News June 13, 2024

నా ప్రాణం చంద్రబాబు: భువనేశ్వరి

image

AP: సీఎం చంద్రబాబుపై ఆయన సతీమణి నారా భువనేశ్వరి భావోద్వేగ ట్వీట్ చేశారు. ‘సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తున్న నాలో సగం.. నా ప్రాణం నారా చంద్రబాబు నాయుడు గారు’ అంటూ Xలో పోస్ట్ పెట్టారు. కాగా చంద్రబాబు జైలుకెళ్లిన సమయంలో తీవ్ర మనోవేదనకు గురైన భువనేశ్వరి తొలిసారి ప్రజల్లోకి వచ్చి భర్త మళ్లీ సీఎం కావాలన్న లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు. ఆ కోరిక నెరవేరిన వేళ ఆమె భావోద్వేగం చెందారు.

News June 13, 2024

రాష్ట్రవ్యాప్తంగా మహిళా శక్తి క్యాంటీన్లు: CS

image

CM రేవంత్ ఆదేశాలతో తెలంగాణ వ్యాప్తంగా వచ్చే రెండేళ్లలో 150 మహిళా శక్తి క్యాంటీన్లు నెలకొల్పనున్నట్లు CS శాంతికుమారి తెలిపారు. వీటి బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగిస్తామన్నారు. కలెక్టరేట్లు, దేవాలయాలు, బస్టాండ్లు, పారిశ్రామిక, పర్యాటక, ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే బెంగాల్‌, కేరళలోని క్యాంటీన్లను అధ్యయనం చేసినట్లు చెప్పారు. నిర్వహణపై మహిళలకు శిక్షణ ఇస్తామని వివరించారు.

News June 13, 2024

దీక్ష విరమించిన మనోజ్ పాటిల్

image

మరాఠా రిజర్వేషన్ల ఉద్యమకారుడు మనోజ్ జరంగే పాటిల్ నిరాహార దీక్ష విరమించారు. మంత్రులతో చర్చల అనంతరం తమ డిమాండ్ల అమలుకు ప్రభుత్వానికి నెల రోజుల డెడ్‌లైన్ విధిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. డిమాండ్లు ఆమోదించకుంటే అసెంబ్లీకి పోటీ చేస్తామని హెచ్చరించారు. ఆయన కుంబీ కమ్యూనిటీని మరాఠాలకు రక్త సంబంధీకులుగా గుర్తించి, చట్టం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వారికి సర్టిఫికెట్ ఇవ్వాలంటూ జూన్ 8న దీక్షకు దిగారు.

News June 13, 2024

వాలంటీర్ వ్యవస్థ రద్దు కాలేదు: మంత్రి నిమ్మల

image

AP: గత ప్రభుత్వం ప్రారంభించిన వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయలేదని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వాలంటీర్లు ప్రభుత్వం నుంచి గౌరవం వేతనం పొందుతున్నట్లు చెప్పారు. త్వరలోనే ఈ వ్యవస్థపై సమీక్ష నిర్వహించి, వారిని ప్రజాసేవ కోసం వినియోగించుకుంటామని వెల్లడించారు. ఇంటి వద్దే పింఛన్ అందించే ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొన్నారు. అటు మెగా డీఎస్సీపై తాము ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని మంత్రి గుర్తు చేశారు.

News June 13, 2024

మెగా డీఎస్సీ అంటూ మెగా మోసం: వైసీపీ

image

AP: మెగా డీఎస్సీ అంటూ తెలుగుదేశం పార్టీ మెగా మోసానికి పాల్పడుతోందని వైసీపీ మండిపడింది. ‘25 వేల పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని ఎన్నికల ప్రచారంలో గొప్పలు చెప్పారు. తొలి సంతకంతో 16,347 పోస్టులకు మెగా డీఎస్సీ అంటూ డ్రామాలు ఆడుతున్నారు. అందులో 6,100 పోస్టులు వైఎస్ జగన్ ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఇచ్చినవే’ అని వైసీపీ ట్వీట్ చేసింది.

News June 13, 2024

రెండో రోజే ఐదు ప్రధాన హామీల అమలు: మంత్రి సత్యకుమార్ యాదవ్

image

AP: ఎన్డీయే కూటమి కొలువుదీరిన రెండో రోజే 5 ప్రధాన హామీలను అమలు చేసిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ‘యువత మెగా డీఎస్సీ కల సాకారమైంది. 16,347 పోస్టుల భర్తీకి సీఎం చంద్రబాబు తొలి సంతకం చేశారు. ల్యాండ్​ టైటిలింగ్ యాక్ట్​ రద్దు, పెన్షన్ రూ.4 వేలకు పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణనపై సంతకాలు పెట్టారు. ఇచ్చిన హామీల అమలుకు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది’ అని ట్వీట్ చేశారు.

News June 13, 2024

18న కేబినెట్ భేటీ!

image

AP: సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు ఈనెల 18న కేబినెట్ భేటీ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. తర్వాతి రోజు 19న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దీంతో ఎమ్మెల్యేల ప్రమాణం, స్పీకర్ ఎన్నిక, బడ్జెట్ ఆమోదంతో పాటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు ఆమోదం తదితర అంశాలపై చర్చించేందుకు కేబినెట్ భేటీ కానున్నట్లు సమాచారం. ఈలోపే మంత్రులకు సీఎం శాఖలను కేటాయించనున్నారు.

News June 13, 2024

అలా చేసి ఇంగ్లండ్‌ను ఇంటికి పంపండి: టిమ్ పైన్

image

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టిమ్ పైన్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. టీ20 వరల్డ్ కప్ నుంచి ఇంగ్లండ్‌ను బయటకు పంపించేందుకు స్కాట్లాండ్‌తో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఫలితాలను తప్పకుండా తారుమారు చేయాలంటూ సూచించారు. తాను జోక్ చేయట్లేదని సీరియస్‌గానే ఈ కామెంట్స్ చేస్తున్నట్లు కుండబద్దలు కొట్టారు. తాను చెప్పినట్లు చేస్తే టోర్నీ నుంచి ఇంగ్లండ్ నిష్క్రమించి టైటిల్ గెలవడం ఆసీస్‌కు సులభమవుతుందని పైన్ చెప్పుకొచ్చారు.

News June 13, 2024

ఎంపీటీసీ పదవికి రాజీనామా చేసిన TDP ఎంపీ

image

AP: కర్నూలు టీడీపీ ఎంపీ బస్తిపాటి నాగరాజు ఎంపీటీసీ పదవికి రాజీనామా చేశారు. జడ్పీ సీఈవో నర్సారెడ్డికి తన రాజీనామా లేఖను అందించారు. నాగరాజు 2021లో కర్నూలు జిల్లా పంచలింగాల నుంచి టీడీపీ ఎంపీటీసీగా గెలిచారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆయనకు చంద్రబాబు కర్నూలు ఎంపీ టికెట్ ఇచ్చారు. ఆయన వైసీపీ అభ్యర్థి రామయ్యపై లక్షకుపైగా మెజార్టీతో గెలుపొందారు. దీంతో తన ఎంపీటీసీ పదవికి నాగరాజు రాజీనామా చేశారు.

News June 13, 2024

అంబుజా చేతికి పెన్నా సిమెంట్

image

పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ను రూ.10,422 కోట్లకు కొనుగోలు చేసినట్లు అదానీ గ్రూప్స్‌‌కు చెందిన అంబుజా సిమెంట్ ప్రకటించింది. పెన్నా అధినేత పి.ప్రతాప్ రెడ్డితో పాటు ఆయన కుటుంబం పేరిట ఉన్న 100% షేర్లను బదిలీ చేసుకుంటామని తెలిపింది. పెన్నాకు 14 మిలియన్ టన్నుల సామర్థ్యం ఉండగా ప్రస్తుతం 10 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరుగుతోంది. కృష్ణపట్నం, జోధ్‌పుర్‌లో మరో 2 యూనిట్లు సిద్ధమవుతున్నాయి.