News September 14, 2024

రీరిలీజ్‌కు సిద్ధమైన ‘జర్నీ’

image

శర్వానంద్, జై, అంజలి, అనన్య ప్రధాన పాత్రలు పోషించిన ‘జర్నీ’ మూవీ రీరిలీజ్‌కు సిద్ధమైంది. ఈ చిత్రాన్ని ఈ నెల 21న 4కే వెర్షన్‌లో రీరిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ఇప్పటికే బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. ఎం.శరవణన్ తెరకెక్కించిన ఈ మూవీకి సి.సత్య మ్యూజిక్ అందించారు. కాగా ఈ సినిమా 2011 డిసెంబర్ 16న విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది.

News September 14, 2024

త్వరలో అకౌంట్లోకి డబ్బులు

image

TG: ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రూ.2లక్షల రుణమాఫీ పూర్తి చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఇప్పటివరకు 22 లక్షల మంది రైతులకు రూ.18వేల కోట్ల రుణమాఫీ చేశామన్నారు. రేషన్ కార్డు లేని 3 లక్షల మంది రైతుల వివరాలను గ్రామాల వారీగా అధికారులు పరిశీలిస్తున్నారని, ఈ నెలాఖరులోగా వారి ఖాతాల్లో డబ్బు జమ చేసి రుణమాఫీ చేస్తామన్నారు. రుణమాఫీ పూర్తయ్యాకే రైతుభరోసా డబ్బులు జమ చేస్తామన్నారు.

News September 14, 2024

వరద బాధిత జిల్లాగా NTR

image

AP: NTR జిల్లాను పూర్తి వరద ప్రభావిత జిల్లాగా ప్రకటిస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. AUG 30, 31 తేదీల్లో జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షం కురవడంతో విజయవాడలోని 32 డివిజన్లు పూర్తిగా మునిగాయి. 2 లక్షల మంది బాధితులయ్యారు. బుడమేరు, కృష్ణా నది, మున్నేరు వరదల కారణంగా చాలా ప్రాంతాలు నష్టపోయాయి. దీంతో ఈ జిల్లాను వరద బాధిత జిల్లాగా ప్రకటించడంతో కేంద్రం నుంచి నిధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.

News September 14, 2024

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు ప్రస్తుత పరిస్థితి ఇది!

image

ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టైన 21మందిలో 20మందికి బెయిల్ వచ్చింది. బిజినెస్‌మ్యాన్ అమన్‌దీప్‌కు మాత్రం లభించలేదు. కేజ్రీవాల్, సిసోడియా, సంజయ్ సింగ్, కవిత, గోరంట్ల బుచ్చిబాబు, మాగుంట రాఘవ, సత్యేంద్ర, విజయ్ నాయర్, శరత్‌రెడ్డి, సమీర్ మహేంద్రు, అమిత్ అరోరా, అభిషేక్ బోయినపల్లి, రాజేశ్ జోషి, అరుణ్ పిళ్లై, అర్వింద్ కుమార్, బెనోయ్ బాబు, గౌతమ్ మల్హోత్రా, చన్‌ప్రీత్, దినేశ్, వినోద్‌కు బెయిల్ వచ్చింది.

News September 14, 2024

MLA గాంధీపై అటెంప్ట్ టు మర్డర్ కేసు

image

TG: శేరిలింగంపల్లి MLA అరెకపూడి గాంధీపై హత్యాయత్నం కేసు నమోదైంది. BRS MLA కౌశిక్‌రెడ్డి ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. గాంధీతో పాటు తన సోదరుడు, కుమారుడు, కార్పొరేటర్లు వెంకటేశ్, శ్రీకాంత్ గౌడ్‌పైనా కేసులు నమోదయ్యాయి. ఇటీవల గాంధీ తన అనుచరులతో కలిసి కౌశిక్‌రెడ్డి ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించేందుకు యత్నించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ సమయంలో కొందరు కౌశిక్‌రెడ్డిపై రాళ్లతో దాడి చేశారు.

News September 14, 2024

UPI పేమెంట్లు చేసే వారికి శుభవార్త

image

కొన్ని UPI లావాదేవీలకు ఒకేసారి రూ.5లక్షల వరకు చెల్లింపులు చేసే సదుపాయం రేపటి(సెప్టెంబర్ 15) నుంచి అందుబాటులోకి రానుంది. ఇటీవల జరిగిన ద్రవ్య పరపతి విధాన సమీక్షలో ఈ నిర్ణయానికి RBI ఆమోదం తెలపగా, తాజాగా NPCI ఇందుకు అనుమతిచ్చింది. ఆదాయపు పన్ను చెల్లింపులు, ఆసుపత్రి, విద్యాసంస్థల బిల్లులు, IPO దరఖాస్తులు, ప్రభుత్వ సెక్యూరిటీల కొనుగోలుకు UPI ద్వారా ఒకేసారి రూ.5లక్షల చెల్లింపులు చేయవచ్చు.

News September 14, 2024

ఇకపై కావాలనుకున్నప్పుడు వర్షం!

image

వర్షాన్ని వద్దనుకుంటే ఆపేలా, కావాలంటే రప్పించేలా భారత శాస్త్రవేత్తలు ప్రణాళికలు రచిస్తున్నారు. తాజాగా ‘మిషన్ మౌసమ్’ను కేంద్రం ఆమోదించింది. అతివృష్టి, అనావృష్టిని నివారించాలనేదే దీని ఉద్దేశం. వడగండ్లు, ఉరుములు, మెరుపులనూ నియంత్రించే దిశగా ఆలోచిస్తున్నారు. క్లౌడ్ సీడింగ్(కొన్ని పదార్థాలను ఆకాశంలోకి పంపి మేఘాలను ప్రభావితం చేయడం) చేయడం వల్ల నీటి ఆవిరి జలంగా మారి వర్షం కురుస్తుంది.

News September 14, 2024

ఈ ఫొటోలో ఉన్న క్రికెటర్‌ను గుర్తు పట్టారా?

image

పై ఫొటోలో ఓ దిగ్గజ క్రికెటర్ ఉన్నారు. టెస్టుల్లో ఆయనొక్కరే క్వాడ్రుపుల్ సెంచరీ చేశారు. ఓ పెద్ద జట్టుకు కెప్టెన్‌గానూ వ్యవహరించారు. తన కెరీర్‌లో 130కిపైగా టెస్టులు, 290కిపైగా వన్డేలు ఆడారు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు హెడ్ కోచ్‌గా పనిచేశారు. ఆయన ఎవరో గుర్తు పట్టి కామెంట్ చేయండి.

News September 14, 2024

8,113 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

image

రైల్వేలో 8,113(గూడ్స్ ట్రైన్ మేనేజర్-3144, టికెట్ సూపర్ వైజర్-1736, టైపిస్ట్-1507, స్టేషన్ మాస్టర్-994, సీనియర్ క్లర్క్-732) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీ అర్హతతో 18-36 ఏళ్లలోపు వారు SEP 14 నుంచి OCT 13 వరకు అప్లై చేయవచ్చు. OCT 16-25 మధ్య దరఖాస్తుల సవరణకు ఛాన్సుంది. SCRలో 478, ECoRలో 758 పోస్టులున్నాయి. ఫీజు: రూ.500(పరీక్షకు హాజరైతే రూ.400 రీఫండ్). వివరాలకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News September 14, 2024

CSK తొలుత సెహ్వాగ్‌ను తీసుకోవాలనుకుంది: బద్రీనాథ్

image

IPL-2008 వేలంలో భారత క్రికెట్ దిగ్గజం ధోనీని కాకుండా వీరేంద్ర సెహ్వాగ్‌ను CSK తీసుకోవాలనుకుందని ఆ జట్టు మాజీ ప్లేయర్ బద్రీనాథ్ తెలిపారు. కానీ అప్పటికే సెహ్వాగ్ ఢిల్లీ నుంచి ఆఫర్ లెటర్ తీసుకున్నారని చెప్పారు. అలా అనుకోకుండా ధోనీ CSKలో అడుగుపెట్టారని పేర్కొన్నారు. ధోనీని జట్టులోకి తీసుకువచ్చేందుకు VB చంద్రశేఖర్‌దే కీలక పాత్ర అని ఆయన పేర్కొన్నారు. IPL 2025లో ధోనీ ఆడేదీ లేనిదీ తెలియాల్సి ఉంది.