India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దేశంలో ఎలక్షన్ కోడ్ ముగిసింది. ఈ ఏడాది మార్చి 16వ తేదీన అమల్లోకి వచ్చిన ఎన్నికల ప్రవర్తనా నియమావళిని CEC ఎత్తివేసింది. దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియ ముగియడంతో కోడ్ ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనూ కోడ్ తొలగినట్లయింది.
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఛైర్మన్‌గా జనసేన నేత నాగబాబును నియమిస్తారని వార్తలు షికార్లు చేస్తున్నాయి. తాజాగా ఈ ప్రచారాన్ని నాగబాబు ఖండించారు. ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. పార్టీ లేదా తన నుంచి అధికారిక ప్రకటన వస్తేనే నమ్మాలని ట్వీట్ చేశారు.
ప్రధాని మోదీపై కాంగ్రెస్ సెటైరికల్ పోస్ట్ చేసింది. ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారిన టీడీపీ చీఫ్ చంద్రబాబు, జేడీయూ అధినేత నితీశ్ కుమార్ తమ డిమాండ్లతో మోదీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారనే అర్థం వచ్చేలా ఓ సెటైరికల్ ఫొటోను పోస్ట్ చేసింది. అందులో మోదీకి మనశ్శాంతి లేకుండా చంద్రబాబు, నితీశ్ ఆయన చేతులను లాగుతున్నట్లు ఉంది. కాగా ఈ ఎన్నికల్లో ఎన్డీఏకు 293, ఇండియాకు 234 సీట్లు వచ్చిన విషయం తెలిసిందే.
తాము ఎన్డీఏ కూటమిలో చేరబోతున్నామనే వార్తలు అవాస్తవమని శివసేన-యూబీటీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. ఎట్టి పరిస్థితిల్లోనూ ఎన్డీఏతో చేతులు కలపమని ఆయన స్పష్టం చేశారు. ఇండియా కూటమిలోనే కొనసాగుతామని తేల్చి చెప్పారు. కాగా మహారాష్ట్రలో కాంగ్రెస్, శివసేన-యూబీటీ, ఎన్సీపీ-శరద్ కలిసి ఎన్నికల్లో పోటీ చేసి 30 సీట్లు గెలుచుకున్నాయి. కాంగ్రెస్ 13, శివసేన-యూబీటీ 9, ఎన్సీపీ-శరద్ 8 స్థానాల్లో గెలిచాయి.
AP: తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని వేరే చోటుకు మార్చాలని జగన్ నిర్ణయించారు. తాడేపల్లిలో తన నివాసం పక్కనున్న క్యాంప్ ఆఫీసును పార్టీ కార్యాలయంగా మార్చాలని సూచించారు. ఈ నెల 10 నుంచి కొత్త భవనంలో పార్టీ కార్యకలాపాలు జరపాలని జగన్ వైసీపీ ముఖ్య నేతలను ఆదేశించారు.
గుజరాత్‌లో కొందరు అధికారులు లంచాలను EMIల రూపంలో స్వీకరిస్తున్నారని ఆ రాష్ట్ర యాంటీ కరప్షన్ బ్యూరో DGP షంషేర్ సింగ్ చెప్పారు. ‘CID క్రైమ్ ఇన్‌స్పెక్టర్ ఓ వ్యక్తి నుంచి నెలకు ₹10వేల చొప్పున ₹50 వేలు కోరాడు. మరో అధికారి ఓ కాంట్రాక్టర్ నుంచి నెలకు ₹30 వేల చొప్పున ₹1.20 లక్షలు ఇవ్వాలన్నారు. బాధితులు పలు కేసుల్లో నిందితులుగా ఉండటంతో ఫిర్యాదు చేయలేకపోతున్నారు’ అని పేర్కొన్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన ఎంపీల్లో 93 శాతం మిలియనీర్లు ఉన్నారని ఏడీఆర్ నివేదిక పేర్కొంది. మొత్తం 543 మంది ఎంపీల్లో ఈ సంఖ్య 504గా ఉందని తెలిపింది. టాప్-3లో టీడీపీ ఎంపీ చంద్రశేఖర్(AP-రూ.5,705 కోట్లు), బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి(TG-రూ.4,568 కోట్లు), నవీన్ జిందాల్(హరియాణా-రూ.1,241 కోట్లు) ఉన్నారని పేర్కొంది. 2019లో 475 మంది మిలియనీర్లు MPలుగా ఉండగా, 2014లో 443 మంది ఉన్నారు.
ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 11 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 32 సీట్లను కొత్తగా గెలుచుకుంది. ఒడిశాలో 12, తెలంగాణలో 4, మహారాష్ట్ర, ఏపీలో 3 చొప్పున, బెంగాల్‌లో 2, బిహార్, దాద్రా నగర్ హవేలీ, ఛత్తీస్‌గఢ్, అండమాన్ నికోబార్ దీవులు, యూపీ, మధ్యప్రదేశ్, కర్ణాటక, కేరళలో ఒక్కో స్థానంలో విజయం సాధించింది. కాగా ఈసారి బీజేపీ 240 స్థానాల్లో గెలిచిన విషయం తెలిసిందే.
ఈ సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన 251 మంది ఎంపీలపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ADR నివేదిక వెల్లడించింది. అందులో 170 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు(అత్యాచారం, హత్య, హత్యాయత్నం, కిడ్నాప్, మహిళలపై దాడులు) ఉన్నాయంది. అలాగే మొత్తం 543 మంది ఎంపీలనుగాను 504(93 శాతం) మంది కోటీశ్వరులని పేర్కొంది. ఎన్నికైన మొత్తం ఎంపీల సగటు ఆస్తి రూ.46.34 కోట్లని తెలిపింది.
T20WCలో భాగంగా ఈ నెల 9న భారత్-పాక్ మధ్య మ్యాచ్ జరిగే వేదికను మారుస్తారని.. న్యూయార్క్ నుంచి ఫ్లోరిడా లేదా టెక్సాస్‌కు తరలిస్తారని వదంతులు వస్తున్నాయి. దీనిపై ICC స్పందించినట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో మ్యాచ్‌లను తరలించే అవకాశమే లేదని స్పష్టం చేసినట్లు సమాచారం. వేదికలను మార్చే ప్రణాళికలు లేవని చెప్పినట్లు తెలుస్తోంది. కాగా న్యూయార్క్ పిచ్‌పై BCCI ఆందోళన వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి.
Sorry, no posts matched your criteria.