India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత ప్రజలు తమకు అప్పగించారని చంద్రబాబు అన్నారు. ‘1994లో వన్ సైడ్ ఎన్నికలు జరిగినా ఇన్ని సీట్లు రాలేవు. ఇప్పుడు 175కు 164 సీట్లు గెలిచాం. అంటే 11 సీట్లే ఓడిపోయాం. 93% స్ట్రైకింగ్ రేటు ఉంది. దేశ చరిత్రలోనే ఇది అరుదైన విజయం. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కడపలో 7కి 5 గెలిచాం. నూటికి నూరు శాతం మూడు పార్టీల కార్యకర్తలు సమష్టిగా పని చేశారు’ అని CBN అభినందించారు.
మణిపుర్‌లో ఏడాదిగా హింసాత్మక వాతావరణం కొనసాగుతుండటంపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘పదేళ్లుగా ఆ రాష్ట్రం ప్రశాంతంగా ఉంది. కానీ గత ఏడాది మళ్లీ ఒక్కసారిగా హింస చెలరేగింది. దీనిని ఎవరు పట్టించుకుంటారు? తక్షణమే ఈ పరిస్థితులు చక్కదిద్దాల్సిన అవసరం ఉంది’ అని RSS కార్యక్రమంలో తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారంలో నేతలు హుందాగా వ్యవహరించలేదని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
నీట్ యూజీ పరీక్షను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ చేపట్టనుంది. ఈనెల 4న విడుదలైన నీట్ ఫలితాల్లో ఏకంగా 67మంది ఫస్ట్ ర్యాంక్ సాధించారు. దీంతో పేపర్ లీకైందంటూ పలువురు విద్యార్థులు ఆరోపించారు. దీంతో పరీక్షను రద్దు చేయాలంటూ 9 పిటిషన్లు దాఖలు కాగా.. సుప్రీం తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.
గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖలకు సహాయ మంత్రి కావడంపై కొందరు YCP సపోర్టర్లు సెటైర్లు వేస్తున్నారు. ‘25 ఏళ్లకు పైగా USలో గడిపిన వ్యక్తి భారత్‌లో గ్రామీణాభివృద్ధి కోసం పనిచేస్తాడట. భారత ప్రభుత్వం ఓ జోక్‌లా ఉంది’ అని Xలో పోస్టులు పెడుతున్నారు. దీనిపై TDP శ్రేణులు స్పందిస్తూ.. ‘16 నెలలు జైలులో ఉన్న వ్యక్తి CM అవ్వలేదా?’ అని కౌంటర్ ఇస్తున్నారు.
ప్రముఖ కన్నడ నటుడు, ఛాలెంజింగ్ స్టార్ దర్శన్‌ను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. హత్య కేసులో దర్శన్‌ను మైసూరు ఫామ్‌హౌస్‌లో అరెస్టు చేశారు. అతడిని బెంగళూరుకు తీసుకొస్తున్నారు. చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్‌కు ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. దర్శన్ కన్నడలో ఎన్నో సినిమాల్లో నటించారు. తెలుగులో సూపర్ హిట్ అయిన ‘పోకిరి’ని రీమేక్ చేశారు.
ఇజ్రాయెల్ సైన్యం దూకుడు పెంచితే బందీలను చంపేయాలని హమాస్ నాయకత్వం ఫైటర్లను ఆదేశించింది. ఇటీవలే వీరి నుంచి నలుగురు బందీలను IDF రక్షించింది. ఈ క్రమంలో తమ సిబ్బంది, పాలస్తీనా పౌరులు మరణించారని ఆరోపిస్తూ ఉగ్ర సంస్థ ఈ ప్రకటన చేసింది. 2023 OCT 7న ఇజ్రాయెల్‌పై దాడి చేసి 200 మందిని హమాస్ బంధించింది. వీరిని వేర్వేరు చోట్లకు తరలిస్తున్నట్లు డ్రోన్లు, శాటిలైట్లతో ఇజ్రాయెల్, USA సంయుక్త బృందం గమనిస్తోంది.
AP: జనసేన శాసనసభ పక్ష నేతగా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో శాసనసభ పక్ష సమావేశం జరిగింది. తొలుత పవన్ పేరును ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ ప్రతిపాదించగా మిగతా సభ్యులందరూ ఆమోదించారు.
బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా పెళ్లి వార్తలపై ఆమె తండ్రి శత్రుఘ్న సిన్హా స్పందించారు. వివాహ విషయం ఆమె తనకు ఇంకా చెప్పలేదన్నారు. తన కూతురు సరైన నిర్ణయమే తీసుకుంటుందని, ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాను, తన భార్య సంతోషంగా ఆశీర్వదిస్తామని శత్రుఘ్న తెలిపారు. కాగా ఈనెల 23న జహీర్ ఇక్బాల్‌ను సోనాక్షి వివాహం చేసుకోబోతున్నారంటూ జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి.
పాకిస్థాన్‌పై విజయం తర్వాత టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎంజాయ్ చేస్తున్నారు. తన ఫ్యామిలీతో కలిసి విహారయాత్ర చేస్తున్నారు. భార్య రితికా, కూతురు సమైరాతో ఉన్న ఫొటోను హిట్‌మ్యాన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ పిక్ వైరల్‌గా మారింది. కాగా భారత్ తన తర్వాతి మ్యాచ్ రేపు యూఎస్‌ఏతో ఆడనుంది. ఈ మ్యాచ్ కూడా న్యూయార్క్‌లోని నసావు స్టేడియంలో జరగనుంది.
AP: ఎన్నికల ముందు రాజీనామా చేసిన వాలంటీర్ల పరిస్థితి ప్రస్తుతం రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. YCP అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 1,08,273 మంది రాజీనామా చేశారు. మళ్లీ YCP అధికారంలోకి రాకపోవడంతో వారి పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. వాలంటీర్లకు నెలకు రూ.10 వేల జీతం ఇస్తామని ప్రచారంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ రాజీనామా చేసినవారికి తిరిగి ఉద్యోగం రాకపోవచ్చు.
Sorry, no posts matched your criteria.