India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బడ్జెట్‌లో ప్రకటించిన ఎన్‌పీఎస్ వాత్సల్య పథకాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 18న ప్రారంభించనున్నారు. ఆరోజు ఈ స్కీమ్ విధివిధానాలను తెలియజేయనున్నారు. 18 ఏళ్లలోపు బాలబాలికల పేరుతో తల్లిదండ్రులు ఈ NPS వాత్సల్య ఖాతాను తెరవొచ్చు. దీంతో ముందుగానే పెట్టుబడులు పెట్టేందుకు వీలవుతుంది. చక్రవడ్డీతో పాటు అదనపు పన్ను మినహాయింపులుంటాయి. 18 ఏళ్ల తర్వాత ఇది సాధారణ NPS ఖాతాగా మారుతుంది.
హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరీ వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. వీరిద్దరికీ ఇది రెండో పెళ్లి. సిద్ధార్థ్ 20 ఏళ్ల క్రితమే తన ఇంటి పక్కనుండే మేఘనా నారాయణ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే, వీరి వివాహం ఎక్కువ కాలం నిలువలేదు. ‘రంగ్ దే బసంతి’ మూవీ తర్వాత వీరి మధ్య మనస్పర్ధలు రావడంతో 2007లో విడిపోయారు. అదితి గతంలో సత్యదీప్ మిశ్రాను వివాహం చేసుకొని విడిపోయారు.
* 15వేల మంది పోలీసులతో బందోబస్తు
* మెట్రో సేవలు అర్ధరాత్రి 2 గంటల వరకు పొడిగింపు
* 733 సీసీ కెమెరాలతో పర్యవేక్షణ
* రేపు ఉ.6 గంటల నుంచి రా.11 గంటల వరకు భారీ వాహనాలు, ప్రైవేటు బస్సులకు నగరంలోకి అనుమతి నిరాకరణ
* మహిళల భద్రత కోసం హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో 12 షీటీమ్స్
* 30వేల విగ్రహాలు నిమజ్జనం అవుతాయని అంచనా
* మ.1.30 గంటలలోపు గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ మహాగణపతి
TG: ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనానికి రేపు ఉ.6 గంటలకు కదలనున్నాడు. ఖైరతాబాద్ నుంచి రాజ్‌దూత్ హోటల్(లక్డీకపూల్)-టెలిఫోన్ భవన్-తెలుగు తల్లి ఫ్లై ఓవర్ పక్కగా సెక్రటేరియట్ ముందు నుంచి గణనాథుడి ఊరేగింపు కొనసాగనుంది. ఎన్టీఆర్ గార్డెన్ ఎదురుగా ఏర్పాటు చేసిన క్రేన్ నం.4 వద్ద మధ్యాహ్నం 1.30 గంటలలోపు నిమజ్జనం చేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
AP: రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులకు కౌలు డబ్బులను ప్రభుత్వం విడుదల చేసింది. రైతుల ఖాతాల్లో క్యాపిటల్ రీజినల్ డెవలప్‌మెంట్ అథారిటీ(CRDA) డబ్బులు జమ చేసింది.
AP: విద్యారంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేస్తున్న మంత్రి నారా లోకేశ్‌కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ఇలాగే ముందుకు సాగాలని ఆయనకు సూచించారు. కాగా రాష్ట్రంలోని యూనివర్సిటీలను ప్రక్షాళన చేయాలని లోకేశ్ నిర్ణయించారు. రాజకీయాలకు అతీతంగా విద్యారంగ నిపుణులను వీసీలుగా నియమించాలని భావించారు. వర్సిటీలను జాతీయ, అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలుగా మార్చేందుకు ఆయన సంకల్పించారు.
AP: CBSEని పూర్తిగా రద్దు చేసినట్లు కల వచ్చిందా జగన్? అని TDP ట్వీట్ చేసింది. ‘నీ ప్రచార పిచ్చితో 77,478 మంది విద్యార్థులను రోడ్డున పడేశావు. హడావుడిగా CBSE ప్రవేశపెట్టి కనీస సౌకర్యాలు కల్పించలేదు. దీంతో విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధం కాలేకపోయారు. మోడల్ ఎగ్జామ్ నిర్వహిస్తే 77,478 మందిలో 49,410 మంది ఫెయిల్ అయ్యారు. అందుకే ఈ ఏడాది CBSEకి కాకుండా స్టేట్ బోర్డుకే పరీక్షలు రాస్తారు’ అని పేర్కొంది.
TG: కొత్త రేషన్ కార్డుల విధివిధానాలపై మరోసారి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. జనవరి నుంచి రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వం హయాంలో 49,476 రేషన్ కార్డులు మాత్రమే ఇచ్చిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ తెలిపారు. ఉప ఎన్నిక ఉన్న నియోజకవర్గాల్లోనే ఆ కార్డులు ఇచ్చిందన్నారు.
సీఎం మమతా బెనర్జీతో చర్చలకు జూనియర్ డాక్టర్లు ఎట్టకేలకు ఆమె నివాసానికి చేరుకున్నారు. ఐదోసారి, ఇదే చివరిసారంటూ సీఎస్ చర్చలకు ఆహ్వానించడంతో వైద్య సంఘాలు స్పందించాయి. లైవ్ స్ట్రీమింగ్‌కి, ఇరు వర్గాలు మినిట్స్ రికార్డ్ చేసుకోవడానికి అంగీకరించాలని వైద్యులు డిమాండ్ చేశారు. లైవ్ స్ట్రీమింగ్‌ను ఇదివరకే తిరస్కరించిన రాష్ట్ర ప్రభుత్వం, మీటింగ్ మినిట్స్‌ను వైద్యులతో పంచుకోవడానికి అంగీకరించింది.
అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలాను చంపేందుకు ఎవరూ ప్రయత్నించడం లేదని చేసిన వివాదాస్పద ట్వీట్‌ను ఎలాన్ మస్క్ తొలగించారు. ‘నేను దీన్నుంచి నేర్చుకుందేమిటంటే? నేనేదైనా అభిప్రాయాన్ని వ్యక్తపరిచినప్పుడు ప్రజలు నవ్వుతారు. దానర్థం అది Xలో పోస్ట్ చేస్తే అంతే ఫన్నీగా ఉంటుందని కాదు’ అని రాసుకొచ్చారు. ట్రంప్‌నే ఎందుకు చంపాలనుకుంటున్నారని ఓ యూజర్ అడగ్గా మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Sorry, no posts matched your criteria.