India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తన ఆటను మెరుగుపరుచుకోలేదని భావించినప్పుడే రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తానని భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నారు. ఆటకు వీడ్కోలు పలకడం ఎప్పుడనేది ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పారు. స్పిన్నర్ అనిల్ కుంబ్లే రికార్డును బద్దలు కొట్టాలని అనుకుంటున్నట్లు తెలిపారు. అయితే ప్రస్తుతానికి ఎలాంటి లక్ష్యాన్ని పెట్టుకోలేదని, దీంతో ఆటపై ప్రేమను కోల్పోదలుచుకోలేదన్నారు.
AP: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో బొగ్గు కొరత కారణంగా ఉత్పత్తి నిలిచిపోయిన విషయం కేంద్రం దృష్టికి వచ్చిందని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. స్టీల్ ప్లాంట్‌కు ఇలాంటి సమస్య కొత్తగా వచ్చినది కాదని వ్యాఖ్యానించారు. బొగ్గు కొరత రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. వరదలతో నష్టపోయిన ఏపీని కేంద్రం ఆదుకుంటుందని చెప్పారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు కేంద్రం నిధులు మంజూరు చేసిందని గుర్తు చేశారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆరు వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. టాటానగర్-పట్నా, బ్రహ్మపూర్-టాటానగర్, రూర్కెలా-హౌరా, డియోగఢ్-వారణాసి, భాగల్పూర్-హౌరా, గయా-హౌరా మార్గాల్లో ప్రయాణించే రైళ్లను ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. వాస్తవానికి ఝార్ఖండ్‌లో ఈ కార్యక్రమం జరగాల్సి ఉండగా వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు.
రాజీనామా చేస్తానని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటించడంతో తర్వాతి సీఎం ఎవరనే చర్చ మొదలైంది. మంత్రి ఆతిశీకే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కేజ్రీవాల్, సిసోడియా జైలులో ఉన్నప్పుడు ఆమెనే పార్టీ, పాలన బాధ్యతలు చూశారు. సీఎం సతీమణికి అండగా నిలిచారు. సిసోడియాను CM చేస్తే BJPకి విమర్శించే ఛాన్స్ ఇచ్చినట్లవుతుంది. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల దృష్ట్యా ఆతిశీనే CM చేసే ఛాన్సుందని రాజకీయ నిపుణులు అంటున్నారు.
TG: ఓటుకు నోటు కేసులో విచారణ పూర్తి చేయడంలో గత బీఆర్ఎస్ సర్కార్ విఫలమైందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. నిజంగా న్యాయం జరగాలని కోరుకుంటే కేసును సీబీఐ లేదా ఈడీకి బదిలీ చేయాల్సిందని అభిప్రాయపడ్డారు. రాహుల్ లేని లోటును కేటీఆర్ భర్తీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
ఐటీ శాఖ రూల్స్ ప్రకారం ఒకే వ్యక్తికి రెండు పాన్ కార్డులు ఉండరాదు. ఒకరి PANను మరొకరికి బదిలీ చేసేందుకు వీల్లేదు. రెండు కార్డులుంటే ఐటీ చట్టం 1961, సెక్షన్ 272బి ప్రకారం రూ.10,000 ఫైన్ విధించే అవకాశముంది. అందుకే రెండు కార్డుల్లో ఒకటి ప్రభుత్వానికి సరెండర్ చేయాలి. ఐటీ చెల్లింపులను కచ్చితత్వంతో నమోదు చేసేందుకు, అక్రమాలకు చెక్ పెట్టేందుకు కేంద్రం ప్రతి వ్యక్తికీ ఓ ప్రత్యేకమైన PANను కేటాయిస్తోంది.
TG: సీఎం రేవంత్ నివాసం సమీపంలో ఓ బ్యాగ్ కలకలం రేపింది. జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంటి వద్ద అనుమానాస్పదంగా బ్యాగ్ కనిపించడంతో ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ దాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాన్ని దూరంగా తీసుకెళ్లి తనిఖీ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
AP: వరద బాధితులను ఆదుకునేందుకు దివీస్ సంస్థ ముందుకొచ్చింది. మంత్రి లోకేశ్‌ను కలిసిన దివీస్ సీఈవో కిరణ్ CMRFకు రూ.5 కోట్ల చెక్కును అందించారు. దీంతో పాటు ఈ నెల 1 నుంచి 8వ తేదీ వరకు వరద బాధితులకు ఆహారాన్ని అందించిన అక్షయపాత్ర ఫౌండేషన్‌కు మరో రూ.4.8 కోట్లను అందించారు. మొత్తంగా రూ.9.8 కోట్ల విరాళమిచ్చిన దివీస్ సంస్థను లోకేశ్ అభినందించారు.
కృత్రిమ మేధ వల్ల ఉద్యోగాలు పోతాయని 67.5శాతంమంది ఇంజినీర్లలో ఆందోళన నెలకొన్నట్లు తమ అధ్యయనంలో తేలిందని గ్రేట్ లెర్నింగ్ సంస్థ తెలిపింది. నైపుణ్యాల్ని పెంచుకోకపోతే కెరీర్‌కు రక్షణ ఉండదని 87.5శాతం మంది అభిప్రాయపడ్డారని తెలిపింది. వచ్చే పదేళ్లలో 40శాతం వరకు జాబ్స్ ఏఐ పరిధిలోకి వెళ్లే అవకాశం ఉంది. దీంతో 89శాతం మేర ఇంజినీర్లు AI, MLలోనే కొత్త నైపుణ్యాల్ని నేర్చుకోవాలనుకుంటున్నారని పేర్కొంది.
హీరోయిన్ మేఘా ఆకాశ్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తన ప్రియుడు సాయి విష్ణుని పెళ్లాడారు. ఆదివారం చెన్నైలోని ఓ ఫంక్షన్ హాల్‌లో వీరి పెళ్లి జరగ్గా పలు రంగాలకు చెందిన ప్రముఖులు విచ్చేశారు. శనివారం నిర్వహించిన రిసెప్షన్‌కు తమిళనాడు సీఎం స్టాలిన్ హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. లై, ఛల్ మోహన్ రంగా, పేట, కుట్టి స్టోరీ, డియర్ మేఘ, రాజ రాజ చోర వంటి చిత్రాల్లో మేఘా నటించారు.
Sorry, no posts matched your criteria.