News December 9, 2024
కష్టాల్లో ఉన్న స్నేహితులకు రష్యా ద్రోహం చేయదు: రాయబారి
సిరియాలో తిరుగుబాటుతో దేశాధ్యక్షుడు బషర్ అల్ అసద్ రష్యాకు వెళ్లిపోయారు. ఈ ఉదంతంపై వియన్నాలోని అంతర్జాతీయ సంస్థల రష్యన్ ఫెడరేషన్ శాశ్వత ప్రతినిధి మిఖాయిల్ ఉలియానోవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘అసద్, అతని కుటుంబం మాస్కోకు చేరుకుంది. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న స్నేహితులకు రష్యా ఎప్పుడూ ద్రోహం చేయదు. ఇదే రష్యా-అమెరికాకు మధ్య ఉన్న వ్యత్యాసం’ అని రాసుకొచ్చారు.
Similar News
News January 18, 2025
నేటి నుంచి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం
AP: ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టులో నేడు కీలక ఘట్టం ప్రారంభం కానుంది. నీటి నిల్వకు కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు నేటి నుంచి షురూ కానున్నాయి. ఇప్పటికే జర్మనీ మెషీన్లు వచ్చేశాయి. గరిష్ఠంగా 90 మీ. లోతు వరకు నదీగర్భాన్ని తవ్వి ప్లాస్టిక్ కాంక్రీట్‌తో గోడ నిర్మిస్తారు. ఈ కొత్త డయాఫ్రమ్ వాల్ 1396 మీటర్ల పొడవు, 1.5 మీటర్ల మందం ఉంటుంది. కింది నుంచి ఒక్క చుక్క నీరు లీక్ కాకుండా కాపాడుతుంది.
News January 18, 2025
ఇంటర్ సిలబస్‌లో మార్పులు?
TG: మారుతున్న కాలానికి అనుగుణంగా ఇంటర్ సిలబస్‌లో మార్పులు చేసేందుకు విద్యాశాఖ సిద్ధమవుతోంది. ఫిజిక్స్‌లో ఏఐ, రోబోటిక్స్, డేటా సైన్స్ వంటి అంశాలు చేర్చనున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు జువాలజీలో కొవిడ్ పాఠ్యాంశాన్ని చేర్చనున్నట్లు సమాచారం. వచ్చే విద్యా సంవత్సరంలోని పుస్తకాల్లో ఈ అంశాలను ప్రింట్ చేసేందుకు కసరత్తులు చేస్తోంది. మరోవైపు సిలబస్‌ను తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.
News January 18, 2025
నేడు కడప జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
AP: సీఎం చంద్రబాబు ఇవాళ కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులు అర్పించనున్నారు. అనంతరం మైదుకూరులో స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. వినాయక్ నగర్‌లో మున్సిపల్ కార్మికుడి ఇంటికి వెళ్తారు. ZPHS వరకూ కాలినడకన ర్యాలీలో పాల్గొంటారు. పారిశుద్ధ్య కార్మికులతో ముఖాముఖి నిర్వహిస్తారు.