India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కేంద్ర మంత్రివర్గ కూర్పుపై ఈ రాత్రికి ఏకాభిప్రాయం వచ్చే అవకాశం ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు, ఎన్డీయే పక్ష నేతలు కాసేపట్లో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా నివాసానికి వెళ్లనున్నారు. కూటమిలోని పార్టీలకు ఇచ్చే మంత్రి పదవులపై చర్చించనున్నారు. ఆ తర్వాత అమిత్ షా నివాసంలోనూ కసరత్తు చేయనున్నారు. నిన్న మంత్రి పదవులపై మోదీ, బీజేపీ, RSS నేతలు సుదీర్ఘంగా చర్చించారు.
AP: YCP కవ్వింపు చర్యలపై TDP క్యాడర్ సంయమనం పాటించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. కొన్ని చోట్ల వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య నెలకొన్న ఘర్షణల విషయంపై పార్టీ నేతల ద్వారా సమాచారం తెప్పించుకున్నారు. దాడులు, ప్రతి దాడులు జరగకుండా చూడాలని TDP ఎమ్మెల్యేలు, నేతలను ఆదేశించారు. పోలీసులు సైతం శాంతిభద్రతలు అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు.
దేశంలో సెన్సెక్స్ పురోగతిపై బ్లూమ్‌బర్గ్ ఆసక్తికర నివేదికను వెల్లడించింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాం(2004-14)లోనే స్టాక్ మార్కెట్ అత్యధికంగా 397.79% లాభాలను ఇచ్చినట్లు పేర్కొంది. మోదీ పాలన(2014-24)లో ఇన్వెస్టర్లకు 202.16% రిటర్నులు వచ్చినట్లు తెలిపింది. PV నరసింహారావు హయాం(1991-96)లో 180.76%, వీపీ సింగ్ పాలన(1989-90)లో 91.94% లాభాలు వచ్చాయని చెప్పింది.
AP: విజయవాడలోని రాజ్‌భవన్‌లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌తో నూతన సీఎస్ నీరభ్ కుమార్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సీఎస్‌కు గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఇప్పటి వరకు సీఎస్‌గా విధులు నిర్వహించిన జవహర్‌రెడ్డిని ప్రభుత్వం బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఈ నెలాఖరున ఆయన పదవీ విరమణ చేయనున్నారు.
భారత రాజ్యాంగం కోట్లాది మందికి నమ్మకాన్ని, బలాన్ని, గౌరవాన్ని ఇచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘నా జీవితంలోని ప్రతి క్షణాన్ని డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ అందించిన భారత రాజ్యాంగంలోని విలువలను నిలబెట్టడానికి అంకితం చేశాను. రాజ్యాంగం వల్లే పేదరికంలో, వెనుకబడిన కుటుంబంలో పుట్టిన నాలాంటి వ్యక్తి దేశానికి సేవ చేయగలుగుతున్నారు’ అని ట్వీట్ చేశారు.
AP: జనసేన నేత నాగబాబు మీసం తిప్పారు. ‘ఈ మీసం తిప్పింది.. జనసేనాని 100% స్ట్రైక్‌రేట్‌తో గెలిచారని కాదు. కూటమి అఖండ విజయం సాధించిందని కూడా కాదు. ఈ ధర్మపోరాటంలో పోరాడి గెలిచిన ప్రతి ఆంధ్రుడి తరఫున నేను గర్వంతో తిప్పుతున్నా’ అంటూ ట్వీట్ చేశారు. దీనికి మీసం తిప్పుతున్న ఫొటోను జతచేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ పక్కన తన కుమారుడు అకీరా నందన్‌ను చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని నటి రేణూదేశాయ్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. ‘నాకు మొదటి నుంచి బీజేపీ అంటే అభిమానం. మోదీని కలిసిన వెంటనే అకీరా నాకు ఫోన్ చేశాడు. మోదీ చాలా గొప్పవారని.. ఆయన చుట్టూ ఓ పాజిటివ్ వైబ్ ఉంటుందని చెప్పాడు. అకీరా మాటలు వింటున్నంతసేపు నేను ఆనందంలో మునిగిపోయా’ అని ఆమె పేర్కొన్నారు.
TG: వరంగల్-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ ఉపఎన్నిక కౌంటింగ్ ఉత్కంఠగా కొనసాగుతోంది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఇప్పటివరకు 42 మంది అభ్యర్థులు ఎలిమినేట్ అయ్యారు. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ ఎలిమినేషన్ తర్వాత తీన్మార్ మల్లన్నకు(కాంగ్రెస్) 1,23,709, రాకేశ్ రెడ్డికి(బీఆర్ఎస్) 1,04,846 ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం మల్లన్న ఆధిక్యంలో ఉన్నారు. మరికొన్ని గంటల్లో విజేత ఎవరో తేలనుంది.
ఎంపీ కంగనా రనౌత్‌పై <<13394142>>చేయి<<>> చేసుకున్న CISF కానిస్టేబుల్ కుల్వీందర్ కౌర్‌కు బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ దద్లానీ అండగా నిలిచారు. ‘నేను హింసకు మద్దతు ఇవ్వను. కానీ ఆమె కోపాన్ని అర్థం చేసుకున్నా. కుల్వీందర్‌పై CISF చర్యలు తీసుకుంటే ఉద్యోగం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. జై హింద్. జై జవాన్. జై కిసాన్’ అని ఇన్‌స్టాలో పోస్టు చేశారు. కాగా ఆమెపై FIR నమోదైన విషయం తెలిసిందే.
రేపు జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్‌లో పాల్గొనేందుకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ బయల్దేరారు. నేడు రాత్రి లేదా రేపు పార్టీ పెద్దలతో ఆయన ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ, పీసీసీ చీఫ్ మార్పు, నామినేటెడ్ పోస్టుల భర్తీ వంటి అంశాలపై వారితో ఆయన చర్చించనున్నట్లు సమాచారం. సీఎంతో పాటు దామోదర రాజనర్సింహ, వంశీచంద్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు.
Sorry, no posts matched your criteria.