India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో అరెస్టయిన వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేశ్ కు పోలీసు కస్టడీ ముగిసింది. కోర్టు అనుమతితో మంగళగిరి రూరల్ పీఎస్‌లో ఆయనను పోలీసులు రెండు రోజులు విచారించారు. విచారణ అనంతరం మంగళగిరి పీఎస్ నుంచి ఆయనను గుంటూరు జైలుకు తరలించారు.
ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన కార్యక్రమం తుది దశకు చేరుకుంది. కాసేపటి క్రితమే శోభాయాత్ర ముగిసింది. ఖైరతాబాద్ నుంచి మొదలైన ఊరేగింపు సెక్రటేరియట్ ముందు నుంచి ఎన్టీఆర్ మార్గ్ వరకు సాగింది. ఈక్రమంలో సచివాలయం ముందు మహాగణపతిని కెమెరాలో బంధించిన ఫొటో వైరల్ అవుతోంది. ఇది ఫొటో ఆఫ్ ది డే అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరిన్ని ఫొటోలకు ఇమేజ్ పక్కన క్లిక్ చేయండి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ తెరకెక్కిస్తోన్న ‘OG’ షూటింగ్‌ను త్వరలోనే పూర్తిచేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తాజాగా తన పాత్ర కోసం నటి శ్రియారెడ్డి ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన యుద్ధ క్రీడ అయిన కళరిపయట్టు ప్రాక్టీస్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరలవుతున్నాయి. ఇప్పటికే కొంత పార్ట్ షూటింగ్ పూర్తికాగా పవన్‌తో మరో షెడ్యూల్‌ను చిత్రీకరించనున్నట్లు టాక్.
ఢిల్లీ కొత్త CMగా ఆతిశీ ఎంపికకు కొన్ని కారణాలు ఉన్నాయి. 2013 నుంచే ఆప్‌లో విధాన నిర్ణయాల్లో ఆమెది కీలక పాత్ర. 2015-18 వరకు DyCM సిసోడియాకు సలహాదారు. 2020లో కల్‌కాజీ నుంచి MLAగా గెలిచి PWD, విద్య, కల్చర్, టూరిజం మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కేజ్రీ, సౌరభ్, సిసోడియా, జైన్ జైలుకెళ్లినప్పుడు పార్టీని, ప్రభుత్వాన్ని నడిపించారు. వ్యవస్థలపై పట్టు, కేజ్రీ గీసిన గీత దాటకపోవడం ఆమెకు కలిసొచ్చిన అంశాలు.
ఖైరతాబాద్ సప్తముఖ మహాగణపతి ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన క్రేన్-4 వద్దకు చేరుకున్నాడు. అశేష జనవాహిని తోడు రాగా గణపయ్య గంగమ్మ ఒడికి చేరుకునేందుకు సిద్ధమయ్యాడు. కాసేపట్లో వినాయకుడి విగ్రహాన్ని భారీ క్రేన్‌తో హుస్సేన్‌సాగర్ నిమజ్జనం చేయనున్నారు. ఇందుకు సుమారు గంట సమయం పట్టే అవకాశం ఉంది.
TG: CM రేవంత్ నివాసం వద్ద కలకలం రేపిన <<14108323>>బ్యాగ్<<>> మిస్టరీని పోలీసులు ఛేదించారు. అందులో డమ్మీ బాంబు ఉన్నట్లు గుర్తించారు. సినిమా షూటింగ్ కోసం దీన్ని తయారు చేసిన ఓ వ్యక్తి తన బైక్ డిక్కీలో పెట్టాడు. అయితే ఆ బైక్‌ను తీసుకెళ్లిన అతడి ఫ్రెండ్ డిక్కీలో నిజమైన బాంబ్ ఉందనుకొని తెలియకుండా రేవంత్ నివాసం సమీపంలో పడేశాడు. ఓ ఆటో డ్రైవర్ పోలీసులకు చెప్పడంతో బ్యాగ్‌ను స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేశారు.
AP: NEET స్కోర్ 600 దాటిన విద్యార్థులకూ కన్వీనర్ కోటా తొలి కౌన్సెలింగ్‌లో మెడికల్ సీటు దక్కలేదని YCP ట్వీట్ చేసింది. ‘పేద విద్యార్థుల ‘డాక్టర్’ కలను చంద్రబాబు చెరిపేశారు. జగన్ ప్రభుత్వంలో 5 కొత్త మెడికల్ కాలేజీల ద్వారా 750 సీట్లు అదనంగా రావడంతో గతేడాది 563 స్కోర్‌కే MBBS సీటు వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు నిర్వాకంతో కొత్త కాలేజీలు ఆగిపోయి, మంచి ర్యాంకు సాధించినా సీటు రావట్లేదు’ అని పేర్కొంది.
నందమూరి బాలకృష్ణ వారసుడైన మోక్షజ్ఞ తేజ హీరోగా నటించే సినిమాను రూ.100 కోట్ల బడ్జెట్‌తో రూపొందించనున్నట్లు సమాచారం. మోక్షజ్ఞ మొదటి సినిమా కావడంతో బడ్జెట్‌లో కాంప్రమైజ్ కాకూడదని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ‘హనుమాన్’ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాలోని మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ విడుదలవగా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.
గుజరాత్‌లోని RE ఇన్వెస్ట్ ఫోరమ్‌లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని కలిసిన ప్రపంచ పర్యావరణవేత్త ఎరిక్ సొల్హెమ్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ‘బాబు తన రాష్ట్రాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తారని ఆశిస్తున్నా. ఆయన గతంలో ఉమ్మడి ఏపీ, తెలంగాణ రాష్ట్రాన్ని సౌత్ఇండియా సిలికాన్ వ్యాలీగా మార్చారు. అత్యుత్తమ ప్రపంచ నైపుణ్యాన్ని తీసుకురావడానికి, పెట్టుబడిదారులను సమీకరించడానికి మేము సహాయం చేస్తాం’ అని తెలిపారు.
టీమ్ఇండియా స్టార్ ఆల్ రౌండర్ అశ్విన్‌కు బీసీసీఐ సెక్రటరీ జైషా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘మా స్పిన్ మాస్ట్రో అశ్విన్‌కి శుభాకాంక్షలు. బంతితో మీరు చేసే మ్యాజిక్‌ను చూడటం అదృష్టం. మీరు కొత్త బెంచ్‌మార్క్‌లను సెట్ చేయడం కొనసాగించాలని నేను కోరుకుంటున్నా. ఈ ఏడాది మీ జీవితం మరింత అద్భుతంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.
Sorry, no posts matched your criteria.