News December 12, 2024
రేపు స్కూళ్లకు సెలవు ఉంటుందా?
APలో రేపు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. ఇవాళ పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడటంతో చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇచ్చారు. అయితే శుక్రవారం విద్యాసంస్థలకు సెలవుపై కలెక్టర్లు ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇవాళ ఆలస్యంగా సెలవు ప్రకటించడంతో అప్పటికే ఆ 2 జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు వెళ్లిన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
Similar News
News January 26, 2025
కుంభమేళా.. నాగసాధువుల గురించి ఈ విషయాలు తెలుసా?
ప్రయాగ్‌రాజ్ కుంభమేళాకు వేలసంఖ్యలో నాగసాధువులు తరలివచ్చి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. నాగసాధువులు ఒంటి మీద నూలుపోగు లేకుండా హిమాలయాల్లో ధ్యానం చేస్తుంటారు. విపరీతమైన చలి, ఎండకు కూడా వీరు చలించరు. అన్ని రుతువులకు తట్టుకునేలా అగ్నిసాధన, నాడీ శోధన, మంత్రపఠనం చేసి శరీరం, మనసుపై నియంత్రణ పొందుతారు. రోజులో ఒక్కసారి మాత్రమే భోజనం తీసుకుంటారు. వీరు చనిపోయిన చోటే సమాధి చేస్తారు.
News January 26, 2025
మహ్మద్ షమీకి మళ్లీ మొండిచేయే..!
ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమ్ ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీకి తుది జట్టులో చోటు దక్కలేదు. తొలి టీ20లో స్థానం దక్కకపోయినా రెండో మ్యాచులోనైనా ఆయనను ఆడిస్తారని అంతా భావించారు. కానీ మేనేజ్‌మెంట్ అతడిని పెవిలియన్‌కే పరిమితం చేసింది. దీంతో చాన్నాళ్లకు షమీ బౌలింగ్ చూద్దామనుకున్న అభిమానులకు మరోసారి అసంతృప్తే మిగిలింది. మూడో టీ20లోనైనా ఆయనకు ఛాన్స్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
News January 26, 2025
అది షో ఆఫ్ ఎలా అవుతుంది?: ఊర్వశీ రౌతేలా
సైఫ్ అలీ ఖాన్‌పై దాడి గురించి మాట్లాడే సమయంలో హీరోయిన్ ఊర్వశీ రౌతేలా తన ఆభరణాల గురించి మాట్లాడటం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై ఊర్వశీ స్పందించారు. ‘సైఫ్‌పై దాడి విషయాలు నాకు అంతగా తెలియవు. నాకు తెలిసినంత వరకు చెప్పా. అదే సమయంలో నాకు బహుమతిగా వచ్చిన కానుకల గురించి చెప్పా. ఇది ఏమాత్రం షో ఆఫ్ కాదు. అదే నిజమైతే నా చేతికి ఉన్న చిన్న వాచ్‌ను కూడా చూపించేదాన్ని’ అని చెప్పారు.