల్ చేసింది. ఈ ఐపీఓతో రూ.7వేల కోట్లు సమీకరించాలని సంస్థ భావిస్తోంది. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ రూ.4వేల కోట్లు, మాతృ సంస్థ అయిన బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ రూ.3వేల కోట్ల షేర్లు విక్రయించనున్నాయి. సెబీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే త్వరలోనే ఈ ఐపీఓ అందుబాటులోకి రానుంది. కాగా షేర్ కొనుగోలు ధరను సంస్థ వెల్లడించాల్సి ఉంది.
తెలంగాణ ఐసెట్ ఫలితాలు మరికాసేపట్లో విడుదల కానున్నాయి. ICET అధికారిక సైట్‌తో పాటు Way2News యాప్‌లోనూ ఫలితాలు పొందవచ్చు. మిగతా ప్లాట్‌ఫాంల తరహాలో విసిగించే యాడ్స్, లోడింగ్ సమస్యలు మన యాప్‌లో ఉండవు. ప్రత్యేక స్క్రీన్‌లో హాల్‌టికెట్ నంబర్ ఎంటర్ చేసి క్లిక్ చేస్తే మెరుపు వేగంతో ఫలితాలు వస్తాయి. ఆ తర్వాత వాట్సాప్ సహా ఏ ప్లాట్‌ఫాంకైనా రిజల్ట్‌ను ఒక్క క్లిక్‌తో సులభంగా షేర్ చేసుకోవచ్చు.
AP: తొలిసారి మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్న పయ్యావుల కేశవ్‌కు సీఎం చంద్రబాబు నాయుడు కీలకమైన ఆర్థికశాఖను కేటాయించారు. ఎంబీఏ పూర్తి చేసిన ఆయన టీడీపీ నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గత ఐదేళ్లూ ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్(పీఏసీ)గా విధులు నిర్వర్తించారు. వైసీపీ ప్రభుత్వం అవినీతి చేసిందంటూ పలు సందర్భాల్లో ఆధారాలను బయటపెట్టారు. అంతేగాక మంచి వాగ్దాటి, సబ్జెక్టుపై పట్టున్న నేతగా గుర్తింపు పొందారు.
ఐపీఓను అందుబాటులోకి తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్న హ్యుందాయ్ మోటార్స్ ఇండియా లిమిటెడ్ నేడు సెబీకి డ్రాఫ్ట్ సమర్పించనుంది. ఈ ఐపీఓతో $3 బిలియన్లు సమకూర్చుకోవాలని, సంస్థ విలువను $20 బిలియన్లకు పెంచాలని ప్లాన్ చేస్తోంది. 140 నుంచి 150 మిలియన్ షేర్లు విక్రయించనున్నట్లు తెలుస్తోంది. హ్యుందాయ్ ప్లాన్స్ సక్సెస్ అయితే ఇది దేశ స్టాక్ మార్కెట్ చరిత్రలో అతిపెద్ద ఐపీఓగా నిలవనుంది.
తమ పార్టీకి తొలిసారి ఓ మహిళను జాతీయ అధ్యక్షురాలిగా నియమించుకోవాలని బీజేపీ అధిష్ఠానం నిర్ణయించినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది. మాజీ మంత్రి స్మృతి ఇరానీని అధ్యక్షురాలిగా నియమించేందుకు అధిష్ఠానం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వసుంధర రాజే సింథియా, దగ్గుబాటి పురందీశ్వరి పేర్లను కూడా పరిశీలిస్తుందట. కాగా బీజేపీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు ఓ మహిళ అధ్యక్ష పదవి చేపట్టకపోవడం గమనార్హం.
అత్యల్ప స్థాయి ఆర్థిక లింగ సమానత్వం కలిగిన దేశాల(146) సమూహంలో భారత్ 129వ స్థానంలో ఉంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తాజాగా రిలీజ్ చేసిన గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ డేటాలో భారత పురుషులు రూ.100 సంపాదిస్తే మహిళల సంపాదన రూ.40 మాత్రమే. దక్షిణాసియాలో బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, భూటాన్ తర్వాత ఇండియా ఐదో స్థానంలో ఉండగా పాకిస్తాన్ చివరి స్థానంలో ఉంది.
AP: దేశ ప్రగతికి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ఎంతో కీలకం. పంచాయతీరాజ్ వ్యవస్థ వచ్చినప్పటి నుంచి ప్రత్యేక నిధులతో పల్లె సీమలు కొత్త రూపు సంతరించుకున్నాయి. కాగా ఈ కీలకమైన శాఖ బాధ్యతలు రాష్ట్రంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వీకరించారు. ఇటు కేంద్రంలో TDP MP పెమ్మసాని చంద్రశేఖర్ గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. వీరిద్దరి కలయికతో పల్లెల్లో ఏళ్ల నాటి సమస్యలు తీరే ఛాన్సుందని అంతా ఆశిస్తున్నారు.
AP: మంత్రి నారా లోకేశ్‌కు మానవ వనరులు, ఐటీ, RTG శాఖను కేటాయించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనూ ఆయన ఐటీ శాఖనే తీసుకుని సమర్థంగా పని చేశారు. మంగళగిరి కేంద్రంగా ఐటీ అనుబంధ సంస్థలు, యువతకు నైపుణ్య శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేశారు. HCL వంటి దిగ్గజ IT సంస్థను APకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. అలాగే చంద్రబాబు మానస పుత్రికగా భావించే రియల్ టైమ్ గవర్నెన్స్ బాధ్యతలను సైతం లోకేశ్‌కు అప్పగించారు.
TG: తిహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితతో ఆమె సోదరుడు కేటీఆర్ ములాఖత్ అయ్యారు. కవిత యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హైదరాబాద్‌కు తిరుగుపయనం అయ్యారు. లిక్కర్ స్కామ్ కేసులో కవితపై సీబీఐ, ఈడీ వేర్వేరు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. మార్చి 15న ఈడీ ఆమెను అరెస్ట్ చేయగా అప్పటి నుంచి జుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు.
Sorry, no posts matched your criteria.