India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇండోనేషియా ఓపెన్ మహిళల సింగిల్స్‌లో భారత ప్లేయర్ పీవీ సింధు తొలి రౌండ్‌లోనే ఓడారు. చైనీస్ తైపీ ప్లేయర్ సు వెన్‌చి చేతిలో 15-21, 21-15, 14-21తేడాతో పరాజయం పాలయ్యారు. పారిస్ ఒలింపిక్స్ 2024కి ముందు సింధు వరుస ఓటములపై భారత అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన మలేషియా మాస్టర్స్‌లో సింధు రన్నరప్‌గా నిలిచారు.
AP: కేంద్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఐదేళ్ల సుస్థిర పాలన అందిస్తుందని మాజీ ఐఏఎస్, బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు. ‘చంద్రబాబు, నితీశ్ కుమార్ దీర్ఘకాలిక అనుభవం ఉన్న నాయకులు. కలగూరగంపలా ఉన్న I.N.D.I.A కూటమి అధికారంలోకి వచ్చినా ఎన్నాళ్లు ఉంటుందో తెలియదు. ఈ పరిస్థితుల్లో వీరు ఆ కూటమి వైపు వెళ్లే తప్పు చేయరు’ అని ఆయన ట్వీట్ చేశారు.
ఢిల్లీలోని ప్రధాని మోదీ నివాసంలో ఎన్డీయే కూటమి నేతల భేటీ ముగిసింది. సుమారు గంటన్నర పాటు కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించారు. ఈ రోజు రాష్ట్రపతి వద్దకు మోదీ, అమిత్ షా, చంద్రబాబు, నితీశ్ వెళ్లే అవకాశం ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ద్రౌపది ముర్మును కోరనున్నారు.
AP: కడప పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన YS. షర్మిలకు మొత్తం 1,41,039 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ వైసీపీ అభ్యర్థి వైఎస్ అవినాశ్ రెడ్డికి 6,05,143, టీడీపీ అభ్యర్థి భూపేశ్ సుబ్బరామిరెడ్డికి 5,42,448 ఓట్లు పడ్డాయి. అవినాశ్ 62,695 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 2.66% ఓట్ షేర్ వచ్చింది.
ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో గరిష్ఠంగా 81 మంది మంత్రులు ఉండొచ్చు. 91వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం మంత్రుల సంఖ్య లోక్‌సభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో 15 శాతం మించరాదు. మంత్రి మండలి సభ్యులను ప్రధాని సలహాపై రాష్ట్రపతి నియమిస్తారు. మంత్రులుగా నియమితులయ్యే వారికి పార్లమెంట్ ఉభయ సభల్లో ఏదో ఒకదానిలో సభ్యత్వం ఉండాలి. లేకుండా మంత్రిగా బాధ్యతలు చేపడితే ప్రమాణం చేసిన 6 నెలల్లోపు సభ్యత్వాన్ని పొందాలి.
తెలంగాణలో BJP ఓట్ల పోలరైజేషన్‌లో కిషన్ రెడ్డి కసరత్తు ఫలితాల్లో కన్పిస్తోంది. అసెంబ్లీ పోరులో INC- 39%, BRS- 37.3%, BJP-13.9% ఓటు షేర్ పొందాయి. EC ప్రకారం లోక్‌సభ ఫలితాల్లో INC-40%, BJP-35%, BRS-16.6% ఓట్ షేర్ పొందాయి. దాదాపు గులాబీ ఓట్ బ్యాంకు అంతా బదిలీ కావడంలో రాష్ట్ర సారథి వ్యూహాలు ఫలించాయని హైకమాండ్ భావిస్తోంది. కాంగ్రెస్‌కు BJPనే ప్రత్యామ్నాయంగా చూపే టాస్క్ ఆయన 6 నెలల్లోనే పూర్తి చేశారు.
టీడీపీ చీఫ్ చంద్రబాబుకు సూపర్ స్టార్ మహేశ్ బాబు కంగ్రాట్స్ తెలియజేశారు. ‘ఏపీ సీఎంగా ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన చంద్రబాబు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ టర్మ్ విజయవంతంగా సాగాలని, రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా’ అని ఆయన ట్వీట్ చేశారు.
ఉత్తర కాశీలో విషాదం చోటు చేసుకుంది. సహస్రతల్ ప్రాంతంలో హిమాలయాల్లో ట్రెక్కింగ్ చేస్తూ ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు గల్లంతయ్యారు. మరో 22 మంది ట్రెక్కర్లు మంచులో చిక్కుకున్నారు. హెలికాప్టర్ సహాయంతో 13 మందిని రక్షణ సిబ్బంది కాపాడారు. ట్రెక్కర్లు అంతా కర్ణాటకకు చెందిన వారుగా గుర్తించారు.
AP: తాజా ఎన్నికల ఫలితాలతో YCP నియంతృత్వ పాలనను ప్రజలు అథ:పాతాళానికి తొక్కేశారని.. TDP నేత MLA నిమ్మల రామానాయుడు అన్నారు. తాను చేసిన సంక్షేమాన్ని పక్కనపెట్టి, ప్రజలు తనను మోసం చేశారంటూ మాజీ సీఎం జగన్ చెప్పడం ఆయన పెత్తందారీతనానికి నిదర్శనమని విమర్శించారు. తన చేతగానితనాన్ని ప్రజల మీదకు నెట్టేసిన ఏకైక CM జగన్ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. AP ఎన్నికల ఫలితాలు 5 కోట్ల ఆంధ్రుల సమష్టి విజయమని వ్యాఖ్యానించారు.
లోక్‌సభ ఎన్నికల్లో NDA కూటమి విజయం సాధించడంతో మోదీకి చైనా కంగ్రాట్స్ చెప్పింది. ద్వైపాక్షిక సంబంధాలను, మైత్రిని కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆ దేశ అధికార ప్రతినిధి మావో నింగ్ తెలిపారు. ఇరుదేశాల్లో అభివృద్ధికి ఇది సహకరిస్తుందని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.