India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: తిరుమల లడ్డూను వాడుకుని రాజకీయం చేద్దామనుకున్నCM చంద్రబాబు ప్రయత్నాలు బెడిసికొట్టాయని TTD మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తక్షణమే CM హిందూ జాతికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ‘లడ్డూలో ఎడిబుల్ ఆయిల్ వాడుతున్నట్లు TTD EO శ్యామలరావు ప్రకటించారు. ఫేక్ రిపోర్టుతో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు. దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి’ అని ఆయన డిమాండ్ చేశారు.
AP: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వైసీపీకి రాజీనామా చేశారు. పార్టీలో తనకు అన్యాయం జరిగిందని, సరైన గుర్తింపు రాలేదని సామినేని అన్నారు. తన ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడానికే రాజీనామా చేసినట్లు తెలిపారు. కాగా ఎల్లుండి ఆయన జనసేన పార్టీలో చేరనున్నారు.
AP: కూటమి ప్రభుత్వం గత 100 రోజుల్లో ప్రజలకు చేసింది ‘సున్నా’ అని వైసీపీ విమర్శించింది. ‘సూపర్-6 హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేకపోయింది. దాడులు, దౌర్జన్యాలతో కక్షసాధింపులకే పరిమితం అయింది. ఈ 100 రోజుల్లో 50 మందికి పైగా ఆడబిడ్డలపై అత్యాచారం జరిగింది. రెడ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్రం రావణకాష్ఠంగా మారింది. మంచి ప్రభుత్వమంటూ ప్రచారం తప్ప ఈ 100 రోజుల్లో ప్రజలకు ఒరిగిందేమిటి?’ అని ట్వీట్ చేసింది.
AP: టీటీడీలో నెయ్యి వివాదంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ ఘటనపై సాయంత్రంలోగా నివేదిక ఇవ్వాలని టీటీడీ ఈవోను ఆదేశించారు. తిరుమల శ్రీవారి ఆలయ ప్రతిష్ఠకు భంగం కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హెచ్చరించారు.
TG: ఉద్యోగులకు ఆమోద యోగ్యమైన EHSను త్వరలో రూపొందిస్తామని మంత్రి రాజనర్సింహ అన్నారు. 2014లో ఉద్యోగులకు, పెన్షనర్లకు, జర్నలిస్టుల కోసం హెల్త్ స్కీమ్ ప్రవేశపెడతామని ఊదరగొట్టి BRS మొండిచేయి చూపించిందని దుయ్యబట్టారు. ఇప్పుడు BRS పార్టీ నాయకులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ‘దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది’ అన్నారు. 10ఏళ్లుగా నిద్రలో జోగిన BRS నాయకులకు ఇప్పుడు EHS గుర్తుకు రావడం విడ్డూరమన్నారు.
TG: స్థానికత విషయంలో హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులు నీట్ కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు ప్రభుత్వం అంగీకరించింది. స్థానికత వ్యవహారంపై HC తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. కౌన్సెలింగ్‌కు సమయం తక్కువగా ఉండటంతో ఈ ఒక్కసారి ఆ విద్యార్థులకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు సుప్రీం కోర్టుకు వివరించింది. స్థానికతను నిర్ధారిస్తూ తీర్పులున్నా ఆ విద్యార్థులు HCని ఆశ్రయించారంది.
లేడీ కొరియోగ్రాఫర్‌పై లైంగిక దాడి కేసులో జానీ మాస్టర్‌ను పోలీసులు ఉప్పర్‌పల్లి కోర్టులో హాజరుపర్చారు. కాగా తాను ఎవరిపైనా ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదని ఆయన అన్నారు. కొందరు కావాలనే తనపై ఆమెతో ఫిర్యాదు చేయించారని ఆరోపించారు. లీగల్‌గా పోరాడి బయటకు వస్తానని ధీమా వ్యక్తం చేశారు.
తిరుమల లడ్డూ వ్యవహారంపై టీటీడీకి నెయ్యి సరఫరా చేసే తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ స్పందించింది. నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని వెల్లడించింది. ఇదే విషయాన్ని టీటీడీకి వివరించినట్లు చెప్పింది. జులైలో 16 టన్నుల నెయ్యి సరఫరా చేశామని వెల్లడించింది.
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ను పోలీసులు ఉప్పరపల్లి కోర్టుకు తరలించారు. రాజేంద్రనగర్ సీసీఎస్ నుంచి న్యాయస్థానానికి తీసుకెళ్లారు. ఈ ఉదయం నుంచి జానీని పోలీసులు విచారించారు.
చార్టెర్డ్ అకౌంటెన్సీ (CA)-2024 ఎగ్జామ్ షెడ్యూల్ విడుదలైంది. 2025 జనవరి 12, 14, 16, 18 తేదీల్లో ఫౌండేషన్ కోర్స్ ఎగ్జామ్స్ ఉంటాయని ICAI ప్రకటించింది. జనవరి 11, 13, 15 తేదీల్లో ఇంటర్మీడియట్ కోర్స్ గ్రూప్-1, జనవరి 17, 19, 21 తేదీల్లో ఇంటర్మీడియట్ కోర్స్ గ్రూప్-2 పరీక్షలు ఉంటాయని పేర్కొంది. ఫౌండేషన్, ఇంటర్మీడియట్ కోర్సుల పరీక్షలు మ.2 గంటల నుంచి ప్రారంభం అవుతాయని వివరించింది.
Sorry, no posts matched your criteria.