India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: ఫార్ములా-ఈ రేసు వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్‌పై కేసు నమోదు చేసేందుకు ఏసీబీ రంగం సిద్ధం చేస్తోంది. విచారణకు ఇప్పటికే గవర్నర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని తెలుస్తుండటంతో త్వరలోనే ఆయనకు నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం. రేసు నిర్వహణ సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా రూ.46 కోట్ల విదేశీ కరెన్సీ చెల్లించారనేది కేటీఆర్‌పై అభియోగం. ఇప్పటికే ఈ కేసులో అప్పటి HMDA కమిషనర్ అర్వింద్‌కుమార్‌పై కేసు నమోదైంది.

రాత్రంతా జైల్లోనే ఉన్న అల్లుఅర్జున్‌ను ఖైదీలందరూ బ్యారక్‌లకు వెళ్లిన తర్వాత మంజీర బ్యారక్‌కు తరలించారు. జైలు అధికారులు ఫుడ్ ఆఫర్ చేసినా బన్నీ తీసుకోలేదని సమాచారం. ఆయనకు కొత్త రగ్గు, దుప్పటి ఇవ్వగా సాధారణ ఖైదీలాగే నేల మీద పడుకున్నట్లు తెలుస్తోంది. 14రోజుల రిమాండ్ విధించినప్పుడు న్యాయాధికారి ఆయనను ప్రత్యేక ఖైదీగా పరిగణించాలని ఆదేశించారు. అయితే ఆ సౌకర్యాలు జైల్లోకి వచ్చిన మర్నాడు మాత్రమే అందుతాయి.

AP: నూజివీడు IIIT జాతీయ స్థాయిలో మెరిసింది. ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌లో ఈ నెల 11, 12 తేదీల్లో జరిగిన స్మార్ట్ ఇండియా హ్యాకథాన్-2024 విజేతగా నిలిచింది. దేశ వ్యాప్తంగా 25 జట్లు పాల్గొన్న ఈ పోటీలో ‘ఛేజింగ్ హారిజన్స్’ విద్యార్థుల జట్టు విజయం సాధించి రూ.లక్ష బహుమతి అందుకుంది. జట్టులోని సిద్ధార్థ, వినూత్న, మనోజ్, వెంకటేశ్, విశ్వదత్త, ఫర్హానాను ఆర్జీయూకేటీ వీసీ ఆచార్య విజయ్ కుమార్ అభినందించారు.

TG: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మొత్తం 18 మందిని పోలీసులు నిందితులుగా చేర్చగా, 8మంది పరారీలో ఉన్నారు. ఈ కేసులో అల్లుఅర్జున్ A11గా ఉండగా, థియేటర్ పార్ట్నర్ రామరెడ్డి A1గా ఉన్నారు. A3గా థియేటర్ మరో భాగస్వామి సందీప్, సీనియర్ మేనేజర్ నాగరాజు A9గా, అప్పర్ లోయర్ బాల్కనీ ఇన్‌ఛార్జ్ విజయ చంద్రన్ A10గా పోలీసులు చేర్చారు. అటు చంచల్‌గూడ జైల్లో ఉన్న అల్లుఅర్జున్ కాసేపట్లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో 750 మంది IAS, IPS, IFS అధికారులు పని చేస్తున్నట్లు కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ రాణా తెలిపారు. రెండు రాష్ట్రాలకు 893 మందిని కేటాయించగా, ప్రస్తుతం 750 మంది విధులు నిర్వర్తిస్తున్నట్లు లోక్‌సభలో చెప్పారు. తెలంగాణలో మొత్తం 357 మంది అధికారులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. వీరిలో IASలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ 15మంది, పదోన్నతి పొందిన వారు 23మంది ఉన్నారని పేర్కొన్నారు.

బ్రిస్బేన్‌లో జరుగుతున్న 3వ టెస్టులో టాస్ గెలిచిన రోహిత్ బౌలింగ్ ఎంచుకున్నారు. జట్టులో 2 మార్పులు జరిగాయి. అశ్విన్ స్థానంలో జడేజా, హర్షిత్ రాణా బదులు ఆకాశ్ దీప్ ఆడనున్నారు.
IND: రోహిత్, జైస్వాల్, రాహుల్, గిల్, కోహ్లీ, పంత్, నితీశ్, జడేజా, ఆకాశ్‌దీప్, సిరాజ్, బుమ్రా.
AUS: ఖవాజా, మెక్‌స్వీనీ, లబుషేన్, స్మిత్, హెడ్, మార్ష్, కేరీ, కమిన్స్, స్టార్క్, లయన్, హేజిల్‌వుడ్.

బెయిల్ మంజూరైనా పలు కారణాలతో అల్లుఅర్జున్ చంచల్‌గూడ జైలు నుంచి విడుదల కాలేదు. దీంతో జైలు అధికారులు ఆయన్ను అండర్ ట్రైల్ ఖైదీగా(ఖైదీ నంబర్ 7697) మంజీరా బ్యారక్‌లో ఉంచారు. రాత్రి 10 గంటల వరకు జైలు రిసెప్షన్‌లోనే ఉంచిన సిబ్బంది ఆపై బ్యారక్‌లోని క్లాస్–1 రూమ్‌కు తరలించినట్లు తెలుస్తోంది. అందులో ఆయనతో మరో ఇద్దరు విచారణలో ఉన్న ఖైదీలు ఉన్నట్లు సమాచారం. ఈ ఉదయం అల్లుఅర్జున్ విడుదల కానున్నారు.

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో నిన్న అరెస్టైన అల్లు అర్జున్ ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్నారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో కాసేపట్లో(ఉ.7 గంటలలోపు) ఆయన విడుదల కానున్నారు. బన్నీని రిసీవ్ చేసుకోవడానికి అల్లు అరవింద్‌తో పాటు ఇతర కుటుంబ సభ్యులు చంచల్‌గూడ జైలు వద్దకు చేరుకుంటున్నట్లు సమాచారం.

BGTలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్ట్ కాసేపట్లో ప్రారంభం కానుంది. బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం ఉ.5.50కి స్టార్ట్ అవుతుంది. తొలి మ్యాచ్ గెలిచిన IND రెండో మ్యాచ్‌లో తేలిపోయింది. రోహిత్, కోహ్లీ, రాహుల్, గిల్, పంత్ భారీ స్కోర్లు చేయలేకపోవడం మైనస్‌గా మారింది. ఈ మ్యాచ్‌లోనైనా రాణించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
* స్టార్ స్పోర్ట్స్‌లో లైవ్.

TG: ఫ్రొఫెసర్, రచయిత కంచె ఐలయ్యకు హైకోర్టులో ఊరట దక్కింది. ఆయన రాసిన ఓ పుస్తకం తమ మనోభావాలు దెబ్బతీశాయని ఓ సామాజికవర్గానికి చెందిన పలువురి ఫిర్యాదులతో కోరుట్ల, కరీంనగర్ తదితర ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. వీటిని కొట్టేయాలంటూ ఐలయ్య హైకోర్టులో పిటిషన్లు వేశారు. విచారణ చేపట్టిన న్యాయమూర్తి కేసులను కొట్టేశారు. ఆ పుస్తకాన్ని నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కొట్టేసిందని జడ్జి ప్రస్తావించారు.
Sorry, no posts matched your criteria.