News December 15, 2024

ICUలో జాకీర్ హుస్సేన్

image

ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ ఆనారోగ్యంతో శాన్ ఫ్రాన్సిస్కోలోని ఓ ఆస్ప‌త్రిలో చేరారు. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయ‌న్ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు జాకీర్ స్నేహితుడు రాకేశ్ చౌరాసియా తెలిపారు. 73 ఏళ్ల జాకీర్ ఆరోగ్య ప‌రిస్థితిపై ఆందోళ‌న‌గా ఉన్న‌ట్టు రాకేశ్ చెప్పారు.

Similar News

News January 24, 2025

RRR కేసు.. తులసిబాబుకు కస్టడీ

image

AP: రఘురామకృష్ణరాజును కస్టడీలో వేధించిన కేసులో తులసిబాబుకు కోర్టు కస్టడీ విధించింది. ఈ నెల 27 నుంచి 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతించింది. ప్రస్తుతం తులసిబాబు గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కస్టోడియల్ టార్చర్ కేసులో అతడు A-6గా ఉన్నారు. కాగా తులసిబాబు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు ప్రధాన అనుచరుడిగా ఉన్నట్లు తెలుస్తోంది.

News January 24, 2025

భార్యను ముక్కలుగా నరికిన ఘటన.. సీపీ కీలక వ్యాఖ్యలు

image

TG: మీర్‌పేట్‌లో భార్యను <<15227723>>దారుణంగా హత్య చేసిన ఘటన<<>> సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఇది మిస్సింగ్ కేసుగానే ఉందని రాచకొండ సీపీ సుధీర్ బాబు అన్నారు. ఇతర రాష్ట్రాల ఫోరెన్సిక్ నిపుణులతోనూ ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. కేసు టెక్నికల్ అంశాలతో ముడిపడి ఉందన్నారు. దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.

News January 24, 2025

‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాపై హైకోర్టులో పిల్!

image

విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాపై ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైంది. సినిమా బడ్జెట్, కలెక్షన్ల విషయంలో క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారని పిటిషనర్ పేర్కొన్నారు. అదనపు షోల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వ ఖజానాలో జమ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీనిపై ఐటీ, ఈడీ, జీఎస్టీ అధికారులతో విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.