News June 4, 2024

ఓటమి బాటలో ఆ ఇద్దరు మంత్రులు?

image

AP: ప్రకాశం జిల్లాలో ఇద్దరు YCP మంత్రులు ఓటమి బాటలో పయనిస్తున్నారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి (ఒంగోలు)తోపాటు మంత్రులు ఆదిమూలపు సురేశ్ (కొండపి), మేరుగు నాగార్జున (సంతనూతలపాడు)కు ఓటమి తప్పేలా లేదు. ఎన్నికల కౌంటింగ్‌లో వీరందరూ వెనుకంజలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థులు ఒంగోలులో దామచర్ల 14 వేలకుపైగా, కొండపిలో స్వామి 12 వేలకుపైగా, సంతనూతలపాడులో విజయ్ కుమార్ దాదాపు 30 వేల ఓట్ల లీడింగ్‌లో ఉన్నారు.

News June 4, 2024

రంగంలోకి కాంగ్రెస్ ట్ర‌బుల్ షూట‌ర్‌

image

ఇండియా కూట‌మి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డానికి కాంగ్రెస్ ట్ర‌బుల్ షూట‌ర్‌, క‌ర్ణాట‌క మంత్రి డీకే శివ‌కుమార్ రంగంలోకి దిగారు. TDP, జేడీయూల‌ను త‌మ‌వైపు తిప్పుకొనేందుకు కాంగ్రెస్ ప్లాన్ బీ అమ‌లు చేస్తోంది. ఇందులో భాగంగా చంద్ర‌బాబుతో శివ‌కుమార్ చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్టు స‌మాచారం. మ‌రోవైపు ఎన్సీపీ(ఎస్పీ) జాతీయ‌ అధ్య‌క్షుడు శ‌ర‌ద్ ప‌వార్ కూడా చంద్రబాబు, బిహార్ సీఎంతో చ‌ర్చిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

News June 4, 2024

నితీశ్, నవీన్ పట్నాయక్‌తో టచ్‌లోకి శరద్ పవార్!

image

ఇండియా కూటమి, ఎన్డీఏ మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతున్న నేపథ్యంలో అలయన్స్ నేత శరద్ పవార్ మెజారిటీ పెంచుకునే ప్రయత్నాల్లో పడ్డారు. బిహార్ సీఎం నితీశ్ కుమార్, టీడీపీ చీఫ్ చంద్రబాబు, బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్‌తో ఆయన టచ్‌లో ఉన్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. కూటమికి మద్దతు కోరినట్లు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఎన్డీఏ 298, ఇండియా 231, ఇతరులు 17 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు.

News June 4, 2024

నితీశ్ కుమార్‌కు INDIA డిప్యూటీ పీఎం ఆఫర్?

image

NDA అధికారం దూరం చేసేందుకు INDIA కూటమి ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా JDU మద్దతుకై రంగంలోకి దిగిన శరద్ పవార్ ఉప ప్రధాని పదవిని నితీశ్‌కు ఆఫర్ చేసినట్లు సమాచారం. బీహార్‌లో 15 లోక్‌సభ స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న నితీశ్ మాత్రం మోదీతోనే కొనసాగుతానని ప్రకటించారు. కానీ గతంలో కాంగ్రెస్, BJP పక్షాలతో నెలల వ్యవధిలోనే పొత్తులు మార్చిన బీహార్ CM మాటపై ఉంటారా? లేదా? అనేది చూడాలి.

News June 4, 2024

కవిత అరెస్ట్.. బీజేపీకి కలిసొచ్చిందా?

image

లిక్కర్ స్కాం కేసులో కవిత అరెస్ట్ BJPకి కలిసి వచ్చిందా? అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దీంతో BRS, BJP ఒకటి కాదని ప్రజల్లోకి సంకేతాలు వెళ్లాయి. దీనికితోడు మోదీ ప్రచారం BJPకి బూస్ట్ ఇచ్చింది. TGలో గతంలో 4 స్థానాల్లో గెలిచిన బీజేపీ ఈసారి ఏకంగా 8 స్థానాల్లో ఆధిక్యం దిశగా కొనసాగుతోంది. అయోధ్య రామమందిరం నిర్మాణం సెంటిమెంట్, NZBలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామనే హామీ పనిచేసినట్లు చెబుతున్నారు.

News June 4, 2024

పార్వతీపురం, కురుపాం, సాలూరులో TDP విజయం

image

ఉమ్మడి విజయనగరం జిల్లాలో కూటమి జోరు కొనసాగుతోంది. పార్వతీపురంలో TDP అభ్యర్థి బోనెల విజయ్ చంద్ర.. YCP అభ్యర్థి అలజంగి జోగారావుపై 23,650 ఓట్ల మెజార్టీతో విజయకేతనం ఎగురవేశారు. కాంగ్రెస్ అభ్యర్థి మోహనరావు మూడో స్థానానికి పరిమితం అయ్యారు. కురుపాంలో YCP అభ్యర్థి పాముల పుష్పశ్రీవాణిపై TDP అభ్యర్థి తోయక జగదీశ్వరి విజయం సాధించారు. సాలూరులో YCP అభ్యర్థి రాజన్న దొరపై TDP అభ్యర్థి సంధ్యారాణి గెలుపొందారు.

News June 4, 2024

లక్ష దాటిన వేమిరెడ్డి ఆధిక్యం

image

AP: నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 126148 ఓట్ల లీడింగ్‌లో ఉన్నారు. వైసీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి వెనుకంజలో కొనసాగుతున్నారు. అలాగే ఒంగోలు టీడీపీ ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి 15 వేలకుపైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

News June 4, 2024

డీకే శివకుమార్ సోదరుడు ఓటమి

image

కర్ణాటకలో బెంగళూరు రూరల్ కాంగ్రెస్ అభ్యర్థి, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేశ్ ఓటమిపాలయ్యారు. ఆయనపై బీజేపీ అభ్యర్థి డా.సి.మంజునాథ్ 2,39,744 ఓట్ల తేడాతో గెలుపొందారు. మరోవైపు పంజాబ్‌లోని జలంధర్ స్థానం నుంచి పంజాబ్ మాజీ సీఎం, కాంగ్రెస్ అభ్యర్థి చరన్‌జిత్ సింగ్ గెలిచారు. బీజేపీ అభ్యర్థి సుశీల్ కుమార్ రింకూపై 1.75లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించారు.

News June 4, 2024

తండ్రీకుమారుల వెనుకంజ

image

AP: వైసీపీ కీలక నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి వెనుకంజలో ఉన్నారు. గత ఎన్నికల్లో చంద్రగిరి నుంచి గెలిచిన భాస్కర్ రెడ్డి ఈసారి ఒంగోలు ఎంపీగా బరిలో నిలిచారు. అక్కడ టీడీపీ అభ్యర్థి మాగంటి శ్రీనివాసులు రెడ్డి 13,979 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇటు చంద్రగిరి స్థానంలో ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయన ప్రత్యర్థి పులివర్తి నాని కంటే 10,579 ఓట్ల వెనుకంజలో ఉన్నారు.

News June 4, 2024

BREAKING: లక్ష ఓట్లను చీల్చిన షర్మిల

image

AP: అన్న వైఎస్ జగన్‌తో విభేదించి కాంగ్రెస్‌లో చేరిన షర్మిల కడపలో భారీగా వైసీపీ ఓట్లను చీల్చారు. ఏకంగా 1,09,620 ఓట్లు సాధించారు. అవినాశ్ రెడ్డి(YCP) 4,53,483 ఓట్లు, టీడీపీ అభ్యర్థి భూపేశ్ రెడ్డి 3,93,215 ఓట్లు సాధించి ఒకటి, రెండు స్థానాల్లో ఉన్నారు. ప్రస్తుతం అవినాశ్ 60,268 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అలాగే పులివెందులలోనూ సీఎం జగన్ మెజార్టీని భారీగా తగ్గించారు.