India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

బిగ్‌బాస్-8 నుంచి వరంగల్‌కు చెందిన నబీల్ ఎలిమినేట్ అయ్యారు. టాప్-3లో నిలిచిన నబీల్ ఎలిమినేట్ అవుతున్నట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించారు. గెస్టుగా వచ్చిన తమిళ హీరో విజయ్, హీరోయిన్ మంజు ఆయనను హౌజ్ నుంచి బయటకు తీసుకొచ్చారు. దీంతో టాప్-2లో నిఖిల్, గౌతమ్ మిగిలారు.

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని అల్లు అర్జున్ ఆకాంక్షించారు. ‘ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉండటంతో నేను శ్రీతేజ్‌ని, అతని కుటుంబాన్ని కలవకూడదని న్యాయ నిపుణులు చెప్పారు. అతను త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. శ్రీతేజ్ ఆస్పత్రి, కుటుంబ అవసరాలకు అండగా ఉంటాననే హామీకి కట్టుబడి ఉన్నా. సాధ్యమైనంత త్వరగా శ్రీతేజ్‌ని కలిసేందుకు ప్రయత్నిస్తా’ అని Xలో పోస్ట్ చేశారు.

బిగ్‌బాస్-8 నుంచి ప్రేరణ ఎలిమినేట్ అయ్యారు. టాప్-4లో ఆమె నిలవగా ఎలిమినేట్ చేస్తున్నట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించారు. హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ ఆమెను హౌస్ నుంచి బయటకు తీసుకొచ్చారు.

TG: గ్రూప్-2 తొలి రోజు పరీక్షలు ముగిశాయి. పరీక్ష రాసేందుకు సగానికి తక్కువే అభ్యర్థులు హాజరయ్యారు. ఉదయం నిర్వహించిన పేపర్-1కు 46.75శాతం హాజరవ్వగా, మధ్యాహ్నం పేపర్-2 రాసేందుకు 46.30 శాతం హాజరయ్యారు. రేపు పేపర్-3, పేపర్-4 పరీక్షలు జరగనున్నాయి.

బిగ్‌బాస్ సీజన్-8 నుంచి కమెడియన్ అవినాశ్ ఎలిమినేట్ అయ్యారు. టాప్-5లో ఉన్న ఆయన ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఈ సీజన్ మధ్యలో హౌస్‌లోకి వచ్చిన అవినాశ్, తన కామెడీతో అందరినీ అలరించారు. ఫినాలే గెస్టుల్లో ఒకరైన కన్నడ నటుడు ఉపేంద్ర హౌస్‌లోకి వెళ్లి ఆయన్ను బయటకు తీసుకొచ్చారు. కాగా అవినాశ్ గతంలోనూ బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా ఉన్నారు.

TG: వికారాబాద్‌లో గ్రూప్-2 పరీక్షకు ఓ అభ్యర్థి ఏకంగా మొబైల్ ఫోన్‌తో హాజరయ్యాడు. సదరు అభ్యర్థి ఫోల్డెడ్ ఫోన్‌తో రాగా అనుమానం వచ్చిన ఎగ్జామ్ చీఫ్ సూపరింటెండెంట్ తనిఖీ చేశారు. అభ్యర్థి వద్ద ఫోన్ దొరకడంతో అతడిని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన శ్రీసాయి డెంటల్ కాలేజీలో చోటు చేసుకుంది. కాగా అతడిపై మాల్ ప్రాక్టీస్ కింద చర్యలు ఉంటాయని అధికారులు తెలిపారు.

AP: విజన్-2047 పేరుతో చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారని వైసీపీ చీఫ్ జగన్ Xలో దుయ్యబట్టారు. వైసీపీ హయాంలో చేపట్టిన పథకాలను నీరుగారుస్తున్నారని మండిపడ్డారు. సూపర్ సిక్స్ సహా ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని విమర్శించారు. గత పాలనలో ప్రకటించిన విజన్లు ప్రచార ఆర్భాటంగానే మిగిలాయన్నారు. సంపద సృష్టిస్తానంటూ ప్రభుత్వ ఆస్తులను ఆవిరి చేశారని, అందుకే చంద్రబాబును 420 అంటారని పేర్కొన్నారు.

ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ ఆనారోగ్యంతో శాన్ ఫ్రాన్సిస్కోలోని ఓ ఆస్పత్రిలో చేరారు. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన్ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు జాకీర్ స్నేహితుడు రాకేశ్ చౌరాసియా తెలిపారు. 73 ఏళ్ల జాకీర్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనగా ఉన్నట్టు రాకేశ్ చెప్పారు.

జమిలి ఎన్నికలకు BSP చీఫ్ మాయావతి మద్దతు ప్రకటించారు. దీని వల్ల ఖర్చులు తగ్గడమే కాకుండా, పథకాల అమలుకు ఆటంకాలు తప్పుతాయన్నారు. SC, STలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లను వ్యతిరేకించిన INC, SPలు రిజర్వేషన్లపై సైలెంట్‌గా ఉండాలన్నారు. SC, ST, OBC రిజర్వేషన్లను మార్చకుండా 9వ షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్ చేశారు. BJP కూడా రిజర్వేషన్ల వ్యతిరేక ధోరణిని అవలంబిస్తోందని మాయావతి మండిపడ్డారు.

మార్చి 31, 2026 నాటికి దేశాన్ని నక్సల్స్ రహితంగా మారుస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. రాయ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నక్సలిజాన్ని రూపుమాపేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయన్నారు. ఛత్తీస్‌గఢ్ నక్సలిజం నుంచి విముక్తి పొందితే, దేశం మొత్తం ఈ ముప్పు నుంచి మోక్షం పొందుతుందన్నారు. ఏడాదిగా ఈ విషయంలో వృద్ధి సాధించామన్నారు.
Sorry, no posts matched your criteria.