India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: అమరావతిలో సీడ్ యాక్సిస్ రోడ్డు సుందరీకరణ, LED లైటింగ్ ఏర్పాటు జగన్ హయాంలో జరిగిందన్న YCP ట్వీట్‌పై TDP మండిపడింది. ‘అమరావతిపై పగబట్టి, కులం అంటగట్టి, APకి రాజధాని లేకుండా చేసి, సిగ్గు లేకుండా జగన్ డెవలప్ చేశాడంటావా? ఈ ఫేక్ రాతలకే 11 సీట్లు ఇచ్చింది. 2019లో ఇలా ఉన్న అమరావతిని నాశనం చేసింది మీరేగా? ఇలాగే ఫేక్ చేస్తే ఉన్న 11 కూడా ఊడబీకుతారని, మీ పులివెందుల MLAకి చెప్పు’ అని Xలో రిప్లై ఇచ్చింది.
AP: వైజాగ్‌లో అల్లుడిని గెలిపించేందుకు బాలకృష్ణ ఈవీఎంల ట్యాంపరింగ్ చేశారని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ ఆరోపించారు. చంద్రబాబు నాయుడు ప్రధాని అయ్యే అవకాశాన్ని జూన్ 5నే కోల్పోయారని చెప్పారు. టీడీపీని, జేడీయూను వాడుకొని మోదీ అధికారంలోకి వచ్చారన్నారు. ఏపీకి స్పెషల్ స్టేటస్, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల వంటి హామీలు నెరవేర్చాలని మోదీని CBN అడిగి ఉంటే బాగుండేదని చెప్పారు.
తన సోదరి ప్రియాంకా గాంధీ వారణాసి నుంచి పోటీ చేసి ఉంటే ప్రధాని మోదీని 2-3లక్షల ఓట్ల తేడాతో ఓడించేవారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. తాను అహంకారంతో చెప్పడం లేదని, మోదీ రాజకీయాలు ప్రజలకు నచ్చడం లేదని తాజా ఎన్నికల్లో తేలిందని ఆయన మీడియాతో పేర్కొన్నారు. ద్వేషం, హింసకు వ్యతిరేకంగా తాము నిలబడుతామనే సందేశాన్ని ప్రజలు పంపారని తెలిపారు. కాగా ఈసారి ఎన్నికలకు ప్రియాంక దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.
TG: పాఠశాలల బస్సుల ఫిట్‌నెస్‌పై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ప్రతి స్కూల్ బస్సు తనిఖీ చేసి, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఉంటేనే రోడ్డు ఎక్కేలా చూడాలని రవాణాశాఖ ఉన్నతాధికారులతో సమీక్షలో సూచించారు. స్కూళ్లు, కాలేజీల్లో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. కారు డోర్లకు బ్లాక్ ఫిల్మ్ గ్లాస్ ఉన్న వాటిపైనా తనిఖీలు నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు.
కీలకమైన లోక్‌సభ స్పీకర్ ఎంపికలో BJP వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. మిత్రపక్షాలకు ఆ పదవి ఇవ్వడం BJPకి ఇష్టం లేదని, ఆ పార్టీ AP చీఫ్ పురందీశ్వరికి స్పీకర్ బాధ్యతలు ఇవ్వాలని చూస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే ఆమెకు మంత్రివర్గంలో చోటు ఇవ్వలేదనే మరో వాదన ఉంది. ఆమెకు ఇస్తే చంద్రబాబూ వ్యతిరేకించలేరనే టాక్ నడుస్తోంది. అయితే ఇందుకోసం నితీశ్(JDU)ను BJP ఒప్పించాల్సి ఉంటుంది.
AP: పార్టీ MLAలకు జనసేనాని పవన్ కళ్యాణ్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఎన్నికల్లో గెలిచిన 20మంది MLAలతో పవన్ భేటీ అయ్యారు. ‘పాతతరం రాజకీయాలకు కాలం చెల్లింది. అప్పటిలా కూర్చొని పవర్ ఎంజాయ్ చేద్దామనుకుంటే కుదరదు. ప్రజలు మనకు ఎంత మద్దతిచ్చారో వారికి కోపం వస్తే అంతే బలంగా నిలదీయగలరు. ఏదైనా సందర్భంలో వారు ఓ మాట అంటే భరించాలి. ఎవరిపైనా వ్యక్తిగత విమర్శలు చేయవద్దు’ అని పవన్ సూచించారు.
భారత్ మరో కీలక టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనుంది. FIH పురుషుల జూనియర్ వరల్డ్ కప్ టోర్నీ భారత గడ్డపై జరగనున్నట్లు భారత హాకీ అధ్యక్షుడు దిలీప్ టర్కీ తెలిపారు. ఈ అవకాశమిచ్చిన FIH అధ్యక్షుడు డాటో టయ్యాబ్ ఇక్రమ్‌కు ధన్యవాదాలు తెలిపారు. భారత్ ఈ పోటీలకు ఆతిథ్యమివ్వడం ఇది నాలుగో సారి. అంతకుముందు 2013, 16, 21లో ఈ పోటీలు జరిగాయి. వచ్చే ఏడాది డిసెంబర్‌లో ఈ టోర్నీ జరగనుంది.
దేశవ్యాప్తంగా 10 మంది రాజ్యసభ ఎంపీలు లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందారు. దీంతో ఆ 10 రాజ్యసభ సీట్లు ఖాళీ కానున్నాయి. అస్సాం నుంచి కామాఖ్య ప్రసాద్& శర్బానంద సోనోవాల్, బిహార్ నుంచి మిసా భారతి & వివేక్ ఠాకూర్, హరియాణా నుంచి దీపేందర్ సింగ్ హుడా, MP నుంచి జ్యోతిరాదిత్య సింధియా, MH నుంచి ఉదయన్రాజే భోంస్లే & పీయూష్ గోయల్, RJ నుంచి కేసీ వేణుగోపాల్, త్రిపుర నుంచి బిప్లవ్ కుమార్ దేవ్ లోక్‌సభ MPలుగా గెలిచారు.
భారత పురుషుల బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్-చిరాగ్ నం.1 ర్యాంకును కోల్పోయింది. సింగపూర్ ఓపెన్‌లో ఓటమి, ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి వైదొలగడంతో తాజాగా ప్రకటించిన BWF ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో నిలిచింది. చైనాకు చెందిన లియాంగ్, వాంగ్ చాంగ్ జోడీ తొలి స్థానం దక్కించుకుంది. మరోవైపు మహిళల సింగిల్స్‌లో సింధు 10వ ర్యాంకులో కొనసాగుతున్నారు. ఇక పురుషుల సింగిల్స్‌లో ప్రణయ్ 10వ, లక్ష్య సేన్ 14వ ర్యాంకులో నిలిచారు.
AP: ముఖ్యమంత్రిగా తన ప్రమాణ స్వీకారానికి వైసీపీ అధినేత జగన్‌ను ఆహ్వానించేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. జగన్‌తో ఫోన్‌లో మాట్లాడేందుకు యత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. అటు రేపటి చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉండాలని వైసీపీ నిర్ణయించుకున్నట్లు సమాచారం.
Sorry, no posts matched your criteria.