News September 20, 2024

ప్చ్.. భారతీయ ఉద్యోగి! టూ మచ్ వర్కింగ్ అవర్స్..

image

ఉద్యోగులు కుటుంబ జీవితానికి ఎంత దూరమవుతున్నారో చెప్పేందుకు ఇదే నిదర్శనం. సగటు భారతీయుడు వారానికి 46.7Hrs పనిచేస్తున్నాడని ILO డేటా ద్వారా తెలిసింది. దీంతో సుదీర్ఘ సమయం పనిచేస్తున్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో నిలిచింది. దేశంలోని వర్క్‌ఫోర్స్‌లో 51% మంది వారానికి 49Hrs మించి పనిచేస్తుండటం గమనార్హం. 61 శాతంతో భూటాన్ No.1 ప్లేస్‌లో ఉంది. UAE 50.9, లెసొతో 50.4, బంగ్లా 47, పాక్ 40 టాప్10లో ఉన్నాయి.

News September 20, 2024

కొరియా షూటర్‌కు సినిమా అవకాశం

image

పారిస్ ఒలింపిక్స్‌లో ప్రపంచ రికార్డు సాధించిన కొరియా షూటర్ కిమ్ యెజీ వీడియో అప్పట్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. తనకొచ్చిన పేరును సద్వినియోగం చేసుకునేందుకు గాను స్వదేశానికి వెళ్లిన తర్వాత ఆమె ఓ టాలెంట్ మేనేజ్‌మెంట్ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. దీంతో ‘క్రష్’ అనే పాన్ వరల్డ్ సినిమాలో ఆమెకు పాత్ర దక్కింది. భారత్ నుంచి అనుష్క సేన్ సహా పలు దేశాల నటులు ఈ సినిమాలో నటిస్తుండటం విశేషం.

News September 20, 2024

సీబీఐతో విచారణ చేయించాలి.. CBNకు బండి లేఖ

image

తిరుమల లడ్డూ వ్యవహారంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. ‘తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీతో పాటు, అవినీతి, అన్యమత ప్రచారంపై సమగ్ర విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఉన్నత స్థాయి వ్యక్తుల ప్రమేయాన్ని నిర్ధారించడంతో పాటు, ఇతర రాష్ట్రాల్లోనూ విచారణ కొనసాగించాల్సిన అవసరం ఉన్నందున సీబీఐతో దర్యాప్తు చేయించాలి. తక్షణమే సమగ్ర విచారణకు ఆదేశించాలి’ అని లేఖలో పేర్కొన్నారు.

News September 20, 2024

రాష్ట్ర అతిథులకు జ్ఞాపికలుగా హస్త కళాకృతులు

image

AP: మన రాష్ట్ర కళాకారులు రూపొందించిన కళాకృతులు, కలంకారీ వస్త్రాలతో రాష్ట్ర అతిథులను సత్కరించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఈ మేరకు గిఫ్ట్ హ్యాంపర్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వీటి కోసం బడ్జెట్ నుంచి 40% తీసుకొని, మిగిలిన 60% తన సొంత డబ్బును పవన్ వినియోగించనున్నారు. లేపాక్షి సంస్థ కళాకృతులను పరిశీలించిన ఆయన తన కూతురు ఆద్యకు కలంకారీ బ్యాగ్, కొయ్యబొమ్మలను కొనిచ్చారు.

News September 20, 2024

తెలుగువారి మదిలో ANR చిరకాలం ఉంటారు: చిరంజీవి

image

నటుడు అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆయనకు నివాళులర్పించారు. ‘ANR భారత సినిమాలో దిగ్గజం. వారు నటించిన సినిమాలు ప్రేక్షకుల మదిలో చిరకాలం నిలిచిపోతాయి. చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలు అసామాన్యం. నాగేశ్వరరావుగారితో మెకానిక్ అల్లుడు సినిమాలో నటించే అదృష్టం నాకు దక్కింది. వారితో నాకున్న ఎన్నో అద్భుత జ్ఞాపకాలను ఎప్పటికీ మరచిపోను’ అని ట్వీట్ చేశారు.

News September 20, 2024

సచివాలయంలో క్యాబినెట్ సమావేశం

image

TG: సచివాలయంలో CM రేవంత్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం ప్రారంభమైంది. రెవెన్యూ, మున్సిపల్, నీటిపారుదల శాఖలకు ఉన్న ప్రత్యేక అధికారాలను హైడ్రాకు కల్పించడం, కొత్త రేషన్, ఆరోగ్యశ్రీ కార్డుల జారీ, వరద నష్టం, పరిహారం చెల్లింపుపై చర్చించనున్నారు. తెలుగు వర్సిటీకి సురవరం, కోఠి మహిళా వర్సిటీకి చాకలి ఐలమ్మ, హ్యాండ్లూమ్ వర్సిటీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేర్లను పెట్టడానికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

News September 20, 2024

విరాట్ కోహ్లీ అరుదైన ఘనత

image

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించారు. సొంత గడ్డపై అత్యధిక పరుగులు పూర్తి చేసుకున్న ఐదో బ్యాటర్‌గా రికార్డులకెక్కారు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆయన 12,000 పరుగుల మైలురాయి చేరుకుని ఈ ఫీట్ సాధించారు. అగ్ర స్థానంలో సచిన్ టెండూల్కర్ (14,192) ఉన్నారు. ఆ తర్వాత రికీ పాంటింగ్ (13,117), జాక్వెస్ కలిస్ (12,305), కుమార సంగక్కర (12,043) నిలిచారు.

News September 20, 2024

నిఫ్టీ 50లో 44 స్టాక్స్ బులిష్‌

image

దేశీయ స్టాక్‌ మార్కెట్‌లోబుల్ జోర్ వ‌ల్ల నిఫ్టీ-50లోని 44 స్టాక్‌లు శుక్ర‌వారం లాభాలు గ‌డించ‌డం గ‌మ‌నార్హం. అధిక వెయిటేజీ గ‌ల‌ ICICI రూ.1,362కి ఎగ‌బాకి 52 వారాల హైకి చేరింది. HDFC (1.68%) ద‌న్నుగా నిల‌వ‌డంతో దేశీయ సూచీలు గ‌రిష్ఠాల‌కు చేరుకున్నాయి. M&M, ICICI, JSW Steel, L&T, కోల్ ఇండియా టాప్ గెయిన్స్‌గా నిలిచాయి. ఆటో(1.9%), బ్యాంక్‌(1.4%), ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్‌(1.6%) వృద్ధి చెందాయి.

News September 20, 2024

CM గారూ.. మీ వ్యాఖ్యలు చాలా ప్రభావవంతం: మహీంద్రా

image

TG: యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ విషయంలో CM రేవంత్‌ను వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా కొనియాడారు. ‘ఆ సదస్సుకు హాజరుకావడం సంతోషంగా అనిపించింది. ముఖ్యంగా సీఎం రేవంత్‌ తన ఆలోచనల్ని ఆచరణలోకి పెట్టడాన్ని చూసి ఎంజాయ్ చేశాను. రేవంత్.. మీరు తక్కువే మాట్లాడినా అవి చాలా ప్రభావవంతంగా ఉన్నాయి. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం ఎలా పనిచేయాలన్నదానికి బలమైన ఉదాహరణ ఇచ్చారు మీరు’ అని పేర్కొన్నారు.

News September 20, 2024

బరువు తగ్గేందుకు ఓకేగానీ ఆ డైట్‌తో గుండె, పొట్టకు ప్రమాదం!

image

బరువు తగ్గేందుకు సాయపడే కీటోడైట్ గుండె, పొట్టకు అంత మంచిది కాదని సెల్ రిపోర్ట్స్ మెడిసిన్‌లో పబ్లిషైన కొత్తస్టడీ పేర్కొంది. దానికన్నా లోషుగర్ డైట్ బెటరంది. ‘కీటో వల్ల జీర్ణాశయంలో మంచి బ్యాక్టీరియా నాశనమవుతోంది. మైక్రోబయోమ్ వైవిధ్యం దెబ్బతింటోంది. ఎక్కువ కొవ్వు తింటే బాడీలో చెడు కొలెస్ట్రాల్ లెవల్స్ పెరుగుతాయి. గుండె జబ్బులకు కారణమయ్యే అపోలిపో ప్రొటీన్ పెరగడాన్ని మూత్రంలో గమనించాం’ అని పేర్కొంది.