India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బద్వేలులో వైసీపీ అభ్యర్థి దాసరి సుధ లీడింగులో ఉన్నారు. పాణ్యంలో టీడీపీ అభ్యర్థి గౌరు చరిత 2,365 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. పులివెందులలో తొలి రౌండులో సీఎం జగన్ 1,888 ఓట్ల లీడింగులో కొనసాగుతున్నారు. పెనుకొండలో సవిత వెయ్యి ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ప్రొద్దుటూరులో వైసీపీ అభ్యర్థి రాచమల్లు శివప్రసాద్ లీడింగులో ఉన్నారు.
చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. ఆయన బీజేపీ నుంచి పోటీలో ఉన్నారు. తొలి రౌండ్ ముగిసే సమయానికి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి 3,773 ఓట్లు రాగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డికి 3,214 ఓట్లు పడ్డాయి.
TG: ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి మొదటి నుంచి భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రఘురాంరెడ్డి రెండో రౌండ్ ముగిసే సమయానికి 55,654 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. గతంలో ఇది బీఆర్ఎస్ సిటింగ్ సీటు.
AP: కొండపి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డీబీవీ స్వామి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వైసీపీ అభ్యర్థి ఆదిమూలపు సురేష్ వెనుకంజలో ఉన్నారు. అలాగే సంతనూతలపాడులో టీడీపీ అభ్యర్థి విజయ్ కుమార్ లీడింగ్‌లో కొనసాగుతున్నారు. వైసీపీ అభ్యర్థి మేరుగు నాగార్జున వెనుకంజలో ఉన్నారు.
వారణాసి నుంచి పోటీలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ వెనుకంజలో ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్న అజయ్ లీడ్ కనబరుస్తున్నారు. మోదీ 6 వేలకు పైగా ఓట్ల వెనకబడ్డట్లు తెలుస్తోంది.
అత్యంత వివాదాస్పదంగా మారిన మాచర్ల నియోజకవర్గంలో ఊహించని ఫలితం రాబోతున్నట్లు తెలుస్తోంది. అక్కడ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెనుకంజలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థి బ్రహ్మానంద రెడ్డి 1,000 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాగా, మాచర్లలో పోలింగ్ సందర్భంగా పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేయడంతో ఆ నియోజకవర్గం పేరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
AP: తిరుపతి అసెంబ్లీ స్థానంలో జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు లీడింగులో ఉన్నారు. అక్కడ వైసీపీ నుంచి భూమన అభినయ్ రెడ్డి పోటీ చేస్తున్నారు. జమ్మలమడుగులో బీజేపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అక్కడ వైసీపీ నుంచి సుధీర్ రెడ్డి బరిలో ఉన్నారు.
TG: నాగర్ కర్నూల్‌లో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి ముందంజలో ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
భువనగిరిలో ఆధిక్యం మారుతోంది. మొదట బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ ముందంజలో ఉండగా.. ఆ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
రాజస్థాన్‌లో జరుగుతున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియలో బన్స్వారా పోలింగ్ కేంద్రంలో సమయానికి పోస్టల్ బ్యాలెట్ బాక్స్ కీ కనిపించలేదు. దీంతో అధికారులు బ్యాలెట్ బాక్స్ తాళం పగలగొట్టి బ్యాలెట్ పత్రాల లెక్కింపు ప్రారంభించారు. కాగా అక్కడ బీజేపీ అభ్యర్థి మహేంద్రజిత్ సింగ్ మాలవీయ ఆధిక్యంలో ఉన్నారు.
Sorry, no posts matched your criteria.