News December 18, 2024

రేవంత్ డబుల్ గేమ్ ఆడుతున్నారు: హరీశ్ రావు

image

TG: సీఎం రేవంత్ రెడ్డి, అదానీ బంధం బయటపడాలని మాజీ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు. అదానీకి రెడ్ కార్పెట్ ఎందుకు వేశారని, ఆయన కంపెనీలకు భూములు ఎందుకు కట్టబెట్టారని ప్రశ్నించారు. అదానీ అంశంపై శాసనసభలో చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి డబుల్ గేమ్ ఆడుతున్నారని విమర్శించారు. ఇవాళ ఛలో రాజ్‌భవన్ ర్యాలీలో అదానీ మీద కాకుండా సీఎం BRS, కేసీఆర్, కేటీఆర్‌లపై విమర్శలు చేశారన్నారు.

News December 18, 2024

డిసెంబర్ 21న.. 16 గంటల రాత్రి!

image

డిసెంబర్ 21న వింత అనుభూతి పొందనున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూభ్రమణంలో భాగంగా సూర్యుడి చుట్టూ భూమి తిరిగే కక్ష్య దూరం పెరిగి 16గంటల సుదీర్ఘ రాత్రి, 8గంటలే సూర్యకాంతి ఉంటుందట. ఇలా సూర్యుడికి భూమి దూరంగా జరిగితే శీతాకాలపు అయనాంతం( Winter Solstice) అని, దగ్గరగా జరిగితే వేసవికాలం అయనాంతం(పగలు ఎక్కువ) అని అంటారు. ఇలా సుదీర్ఘ రాత్రి ఏర్పడే రోజు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

News December 18, 2024

BJPకి బీఆర్ఎస్ లొంగిపోయింది: రేవంత్

image

TG: అదానీకి వ్యతిరేకంగా మాట్లాడకుండా BJPకి BRS పార్టీ లొంగిపోయిందని <<14912973>>CM రేవంత్ రెడ్డి<<>> ఆరోపించారు. BRS ప్రజల వైపా? అదానీ-ప్రధాని వైపా? తేల్చి చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీ-KCR వేరు కాదని, ఇద్దరూ నాణేనికి బొమ్మ, బొరుసు అని విమర్శించారు. BRS పార్టీకి చిత్తశుద్ధి ఉంటే అదానీ అవినీతిపై JPC విచారణకు డిమాండ్ చేయాలని సవాల్ విసిరారు. దీనిపై BRS కోరితే అసెంబ్లీలో చర్చకు అనుమతిస్తామని సీఎం స్పష్టం చేశారు.

News December 18, 2024

గేమ్ ఛేంజర్ నుంచి బిగ్ అప్‌డేట్

image

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ నుంచి చిత్ర యూనిట్ ఓ అప్‌డేట్ ఇచ్చింది. ఈ సినిమాలోని తదుపరి సాంగ్ ప్రోమోను ఇవాళ సాయంత్రం 6.03 గంటలకు రిలీజ్ చేస్తామని తెలిపింది. ఫుల్ సాంగ్‌ను డిసెంబర్ 21న విడుదల చేస్తామని వెల్లడించింది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ ట్రెండ్ సృష్టిస్తుండగా, ఈ హైఓల్టేజ్ సాంగ్ కోసం మ్యూజిక్ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

News December 18, 2024

1000 కొత్త బస్సులు కొంటాం: పొన్నం

image

TG: మహాలక్ష్మి పథకంతో బస్సుల్లో రద్దీ పెరిగిందని, దీనికి అనుగుణంగా 1000 కొత్త బస్సులు కొంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మహాలక్ష్మి పథకంతో బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో 40 నుంచి 100శాతానికి పెరిగిందన్నారు. కొత్త బస్సులను డ్వాక్రా సంఘాల ద్వారా కొంటామన్నారు. అవసరమైన చోట కొత్త డిపోలు నిర్మిస్తామన్నారు. కోరుట్ల, జగిత్యాల, సిరిసిల్లకు బస్సులను పెంచుతామని MLAల ప్రశ్నలకు అసెంబ్లీలో బదులిచ్చారు.

News December 18, 2024

అదానీ, ప్రధాని మన పరువు తీస్తున్నారు: రేవంత్

image

TG: అదానీ, ప్రధాని కలిసి ప్రపంచం ముందు మన పరువు తీస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ‘అదానీ సంస్థలు లంచాలు ఇచ్చినట్లు అమెరికా దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఇది మనదేశ గౌరవానికి భంగం కలిగించడమే. అదానీపై విచారణ జరగాలి. జేపీసీలో చర్చించాలని రాహుల్ డిమాండ్ చేశారు. అయినా కేంద్రం స్పందించడం లేదు. అందుకే దేశవ్యాప్తంగా రాజ్‌భవన్‌ల ముట్టడి కార్యక్రమం చేపట్టాం’ అని తెలిపారు.

News December 18, 2024

3 నెలల్లో రూల్స్ రూపొందిస్తాం: పొంగులేటి

image

TG: భూభారతి బిల్లుపై మూడు నెలల్లోనే రూల్స్ ఫ్రేమ్ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. గత ప్రభుత్వం ధరణి తెచ్చి మూడేళ్లు దాటినా రూల్స్ ఫ్రేమ్ చేయకపోవడంతో తప్పులు జరిగాయన్నారు. రూల్స్ ఫ్రేమ్ అయ్యాక గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు పెట్టి, ప్రజాప్రతినిధులతో కలిసి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఆనాటి ధరణిలో 33 ఆప్షన్స్ ఉంటే, ఇప్పుడు వాటిని 6 మాడ్యూళ్లకు కుదిస్తున్నట్లు చెప్పారు.

News December 18, 2024

H1B దరఖాస్తుదారులకు గుడ్ న్యూస్

image

H1B వీసాలను సరళీకరిస్తూ అగ్రరాజ్యం కొత్త నిబంధనలు ప్రకటించింది. దీంతో అమెరికా కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకోవడం ఈజీ కానుంది. అటు, ఎఫ్-1 విద్యార్థి వీసాలను H1Bగా మార్చుకునేందుకు వెసులుబాటు కల్పించింది. దీంతో పాటు కొన్ని సంస్థల్లో నియామకాలకు H1B వార్షిక పరిమితి నుంచి మినహాయింపు ఇస్తూ బైడెన్ ప్రభుత్వం నిర్ణయించింది. H1B వీసా ఉండి పౌరసత్వం కోసం చేసుకున్న దరఖాస్తులకు వేగంగా పరిష్కారం దొరకనుంది.

News December 18, 2024

జైలుకెళ్తే ట్రెండ్ అవుతానని కేటీఆర్ అనుకుంటున్నారు: కాంగ్రెస్ ఎంపీ

image

TG: మాజీ మంత్రి కేటీఆర్ జైలుకెళ్లేందుకు ఆసక్తిగా ఉన్నారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ ఎద్దేవా చేశారు. జైలుకు వెళ్తే ట్రెండ్ అవుతానని ఆయన అనుకుంటున్నారని విమర్శించారు. అందుకే తనను ఎప్పుడు అరెస్ట్ చేస్తారని కేటీఆర్ అడుగుతున్నారని చామల అన్నారు. కాగా ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో చామల కామెంట్స్ ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

News December 18, 2024

ASHWIN RETIRES: క్రికెట్లో నిత్య విద్యార్థి

image

అశ్విన్‌ క్రికెట్లో నిత్య విద్యార్థి. ఎప్పుడూ కొత్త టెక్నిక్స్ నేర్చుకుంటూనే ఉండేవారు. రిస్ట్ స్పిన్నర్ల నుంచి పోటీ ఎదురై జట్టులో చోటు కష్టమైనప్పుడు అతడి రీఎంట్రీ ఘనంగా ఉండేది. క్యారమ్ బాల్ అలా వచ్చిందే. దేశవాళీలో చేతివేళ్లను మారుస్తూ కొత్త బంతులు ట్రై చేసేవారు. టాప్ స్పిన్, దూస్రా, ఫ్లిప్పర్, గూగ్లీ, స్లోబాల్, ఆర్మ్ బాల్‌ను సమర్థంగా వాడేవారు. అతడి నిలకడకు బ్యాటర్లు దాసోహం అనేవారు.