News December 17, 2024

SBI భారీ జాబ్ నోటిఫికేషన్.. రిజిస్ట్రేషన్లు షురూ

image

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) 13735 క్లర్క్​ పోస్టుల భర్తీకి భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేడు ప్రారంభం కాగా, వచ్చే ఏడాది జనవరి 7న ముగుస్తుంది. ప్రిలిమ్స్ ఫిబ్రవరిలో, మెయిన్ పరీక్ష మార్చి/ ఏప్రిల్‌లో జరగనుంది. జనరల్/ OBC/ EWS కేటగిరీ అభ్యర్థులు రూ.750 ఫీజు చెల్లించాలి. మిగతా కేటగిరీలకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. పూర్తి సమాచారం కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

Similar News

News January 13, 2025

న‌చ్చ‌క‌పోతే కోహ్లీ అవ‌కాశాలు ఇవ్వ‌డు: ఉత‌ప్ప‌

image

జ‌ట్టులో ఎవ‌రైనా న‌చ్చ‌క‌పోతే విరాట్ కోహ్లీ అవ‌కాశాలు ఇచ్చేవాడు కాదని, వాళ్ల‌ను పూర్తిగా ప‌క్క‌న పెట్టేస్తాడ‌ని ఉతప్ప ఆరోపించారు. అందుకే 2019 ప్ర‌పంచ కప్‌కి అంబ‌టి రాయుడు ఎంపిక కాలేద‌ని, కోహ్లీకి అత‌నంటే ఇష్టం లేదని పేర్కొన్నారు. రాయుడికి వ‌ర‌ల్డ్ క‌ప్ జెర్సీ, కిట్‌బ్యాగ్ పంపిన త‌రువాత కూడా జ‌ట్టులోకి తీసుకోలేద‌న్నారు. ఒక‌ర్ని ఇంటికి పిలిచి మొహం మీద త‌లుపులు వేయ‌డం త‌గ‌ద‌ని ఉత‌ప్ప వ్యాఖ్యానించారు.

News January 13, 2025

‘గేమ్ ఛేంజర్’ యూనిట్‌కు బెదిరింపులు.. కేసు నమోదు

image

‘గేమ్ ఛేంజర్’ ప్రింట్ ఆన్‌లైన్‌లో లీక్ కావడం వెనుక 45 మందితో కూడిన బృందం ఉందంటూ మూవీ యూనిట్ HYD సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీళ్లే తమ చిత్రంపై సోషల్ మీడియాలో నెగటివ్ ప్రచారం చేశారని పేర్కొంది. తాము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే లీక్ చేస్తామంటూ విడుదలకు 2 రోజుల ముందే చిత్ర బృందంలోని కీలక వ్యక్తులను బెదిరించినట్లు ఆధారాలను సమర్పించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

News January 13, 2025

నారావారిపల్లెలో సీఎం బిజీబిజీ

image

AP: సంక్రాంతి వేడుకల కోసం స్వగ్రామం నారావారిపల్లెకు చేరుకున్న సీఎం చంద్రబాబు అక్కడ బిజీబిజీగా గడుపుతున్నారు. రూ.3 కోట్లతో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి, రూ.2 కోట్లతో రోడ్లు, రూ.కోటితో జడ్పీ హైస్కూల్ అభివృద్ధికి శంకుస్థాపనలు చేశారు. అంతకుముందు మహిళల ముగ్గుల పోటీలు, చిన్నారుల ఆటల పోటీలు తిలకించి, విజేతలకు బహుమతులు అందించారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.