News June 7, 2024

మరో మూడు రోజుల్లో ‘కల్కి’ ట్రైలర్‌

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్న ‘కల్కి’ సినిమా ట్రైలర్ ఈనెల 10న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మరో మూడు రోజుల్లో ట్రైలర్ రాబోతోందని ఓ స్పెషల్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. పోస్టర్‌లో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ స్పెషల్‌గా డిజైన్ చేసిన ఆయుధంతో ఉన్నారు. ఈనెల 27న ‘కల్కి’ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.

News June 7, 2024

పసికూనే.. అయినా పంజా విసురుతోంది!

image

ఏమాత్రం అంచనాల్లేని అమెరికా టీ20 వరల్డ్ కప్‌లో అదరగొడుతోంది. ఈ మెగా టోర్నీకి ముందు బంగ్లాదేశ్‌పై సిరీస్ విజయం గాలి వాటం కాదని నిరూపిస్తూ.. టీ20 వరల్డ్‌కప్‌ తొలి మ్యాచ్‌లో కెనడాపై విజయం సాధించింది. నిన్నటి మ్యాచ్‌లో ఏకంగా మాజీ ఛాంపియన్ పాకిస్థాన్‌కు షాకిచ్చి ప్రపంచకప్‌లోకి తన ఆగమనాన్ని ఘనంగా చాటింది. బౌలింగ్, బ్యాటింగ్‌లో సమష్టిగా రాణిస్తున్న అమెరికా ప్లేయర్లు పెద్ద జట్లకే సవాల్ విసురుతున్నారు.

News June 7, 2024

ఎన్డీఏకు కొత్త నిర్వచనం చెప్పిన మోదీ

image

ఎన్డీఏ అంటే న్యూ ఇండియా.. డెవలప్ ఇండియా.. యాస్పిరేషనల్ ఇండియా అని నరేంద్ర మోదీ కొత్త నిర్వచనం ఇచ్చారు. ఇదే స్ఫూర్తితో దేశ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం అందరి కర్తవ్యమని ఎన్డీఏ ఎంపీల సమావేశంలో పిలుపునిచ్చారు. దేశ ప్రజల స్వప్నాల సాకారానికి తమ వద్ద రోడ్ మ్యాప్ ఉందన్నారు. ఇండియాగా పేరు మార్చుకున్న తర్వాత కూడా యూపీఏను ప్రజలు అంగీకరించలేదని మోదీ విమర్శించారు.

News June 7, 2024

అధికారంలోకి టీడీపీ.. వీరిని మిస్ అవుతున్నాం: TDP శ్రేణులు

image

ఆంధ్రప్రదేశ్ గడ్డపై తెలుగు దేశం పార్టీ తిరిగి అధికారంలోకి రానుండటంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. అయితే, ఈ సంతోష సమయంలో సీనియర్ ఎన్టీఆర్, హరికృష్ణలతో పాటు తారకరత్నను మిస్ అవుతున్నామని ట్వీట్స్ చేస్తున్నారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేశ్ పాదయాత్రలో తారకరత్న గుండెపోటుకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన విషయం తెలిసిందే. టీడీపీ అధికారంలోకి రావాలని ఆయన కోరుకునేవారు.

News June 7, 2024

సందీప్ శాండిల్య పదవీ కాలం పొడిగింపు

image

TG: రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్‌ జనరల్ సందీప్ శాండిల్య పదవీ కాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఆయన పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. జూన్ 1 నుంచే ఇవి అమల్లోకి వచ్చాయని సీఎస్ శాంతి కుమారి పేర్కొన్నారు. గతేడాది డిసెంబర్ 13న ఆయన టీన్యాబ్ డైరెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు.

News June 7, 2024

కేజీ వెండి ధర రూ.లక్ష

image

వెండి ధరలు ఆల్‌టైమ్ రికార్డుకు చేరాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ కేజీ సిల్వర్ రేట్ రూ.2,500 పెరిగి రూ.1,00,500కు చేరింది. ఇటీవల తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు కూడా మళ్లీ పెరుగుతున్నాయి. 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములకు రూ.330 పెరిగి రూ.73,750కి చేరింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.300 పెరిగి రూ.67,600గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లోని మిగతా ప్రాంతాల్లోనూ ఇవే ధరలు ఉన్నాయి.

News June 7, 2024

TG, KAలో ప్రభుత్వాలు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయి: మోదీ

image

సౌత్ ఇండియాలో ప్రజలు ఎన్డీఏను అక్కున చేర్చుకున్నారని మోదీ తెలిపారు. ముఖ్యంగా తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాలు తక్కువ కాలంలోనే అక్కడి ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయని చెప్పారు. అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏకు బాసటగా నిలిచారని పేర్కొన్నారు. ‘తమిళనాడులో సీట్లు గెలవకున్నా ఎన్డీఏ ఓట్ షేర్ భారీగా పెరిగింది. భవిష్యత్తులో అక్కడ మనం కొత్త చరిత్ర రాయబోతున్నాం’ అని మోదీ ధీమా వ్యక్తం చేశారు.

News June 7, 2024

దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని హామీ ఇస్తున్నా: మోదీ

image

ఎన్డీఏ కూటమి అసలైన భారత ఆత్మగా నిలుస్తూ స్ఫూర్తిని చాటుతుందని నరేంద్ర మోదీ అన్నారు. తనను పార్లమెంటరీ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘ఎన్నికల ముందు పొత్తు పెట్టుకున్న కూటమి ఇంతగా ఎప్పుడూ విజయం సాధించలేదు. ప్రభుత్వం ఏర్పాటు కావాలంటే సంఖ్యాబలం, దేశాన్ని నడపాలంటే సర్వసమ్మతం అవసరం. దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని హామీ ఇస్తున్నా’ అని మోదీ స్పష్టం చేశారు.

News June 7, 2024

NEET ఫలితాలపై స్పందించిన సీఎం స్టాలిన్

image

నీట్ యూజీ ఫలితాలపై TN సీఎం స్టాలిన్ స్పందించారు. ‘తాజా నీట్ ఫలితాలు మేమెందుకు ఆ పరీక్షకు వ్యతిరేకమో నిరూపించాయి. సుసాధ్యం కాని గ్రేస్ మార్కుల ముసుగులో ప్రశ్నాపత్రం లీక్, ఒకే కేంద్రంలో టాపర్స్ ఉండటం వంటివి నీట్ లోపాలను ఎత్తిచూపుతున్నాయి. నీట్ పేదలకు వ్యతిరేకం. అవి ఫెడరల్ పాలిటీని దెబ్బతీస్తాయి. ఇది అవసరమైన చోట వైద్యుల లభ్యతపై ప్రభావం చూపుతుంది. నీట్‌కు వ్యతిరేకంగా పోరాడదాం’ అని Xలో పోస్ట్ చేశారు.

News June 7, 2024

కవితపై సీబీఐ ఛార్జ్‌షీట్

image

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో BRS MLC కవితపై రౌస్ అవెన్యూ కోర్టులో సీబీఐ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. దీనిపై కోర్టు విచారణ చేపట్టింది. ఇక సీబీఐ కేసులో కవిత జుడీషియల్ కస్టడీ నేటితో ముగిసింది. కస్టడీ పొడిగింపుపై మధ్యాహ్నం 2 గంటలకు కోర్టు విచారణ చేపట్టనుంది. కవిత ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్న విషయం తెలిసిందే.