News December 10, 2024
ఓటీటీలోకి వచ్చేసిన ‘తంగలాన్’
కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ నటించిన ‘తంగలాన్’ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రసారమవుతోంది. పా.రంజిత్ తెరకెక్కించిన ఈ మూవీలో మాళవిక మోహనన్ హీరోయిన్‌గా నటించారు. కాగా ఈ సినిమా ఆగస్ట్ 15న థియేటర్లలో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టినట్లు టాక్.
Similar News
News January 18, 2025
పెళ్లి చేసుకున్న శ్రీలంక క్రికెటర్
శ్రీలంక స్పిన్నర్ మహీశ్ తీక్షణ ఓ ఇంటివాడయ్యారు. తన ప్రేయసి అర్తికా యోనాలీని వివాహం చేసుకున్నారు. కొలొంబో వేదికగా జరిగిన ఈ వేడుకకు ఆ దేశ క్రికెటర్లు హాజరయ్యారు. IPL-2023, 2024లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన అతను 27 మ్యాచ్‌లలో 25 వికెట్లు తీశారు. ఈ ఏడాది రాజస్థాన్ రాయల్స్‌కు ఆడనున్నారు. శ్రీలంక తరఫున మూడు ఫార్మాట్లలో కలిపి 135 వికెట్లు పడగొట్టారు.
News January 18, 2025
పూర్తిగా కోలుకున్న విశాల్
ఇటీవల తీవ్ర అనారోగ్యంతో బాధపడిన హీరో విశాల్ పూర్తిగా కోలుకున్నారు. ‘మదగజరాజు’ సక్సెస్ మీట్‌లో నవ్వుతూ, ఎంజాయ్ చేస్తూ కనిపించారు. 12 ఏళ్ల తర్వాత విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్ సాధించి చరిత్ర సృష్టించిందంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సినిమాకు మ్యూజిక్ అందించిన హీరో విజయ్ ఆంటోనీపై ప్రశంసలు కురిపించారు. సెలబ్రేషన్ ఫొటోలను షేర్ చేశారు.
News January 18, 2025
ఎంపీతో రింకూ ఎంగేజ్‌మెంట్‌లో ట్విస్ట్!
రింకూ సింగ్, SP MP ప్రియా సరోజ్ పెళ్లి ప్రచారంపై ట్విస్ట్ చోటుచేసుకుంది. ఇంకా వారిద్దరికి ఎంగేజ్‌మెంట్ కాలేదని ప్రియ తండ్రి తుఫానీ సరోజ్ చెప్పినట్లు జాతీయ మీడియా పేర్కొంది. రింకూ ఫ్యామిలీ తమ పెద్ద అల్లుడితో మ్యారేజీ ప్రపోసల్ గురించి చర్చించినట్లు ఆయన చెప్పారని తెలిపింది. తమ 2 కుటుంబాల మధ్య పెళ్లి చర్చలు జరుగుతున్న మాట వాస్తవమే అయినా ఎంగేజ్‌మెంట్ జరిగిందనడంలో నిజం లేదన్నట్లు వెల్లడించింది.